E-Paper
Advertisement

తిరుప్పరంకుండ్రం దీపం వివాదం.. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన ప్రధాని మోదీ.. ఎక్స్‌లో ఆసక్తికర పోస్ట్!

తిరుప్పరంకుండ్రం దీపం వివాదం.. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన ప్రధాని మోదీ.. ఎక్స్‌లో ఆసక్తికర పోస్ట్!
Advertisement

PM Narendra Modi: మదురైలోని రుప్పరంకుండ్రం కొండ దీపం వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. వివాదాస్పద దీపస్తంభం (దీపత్తూన్) వద్ద శనివారం కార్తీక దీపం వెలిగించాలని కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఎక్స్ వేదికగా సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఆలయ వివాదం గురించి ఎక్కడ ప్రస్తావించకుండానే ఇంగ్లీషు, తమిళం, హిందీ భాషల్లో పోస్ట్ పెట్టారు. ఇది సుబ్రహ్మణ్య స్వామికి దక్కిన విజయం అని అర్థం వచ్చేలా ‘వెట్రివేల్ మురుగనుక్కు ఆరోగరా’ అనే శ్లోకాన్ని రాసుకొచ్చారు.

దీపం వెలిగించాలన్న తమ ఆదేశాలను బేఖాతరు చేసినందుకు తమిళనాడు ఉన్నతాధికారులపై శుక్రవారం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు కోర్టు ధిక్కార చర్యలు ప్రారంభించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతో పాటు మరో 13 మందికి నోటీసులు జారీ చేసింది. నవంబర్ 24న రాతి స్తంభంపై దీపం వెలిగించకపోవడం ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించడమేనని ధర్మాసనం అభిప్రాయపడింది.

Advertisement

రాజకీయ ఒత్తిడి కారణంగానే అధికారులు అలా వ్యవహరించారన్న ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఫోన్ కాల్ డేటా, అధికారిక రికార్డులను సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. అంతేకాకుండా అరుళ్మిగు సుబ్రమణ్యస్వామి ఆలయ ధర్మకర్తల మండలిని సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది. తాత్కాలిక పాలన బాధ్యతలను హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులిద్దరికి అప్పగించింది. ఇవాళ (శనివారం) దీపస్తంభంపై దీపం వెలిగించాలని ఆదేశించింది. ఉచ్చిప్పిళ్లైయార్‌ ఆలయ మండపంపై ఇప్పటికే వెలుగుతున్న దీపంలోంచి అగ్నిజ్వాలను తీసి దీపస్తంభంపై వెలిగించవచ్చని, భక్తులను కూడా దీపం వెలిగించేందుకు అనుమతివ్వొచ్చని పేర్కొంది.

Advertisement

Also Read: మహారాష్ట్రలో మళ్లీ పొలిటికల్ ట్విస్ట్.. ఎన్డీఏలోకి ఎన్సీపీ (ఎస్పీ)? శరద్ పవార్ పెట్టిన కండిషన్స్ ఇవే!

మరోవైపు సుప్రీంకోర్టు తీర్పుపై స్పందిస్తూ తమిళనాడు బీజేపీ ఉపాధ్యక్షుడు కేపీ రామలింగం విజయ్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. విజయ్ ప్రభుత్వం హిందూ వ్యతిరేక ధోరణి అవలంభిస్తోందని ఆరోపించారు. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ దీపత్తూన్ పై దీపం వెలిగించేందుకు టీవీకే ప్రభుత్వం నిరాకరించిందన్నారు. ఈ చర్యతో విజయ్ హిందూ వ్యతిరేక ముసుగు బయటపడిందన్నారు. సుప్రీంకోర్టు తీర్పుకు కృతజ్ఞతగా రాష్ట్రంలోని 2,116 ఆలయాల్లో బీజేపీ కార్యకర్తలు, మురుగన్ భక్తులు ఇవాళ దీపాలు వెలిగించాలని రామలింగం పిలుపునిచ్చారు.

Also Read: బంతి చేతిలో ఉండగా సికందర్ రజా ఫోజులు, రనౌట్ నుంచి డుప్లెసిస్ గ్రేట్ ఎస్కేప్..ఇదెక్కడి మాస్ రా మామా!

Tags

Related News

మహారాష్ట్రలో మళ్లీ పొలిటికల్ ట్విస్ట్.. ఎన్డీఏలోకి ఎన్సీపీ (ఎస్పీ)? శరద్ పవార్ పెట్టిన కండిషన్స్ ఇవే!

మహిళా కలెక్టర్‌పై లైంగిక వేధింపులు.. టీవీకే ఎమ్మెల్యే అరుళ్ విఘ్నేష్ అరెస్టు.. అసలేం జరిగిందంటే?

‘రామాయణ’ చిత్రానికి సుప్రీం కోర్టులో భారీ ఊరట.. పిటిషనర్లకు ధర్మాసనం స్ట్రాంగ్ కౌంటర్!

యూపీలో సీట్ల లొల్లి.. కాంగ్రెస్‌తో చీలికలంటూ ప్రచారం.. అఖిలేష్ యాదవ్ క్లారిటీ ఇదే!

మమతా బెనర్జీకి భారీ ఊరట.. స్పీకర్‌కు కలకత్తా హైకోర్టు షాక్.. ప్రతిపక్ష నేతగా రితబ్రత బెనర్జీ నియామకం కొట్టివేత!

గెలుపు కోసం స్కెచ్.. డ్రెస్ మార్చి మూడు రకాలుగా నామినేషన్ వేసిన మహిళ.. చివరకు ఏమైందంటే?

మగ పోలీసు పెళ్లిని అడ్డుకున్న మహిళా కానిస్టేబుల్.. ఆఖరి నిమిషంలో రచ్చ రచ్చ.. కారణం ఏంటంటే?

Big Stories

Advertisement
×