E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode October 29th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజును తీసుకెళ్లిన చలపతి – రెచ్చిపోయిన రేఖ

Brahmamudi Serial Today Episode October 29th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజును తీసుకెళ్లిన చలపతి – రెచ్చిపోయిన రేఖ
Advertisement

Brahmamudi serial today Episode: ఇందు, రాజుల పెళ్లి నిజమైన పెళ్లి కాదని.. రాజు అద్దె మొగుడిగా నటిస్తున్నాడని లక్కీ చెప్పడంతో అందరూ షాక్‌ అవుతారు. ఐశ్వర్య మరింత రెచ్చిపోతుంది. నేను ఎప్పుడో చెప్పాను కానీ మీరే నమ్మలేదు.. ఇప్పుడు క్లోజ్‌ ఫ్రెండ్‌ అయిన లక్కీ కూడా చెప్పాడు ఇప్పటికైనా నమ్ముతారా..? అంటూ తిడుతుంది. రేఖ కోపంగా ఎంత మోసం చేశావు రాజు.. అద్దె మొగుడిగా వచ్చి మా మీదే పెత్తనం చెలాయించావు.. అంటూ తిడుతుంది. భ్రమరాంబ కూడా కోపంగా చిల్లర కోసం వేషాలు వేసుకునే నువ్వు ఇక్కడ చిల్లర బుద్దులు చూపించావా..? అంటుంది.

చీటింగ్‌ చేసి ఇంట్లో అడుగుపెట్టావా..? అంటూ భూషణ్‌ అంటాడు. నాటకం ఆడుతూ కూడా ఎంత బిల్డప్ ఇచ్చావురా నాటకం ఆడుతూ కూడా మా మీద పెత్తనం చేవాశా అంటుంది బ్రమరాంబ. ఇందు కోపంగా రాజును ఎవరూ ఏమీ అనకండి.. అంటే.. రేఖ కోపంగా ఏయ్‌ నువ్వు నోరు మూయ్‌.. రాజు ఒక్క క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు వెళ్లు ఇక్కడి నుంచి అంటూ తిడుతుంటే.. అపర్ణ కోపంగా ఏయ్‌ రేఖ ఇక చాలు ఆపు రాజు ఇంట్లో ఉండాలా వద్దా అని డిసైడ్‌ చేయాల్సింది నేను అంటుంది. అంటే ఇంత జరిగాక కూడా ఈ మోసగాన్ని ఇంట్లో ఉంచాలి అనుకుంటున్నారా..? అని రేఖ అడిగితే.. అవును ఇక్కడ మమ్మల్ని మోసం చేయాలి అనుకుంటున్న చాలా మంది కంటే ఈ రాజు చాలా ఉత్తముడు అని చెప్పగానే..

Advertisement

ఓ ఈలోపే మీ దగ్గర ఇంప్రెషన్ కొట్టేశాడమన్నమాట అని ఐశ్వర్య అంటే తనకు ఇంప్రెషన్‌ కొట్టేయాలన్న అవసరం లేదు అంటుంది ఇందు. ఓ పిల్లికి ఎలుక సాక్ష్యం ఉన్నట్టుంది అంటూ భ్రమరాంబ అంటే.. మీకు ఎలాగైనా ఉండనివ్వండి.. కానీ అది మాకు అనవసంర.. ఇందు, రాజుల పెళ్లి అప్పుడు అబద్దం అయ్యుండొచ్చు.. కానీ ఇప్పుడు నిజం చేస్తాను అంటూ అపర్ణ చెప్పగానే.. అలా ఎలా చేస్తారండి వాడు ఎవర ఏంటి..? వాడి పుట్టుపూర్వోత్తరాలు ఏంటి..? ఇవేమీ తెలుసుకోకుండా దుగ్గిరాల ఇంటికి అల్లుడిని ఎలా చేస్తారు అని ప్రశ్నిస్తే.. అసలు వాడు ఎవరనుకుంటున్నారు..? అంటూ అపర్ణ నిజం చెప్పబోతే.. ఇందు ఆపేస్తుంది.

రేఖ నీ తమ్ముడిని ఈ ఇంటికి అల్లుడిని ఎలా చేసిందో… వాడిని అలాగే చేస్తాను అంటుంది అపర్ణ. అప్పుడే చలపతి వస్తాడు. రాజు, ఇందుల పెళ్లి చేయడం తనకు ఇష్టం లేదని వస్తాడు. అందుకు అపర్ణ ఎందుకు ఇష్టం లేదని అడుగుతుంది అపర్ణ. ఒకప్పుడు మీ కుటుంబం ఎన్నో కష్టాలు అనుభవించింది ఇప్పుడు నా కొడుకును చూసి చూసి ఈ కష్టాల్లోకి ఎలా నెడతాను అంటాడు. అపర్ణ మాత్రం రాజు నువ్వు చెప్పు ఇందును చేసుకోవడం ఇష్టమేనా..? అని అడుగుతుంది. రాజు మాత్రం మా నాన్న ఇష్టమే నా ఇష్టం అంటూ చెప్పగానే.. చలపతి, రాజును తీసుకుని వెళ్లిపోతాడు. అపర్ణ, ఇందు ఏడుస్తుంటారు.

Advertisement

తర్వాత ఇందు ఏడుస్తుంటే.. అపర్ణ వెళ్లి తిడుతుంది. ఇప్పటికైనా రాజు ఈ ఇంటి వారసుడు అని చెప్పాల్సింది. అయినా ఈ ఇంటి వారసుడిని తీసుకెళ్లడానికి వాళ్లెవరు అంటూ నిలదీస్తుంది. దీంతో ఇందు ఇరవై ఏళ్లుగా వాళ్లు బావను పెంచారు మనకన్నా వాళ్లకు ఎక్కువ బాధ్యత ఉంటుంది అంటూ ఇందు చెప్పగానే.. గుడిలో స్వామిజీ చెప్పిన మాటలు మర్చిపోయావా..? రాజుకు ఉన్న గండం గురించి మర్చిపోయావా..? అంటూ ఏడుస్తూ.. అవసరం అయితే ఆ చలపతి కాళ్లు పట్టుకుంటాను ఇప్పుడే వెళ్లి మాట్లాడదాం పదా అంటూ ఇందును తీసుకుని వెళ్లిపోతుంటే..

రేఖ అడ్డు పడుతుంది. మీరు బయటకు వెళితే మీడియాలో మొత్తం మీ బాగోతమే వస్తుంది అంటూ భయపెడుతుంది. దీంతో అపర్ణ, ఇందు ఇంట్లోనే ఆగిపోతారు. అపర్ణ మాత్రం ఈ తాటాకు చప్పుళ్లకు బయపడొద్దని మనం వెళ్దామని చెప్తుంది అపర్ణ. దీంతో ఇందు కంపెనీ పేరు పోయిందంటే మనల్ని నమ్ముకున్న లక్షల మంది రోడ్డున పడతారు. కంపెనీని నమ్ముకన్న లక్షల మంది జీవితాన్ని నాశనం చేయడం నాకు ఇష్టం లేదు నాన్నమ్మ అంటూ రూంలోకి వెళ్లిపోతుంది ఇందు.

లక్కీ, రాజు దగ్గరకు వెళ్లి సారీ చెప్తాడు. నేను అలా ఎలా చెప్పానో నాకు నా మీదే కోపం వస్తుంది. చిన్నప్పటి నుంచి నన్ను బాగా చూసుకున్న నువ్వే అర్థం చేసుకోకపోతే ఎలారా అంటూ బాధపడుతుంటే.. రాజు కోపంగా తిడతాడు. నువ్వు చేసిన పని వల్ల ఎవరికి మంచి జరిగింది. నా మీద నమ్మకంతో తన జీవితాన్నే ఊహించుకంది అంటూ తిడుతుంటే.. మావా నేను కావాలని చేయలేదురా అంటూ చెప్పబోతుంటే.. రాజు కోపంగా తిడతాడు. నన్ను టార్గెట్ చేయాల్సింది కానీ ఇందు ఏం చేసిందిరా..? వెళ్లిపో నాకు దూరంగా వెళ్లిపో అంటూ తిడతాడు. నా తప్పును సరి చేసుకోవడానికి ఏం చేయాలో చెప్పు మావ అంటూ లక్కీ ఏడుస్తుంటాడు. నువ్వేం చేయలేవురా.. వెళ్లిపో నా కంటకి కనిపించకుండా వెళ్లిపో అంటూ తిడతాడు రాజు. ఇంతలో  ఇవాళ్టీ బ్రహ్మముడి ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 29th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినికి పెద్ద షాక్ ఇచ్చిన జ్యోత్స్న  

Podarillu Today Episode : నిజం తెలిసి కన్నీళ్లు.. అయ్యో పాపం కన్నా.. ఇంట్లో నుంచి మహా వెళ్తుందా..?

Illu Illalu Pillalu Today Episodes: రామరాజు ఇంట బతుకమ్మ సంబరాలు.. వల్లి కన్నీళ్లు.. భద్ర మాస్టర్ ప్లాన్..

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. అక్టోబర్ నెల హైలెట్స్..

Intinti Ramayanam Today Episode: శ్రీకర్ ప్లాన్ సక్సెస్.. పార్వతికి టెన్షన్.. కమల్ కు నిజం తెలుస్తుందా..?

Podarillu Chakri : అయ్యో పాపం.. చక్రీ ఎంత కష్టపడుతున్నాడో..?

Thursday TV Movies : గురువారం మూవీ లవర్స్ కు పండగే.. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×