Podarillu Chakri : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.. ఒక్కో సీరియలు ఒక్కో స్టోరీ తో రావడంతో జనాలు వీటిని చూసేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా స్టార్ మా చానల్లో ప్రసారమవుతున్న పొదరిల్లు సీరియల్ కూడా ఒకటి.. ఈ సీరియల్ జనాలని విపరీతంగా ఆకట్టుకుంటూ వస్తుంది. గత ఏడాది డిసెంబర్లో ప్రారంభమైన సీరియల్ రోజురోజుకీ మంచి డిమాండ్ ని సొంతం చేసుకుంటూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సీరియల్ లో హీరోగా నటిస్తున్న చక్రి గురించి సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. అందులో తాజాగా చక్రీ గురించి మరో వార్త షికారు చేస్తుంది. మరి అదేంటో ఒకసారి మనం ఇక్కడ తెలుసుకుందాం..
పొదిరిల్లు సీరియల్ లో హీరోగా నటించిన చక్రి గురించి ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది. తాజాగా ఈయన గురించి మరోసారి ఒక వార్త షికారు చేస్తుంది. చక్రి తాజాగా జిమ్ములో కండలు పెంచేందుకు తెగ కష్టపడి పోతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. జిమ్ములో కసరత్తులు చేస్తూ చెమటలు చిందిస్తున్న వీడియోని చక్రి తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో చక్రి కండలు చూపిస్తూ ఫోటోలకి ఫోజులు ఇచ్చాడు. అది చూసిన లేడీ ఫ్యాన్స్ చక్రి ఏమున్నాడు రా బాబు అంటూ ఆ వీడియోకి కామెంట్లు కూడా పెడుతున్నారు. మరి అయినా సిక్స్ ప్యాక్ కోసం ట్రై చేయడం అనేక అనుమానాలు క్రియేట్ చేస్తుంది.. సీరియల్స్ కి గుడ్ బై చెప్పేసి సినిమాలోకి వెళ్తుందా అన్న అనుమానం కూడా జనాల్లో వినిపిస్తుంది మరి ఎందుకు ఏమిటి అనేది త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి ఆ వీడియోలో చక్రి కండలు ఎలా ఉన్నాయో మీరు కూడా ఒకసారి ఇక్కడ చూసేయండి.
?srtk=MTliZ3VhNDZlOXJ0Zw==
పొదిరిల్లు సీరియల్ చక్రి పాత్రలో నటిస్తున్న హీరో అసలు పేరు దీపక్ కుమార్.. ఈయన తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన నటుడు. కోలీవుడ్లో పలు సినిమాలు సీరియల్స్లలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు దీపక్.. ప్రస్తుతం ఈయన తెలుగులో పొదరిల్లు సీరియల్ నటిస్తున్నాడు అంతేకాదు తమిళంలో మరో సీరియల్ లో కూడా నటిస్తూ బిజీగా ఉన్నాడు. చక్రి కి రియల్ లైఫ్ లో పెళ్లయిందని విషయం అందరికీ తెలిసిందే. చక్రి తన భార్యతో కలిసి డాన్స్ చేస్తున్న వీడియోలు ఫోటోలు కూడా ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇకపోతే ఈ చక్రి సినిమాలలో కూడా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగులో మొదటి సీరియల్ తోనే మంచి క్రేజ్ ని సంపాదించుకున్న చక్రి రెమ్యూనరేషన్కూడా భారీగానే వసూలు చేస్తున్నాడని టాక్ వినిపిస్తుంది.. మొత్తానికి నెలకు లక్షల్లో సంపాదిస్తూ బిజీగా ఉన్నాడు చక్రి..
Also Read :గురువారం మూవీ లవర్స్ కు పండగే.. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..