E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode November 28th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రఘువీర్ కు షాక్ ఇచ్చిన రాజు, ఇందు

Brahmamudi Serial Today Episode November 28th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రఘువీర్ కు షాక్ ఇచ్చిన  రాజు, ఇందు
Advertisement

Brahmamudi serial today Episode:  ఐశ్వర్యను లక్కీ పొగుడుతుంటాడు. నువ్వు ఏ డ్రెస్‌ వేసుకున్నా బాగానే ఉంటావు కానీ గెస్ట్‌ వస్తున్నాడు కదా పద్దతిగా చీర కట్టుకుని ఉంటే బాగుండు అంటాడు. అందుకు ఐశ్వర్య కోపంగా నేను ఏ డ్రెస్‌ వేసుకోవాలో నువ్వే డిసైడ్‌ చేస్తావా..? అంటుంది. అరేయ్‌ నువ్వు వెధవ అయినా సరే ఇప్పుడు కరెక్టుగా మాట్లాడావురా అంటే.. కలిసి పెరిగారు కదా రాజు కొన్ని అలవాట్లు వచ్చి ఉంటాయి అంటుంది ఇందు. ఇందు నన్ను వాడితో పోల్చకు వాడొక మిత్రద్రోహి, చీటర్‌ అంటాడు.

అపర్ణ కూడా కోపంగా లక్కీ చెప్పిన దాంట్లో తప్పేంటి ఐశ్వర్య పెళ్లికి ముందు ఎలా ఉన్నా సరిపోతుంది కానీ పెళ్లాక పద్దతిగా చీర కట్టుకోవాలి అంటూ చెప్పగానే.. ఇది జెన్‌ జీ జనరేషన్‌ మీరేం చెప్పొద్దు అంటూ తిడుతుంది ఐశ్వర్య. ఐశ్వర్యను కోపంగా నాన్నమ్మ చెప్పిన దాంట్లో తప్పేముంది ఐషు అంటే ఇన్ని రోజులు కంపెనీలో ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పారు. ఇప్పుడు బట్టలు ఎలా వేసుకోవాలి అంటున్నారు.. ఇక రేపటి నుంచి ప్రతిదీ మీరు చెప్పినట్టే ఉండాలంటారేమో.. వచ్చే గెస్ట్‌ కొన్ని వేల కోట్లకు అధిపతి అదీకాక నా కంపెనీలో పార్ట్‌నర్‌ కూడా అతనితో నేను ఎలా ఉండాలో ఎలా నడుచుకోవాలో తెలుసుకోండి అంటూ చెప్తుంది.

Advertisement

రఘువీర్‌ వస్తాడు. ఐశ్వర్య అందరికీ పరిచయం చేస్తుంది. రఘువీర్‌ తనను తాను పరిచయం చేసుకుని నేను ఇంత త్వరగా ఈ ఇంటికి వస్తానని అనుకోలేదు కదా అంటాడు. ఇక్కడ కొడితే నీ ఇజ్జత్‌ పోతుందిరోయ్‌ మూసుకుని వచ్చిన పని చేసుకుని వెళ్లిపో అంటాడు. ఏంటి రాజు అంటున్నావు అంటూ ఐశ్వర్య అడిగితే.. ఏం లేదు నువ్వాగు ఐషు అంటూ చెప్తుంటే.. శేషు వెటకారంగా మాట్లాడుతూ.. సెటైర్లు వేస్తుంటాడు. రఘువీర్‌, ఐశ్వర్య ఇరిటేట్‌ అవుతుంటారు. ఇంకో ఐదు నిమిషాలు ఉంటే ఇంట్లోంచి పారిపోతాడేమోనని ఇందు అంటుంది. అప్పుడే ఐశ్వర్య ఇంట్రడ్యూస్‌ అయిపోయింది ఇక నా ఇల్లు చూపిస్తాను రా అంటే ఏంటి నీ ఇల్లా నీదెలా అవుతుంది అంటూ ప్రశ్నిస్తుంటే.. ఇందు అడ్డు పడి ఐషు ఇది నీ ఇల్లు కూడా వెళ్లి ఇల్లు చూపించు అంటుంది. అందరూ వెళ్లిపోతారు. లక్కీ బాధగా శేషుతో చూశావా మామ అందరినీ పరిచయం చేసి నన్ను పరిచయం చేయలేదు అంటూ బాధపడుతుంటాడు. ఉండని కానీ ముందు వాళ్లు నీ బెడ్‌ రూంలోకి వెళ్తున్నారు చూడు అనగానే.. లక్కీ పరుగెత్తుకుంటూ వెళ్తాడు.

రూంలోకి వెళ్లిన లక్కీని ఐశ్వర్య తిడుతుంది. ఎందుకొచ్చావని అడిగితే వాటర్‌ తీసుకొచ్చానని చెప్తాడు లక్కీ. ఐశ్వర్య తిడుతుంటే రఘువీర్‌ ఆపి వాటర్‌ తీసుకుని తాగి నువ్వు లక్కీ కదా ఐశ్వర్య హస్బెండ్‌ కదా అంటాడు లక్కీ ఎగ్జైంటింగ్‌ గా అవునని చెప్పగానే.. ఐశ్వర్య రఘువీర్‌ను తీసుకుని బయటకు వెళ్తుంది. అందరూ భోజనం చేస్తుంటే.. లక్కీ వెళ్తాడు. ఐశ్వర్య కోపంగా చూస్తూ.. అక్కడ మామయ్య పక్కన కూర్చో అంటే భర్త పక్కన కూర్చుంటే గౌరవం దూరం పెడితే అగౌరవం అంటూ అపర్ణ ఇందు తిడతారు. రాజు, రఘువీర్‌ను అవమానిస్తాడు. అందుకు ఐశ్వర్య, రేఖ కూడా రాజును అవమానిస్తారు. ప్లాష్‌బ్యాక్‌ మొత్తం చెప్పేస్తారు. అందుకు అపర్ణ తిడుతుంది.

Advertisement

తర్వాత రఘువీర్‌ వెళ్తుంటే.. ఫస్ట్‌టైం మా ఇంటికి వచ్చారు మీకు ఎలా అనిపించింది అంటే మళ్లీ మళ్లీ రావాలి అనిపించింది ఇంకా చెప్పాలంటే ఇక్కడే ఉండాలనిపిస్తుంది అంటాడు. ఇల్లెలా ఉందని గార్డెన్‌ ఎలా ఉందని ఐశ్వర్య అడిగితే.. అన్ని బాగానే ఉన్నాయి మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఐశ్వర్య ఉంది కదా అంటాడు. ఐశ్వర్య, ఐషు ఒక్కటే అంటూ బై చెప్పి లోపలికి వెళ్లిపోతుంది ఐశ్వర్య. రాజు, ఇందు వచ్చి అప్పుడే వెళ్లిపోతున్నావా..? నీకో షాకింగ్‌ చూపించాలా.? అంటూ ప్రశాంత్‌ను పిలుస్తారు. ప్రశాంత్‌ రాగానే రఘువీర్‌ షాక్‌ అవుతాడు. నిజం తెలిసిపోయిందా..? అయితే ఏం చేస్తారు కొడతారా..? చంపుతారా..? ఏంటి అలా చూస్తున్నారు చెప్పండి అంటూ రఘువీర్‌ అడిగితే కేసు పెడితే ప్రశాంత్‌ సాక్ష్యం చెబితే పోలీసులు ఏం చేస్తారో మేమేం చెప్తాము అంటారు ఇందు, రాజు. అంతా అపర్ణ పై నుంచి చూస్తుంటుంది.

తర్వాత ఇందును రూంలోకి తీసుకెల్లి రఘువీర్‌ మీద మీకెందుకు అంత కోపం. మీ మధ్య ఆ రఘువీర్‌కు ఏం జరిగింది. ఎందుకు వాడికి అంత కోపం, పగ అంటూ అడుగుతుంది. ఇందు జరిగింది చెబితే.. వాడు ఇదంతా ఒక్క చెప్పు దెబ్బ కోసం చేస్తున్నాడంటే నేను నమ్మను దీని వెనక ఇంకేదో ఉంది అంటూ అపర్ణ చెబుతుంది. నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నావు నాన్నమ్మ ఏదైనా ఉంటే మేము చూసుకుంటాము అని చెప్తే.. అదే తప్పు మీరు చేయోద్దు అంటున్నాను అంటూ హెచ్చరిస్తుంది అపర్ణ. ఇంతలో  ఇవాళ్టీ బ్రహ్మముడి ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Podarillu Today Episode : శైలు మాటతో వరాలు మైండ్ బ్లాక్.. చక్రికీ దిమ్మతిరిగే షాక్.. శైలును వదిలేసిన కేశవ..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ రివర్స్.. అవని దెబ్బకు అవుట్.. ఇంట్లో దెయ్యం..

Gundeninda GudiGantalu Today episode: బాలు మాటతో మీనా కన్నీళ్లు.. మనోజ్ కక్కుర్తి.. సుమతి పెళ్లి క్యాన్సిల్..?

‘జగదాత్రి’  హీరోయిన్ షాకింగ్ నిర్ణయం..? సీరియల్స్ కు గుడ్ బై చెప్తుందా?

Saturday TV Movies : శనివారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..

కనకవ్వ వర్సెస్ నాగవ్వ.. పాటలతోనే పోటీ.. వీరిద్దరిలో టాప్ ఎవరు?

పెళ్లి పీటలు ఎక్కిన ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ నటుడు చందు..

Big Stories

Advertisement
×