Illu Illalu Pillalu Today Episode Novemberth 28th: సుకన్య వచ్చి అత్తయ్య గారు మిమ్మల్ని పిలుస్తున్నారు..వెంటనే రమ్మని చెప్పారు అని లోపల వాళ్ళని సంతోషంగా ఉండనివ్వకుండా డిస్టర్బ్ చేస్తుంది. మేము మంచి పనిలో ఉంటే నువ్వు డిస్టర్బ్ చేస్తావ్ ఏంటి కొంచెం కూడా నీకు బుద్ధి లేదా అని ప్రేమ సుకన్యపై గట్టిగా అరిచేస్తుంది. కాని వేరొకటి పిలిచింది అని చెప్పగానే ఇద్దరు అక్కడికి వెళ్తారు అయితే అక్కడ రామరాజు వల్లికి విడాకులు ఇవ్వకుండా ఆపేందుకు లాయర్ తో మాట్లాడమని లాయర్ సలహా ఇచ్చాడు అని చెప్తాడు. ఇక అప్పుడే నర్మదా ఫోన్ చేయడంతో వేదవతి మాత్రం అస్సలు మాట్లాడడానికి ఇష్టపడదు. నాకు గవర్నమెంట్ కోడాలంటే అస్సలు ఇష్టం లేదు నాకు నువ్వంటేనే ఇష్టం ప్రేమ అంటూ ప్రేమ పై పొగడ్తలు వర్షం కురిపిస్తుంది. ఇక రామరాజు లాయర్ తో ఎలా మాట్లాడాలి? ఏం మాట్లాడాలి అని రామరాజు నర్మదతో మాట్లాడుతాడు..
నర్మదక్క ఫోన్ చేసింది అత్త ఒకసారి మాట్లాడు అని ప్రేమ ఎంతగా బతిమిలాడిన సరే వేదవతి మాత్రం అస్సలు మాట్లాడకుండా ఉంటుంది. అయితే నర్మదకి ఇంకాస్త కోపం కలిగించేలా వేదవతి ప్రేమ నీ ముద్దు పెట్టుకుంటూ రెచ్చగొడుతుంది కానీ నర్మద మాత్రం నేను వచ్చిన తర్వాత మీ సంగతి చెప్తాను అని అంటుంది అదే రామరాజు వల్లి విషయంలో ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు మా నర్మదా అని కంగారు పడిపోతూ ఉంటాడు. కంగారు పడొద్దు మావయ్య ఇప్పుడు మెడికల్ సర్టిఫికెట్ మనం ఇస్తే కోర్టుకు రాకుండా ఉండొచ్చు. అంటూ ఈ కేసు వాయిదా పడుతుందని నర్మద చెప్పగానే రామరాజు సరే అమ్మ నాకు చాలా భయమేస్తుంది పెద్దోడు ఏం చేస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు అని ఫీల్ అయిపోతూ ఉంటాడు. ఏం జరిగినా కూడా మనమే చూసుకోవాలి కాబట్టి మనము కచ్చితంగా ఏదో ఒకటి చేయాలి అని అందరూ అనుకుంటారు. కానీ నర్మద మాత్రం టెన్షన్ పడిపోతూ ఉంటుంది వల్లి యొక్క జీవితం ఇలా మారిపోయింది ఇక చందు బావ రియాక్షన్ ఎలా ఉంటుందో నాకు అర్థం కావడం లేదు అని అనుకుంటుంది.
ఇక ప్రేమ ధీరజ్ ఇద్దరు కలిసి ట్రావెల్ ఆఫీస్ కి వెళ్తారు అయితే అక్కడ ప్రేమని డోర్ తీయు నీ అదృష్ట చేయితో మ్యాజిక్ జరుగుతుంది కారు తనంతట అదే వచ్చేస్తుంది అని చెప్తాడు. ప్రేమ అలా డోర్ తీయగానే అక్కడ ఒక వ్యక్తిని కట్టేసి ఉండడం చూసి ప్రేమ దయ్యం దెయ్యం అంటూ షాక్ అవుతుంది. దెయ్యం కాదే మనిషి నీకు అర్థం కావడం లేదా అనేసి దీని అంటాడు. అయితే మన కారును తీసుకెళ్లిన రౌడీ గాడు వీడే కాబట్టి మనం వీడిని తీసుకొని వచ్చాం కాబట్టి కారు అదే వస్తుంది అని ధీరజ్ అంటాడు. అయితే ప్రేమ రౌడీని చూసి ఏంట్రా నువ్వు ఏం పని చేస్తున్నావ్? నీకైనా అర్థమవుతుందా అనేసి ధీరజ్ పై సీరియస్ అవుతుంది మొత్తానికి ధీరజ్ అనుకున్న ప్లాన్ ప్రకారం కారు తాళాలను రౌడీలు తెచ్చి ఇస్తారు. ప్రేమ మాత్రం ధీరజ్ ఎందుకు ఇలా చేస్తున్నాడు అని కంగారు పడిపోతూ ఉంటుంది.
ఇక వల్లి తో విడాకులు తీసుకోవాలి అని చెందు చాలా కష్టపడి పోతూ ఉంటాడు. విడాకులు ఇచ్చి అంజలికి దగ్గర అవ్వాలని తన మనసులో గట్టిగా అనుకుంటాడు అయితే కోర్టుకి లాయర్ ని వెతుక్కుంటూ వెళ్తాడు చందు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత లాయరు కేసు వాయిదా పడింది. వాళ్ళు మెడికల్ సర్టిఫికెట్ ని ఇచ్చారు అని చెప్పగానే అవునా ఎందుకిచ్చారు. అందుకే ఇదంతా జరిగిందా వల్ల ఒక మోసపు బ్యాచ్ అని చందు ఎంత చెప్పినా సరే లాయర్ మాత్రం అస్సలు వినకుండా వాళ్ళు సబ్మిట్ చేశారు కదా.. ఇంక మనం ఏమి చేయలేము మళ్లీ ఈసారి మాత్రమే దాన్ని చూడాలి అనేసి అంటారు. దాని అంతు చూస్తాను అది ఇంకా మోసాలు చేస్తూనే ఉందా అని చందు చాలా కంగారు పడిపోతూ ఉంటాడు.. ఆవేశంగా వల్లిని కలవాలి అని అక్కడికి వెళుతుండగా వెనకాలే అంజలి కూడా వెళ్తుంది. మొత్తానికి ఇవాళ ఎపిసోడ్ మాత్రం కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..