AP Invest: ఏపీకి పరిశ్రమలు రప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. వీలు కుదిరినప్పుడల్లా పెట్టుబడుల సమిట్ పెట్టడం, వివిధ దేశాలను పర్యటించడం చేస్తున్నారు. ఈ క్రమంలో షెన్‌జెన్‌కు చెందిన ఒక ఎలక్ట్రానిక్స్ ఫ్యాక్టరీ ఏపీపై ఫోకస్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై మంత్రి లోకేష్ రియాక్ట్ అయ్యారు.
ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడు దారులను ఆంధ్రప్రదేశ్ కు రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. పెట్టుబడు దారులను ఆహ్వానించడం కాదు, అందుకు అనుగుణంగా పాలసీల్లో మార్పులు చేర్పులు చేశారు. జపాన్ మొదలు అమెరికా వరకు పారిశ్రామిక వేత్తల చూపు పడింది.
చైనాకు చెందిన కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అవుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో చైనాకు చెందిన ఓ ఎలక్ట్రానిక్స్ సంస్థ భారీ పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అవుతోంది. ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని ఓ వ్యక్తి.. మంత్రి లోకేష్ దృష్టికి తెచ్చారు. మంత్రి లోకేశ్ రియాక్ట్ అయ్యారు. ఈ విషయం తెలియగానే అధికారులను అప్రమత్తం చేశారు.
చైనా సోర్సింగ్, లాజిస్టిక్స్ నిపుణుడు ప్రావిన్ గణేశన్ ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా తెలిపారు. దక్షిణాదిలో పెట్టుబడులు పెట్టేందుకు షెన్‌జెన్‌కు చెందిన ఓ ఎలక్ట్రానిక్స్ కంపెనీ తనను సంప్రదించిందని అందులో రాసుకొచ్చారు. పెట్టుబడులను ఆకర్షించడం, వేగంగా అనుమతులు మంజూరు చేయడంలో ఏపీ ముందు వరుసలో ఉందని వివరించారు. సులభతర వాణిజ్యంలో ఆ రాష్ట్రం అగ్రగామిగా ఉందని సూచించినట్లు పేర్కొన్నారు. ఆయన చేసిన పోస్టును మంత్రి లోకేశ్‌ను ట్యాగ్ చేస్తూ, #ChooseAP, #ChooseSpeedChooseAP అనే హ్యాష్ ట్యాగ్‌లను జత చేశారు.
ALSO READ: అర్నబ్ తుఫాను అల్లకల్లోలం.. నేరుగా రంగంలోకి దిగిన సీఎం చంద్రబాబు
గణేశన్ చేసిన పోస్ట్‌పై మంత్రి లోకేశ్ స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌పై ఉంచిన నమ్మకానికి ధన్యవాదాలని తెలిపారు. పెట్టుబడులకు సింగిల్ విండో విధానం ద్వారా సేవలందించే ఏపీ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డ్ ఈడీబీ అధికారులను రంగంలోకి దించారు. ఆ కంపెనీ ప్రతినిధులతో సంప్రదింపులు జరపాలని అధికారులను ఆదేశించారు మంత్రి లోకేష్.
Thanks a lot for your confidence in AP! @AP_EDB please get in touch. https://t.co/F88N7ZRj9A
— Lokesh Nara (@naralokesh) October 28, 2026