Illu Illalu Pillalu Today Episode October 29th : నర్మదా సాగర్ ఫైల్ మీద సంతకం పెట్టిన దాన్ని చూపించి ఇది నువ్వే నా చేసింది అని అడుగుతుంది. ఏదో ఒకటి చేశారు కదా అని నువ్వు నోటికి వచ్చినట్టు మాట్లాడితే నేను అస్సలు ఊరుకోను నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు.. ఇక సాగరు నేను లంచాలు తీసుకున్నానని నువ్వు నిరూపించగలవా ఏం మాట్లాడుతున్నావో తెలుసా నర్మదా నీకు అని సీరియస్ అయ్యి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఏంటే నర్మదా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు సాగరు ఎందుకు అలా లంచాలు తీసుకుంటాడు ఏం మాట్లాడుతున్నావో కొంచమైనా అర్థమవుతుందని వేదవతి అంటుంది.. కానీ అందరూ కూడా నర్మదా బాధపడుతుంటే వాడు అలా చేసి ఉండడే వాడు కచ్చితంగా చెబుతున్నాడు కదా అని అంటారు కానీ నర్మద మాత్రం చాలా కన్నీళ్లు పెట్టుకొని బాధపడిపోతూ ఉంటుంది..
వల్లి తన జీవితం ఇలా అవడానికి కారణం తన తల్లి అని చాలా బాధపడిపోతూ ఉంటుంది. అయితే అప్పుడే అక్కడికి వచ్చిన భాగ్యం నువ్వు వాళ్ల మీద కేసు పెట్టి నిన్ను అత్తారింటికి పంపించాలి అని అనుకున్నాము కానీ నువ్వు మొత్తం వృధా చేశావు కాబట్టి నీ జీవితం నువ్వే చేతులారా నాశనం చేసుకున్నావని భాగ్యం అంటుంది. కానీ వల్లి నా జీవితం ఇలా అవడానికి కారణం నువ్వే కదా నీ వల్లే నా జీవితం ఎలా మారిపోయింది అని బాధ పడిపోతూ ఉంటుంది. ఇక ఆనంద్ రావు వల్లి చేత భోజనం తినిపిస్తాడు అది కన్న తండ్రి కూతుర్ల సెంటిమెంట్ సీన్ కి హైలైట్ గా నిలుస్తుంది. అటు చందు తన భార్యకి విడాకులు ఇవ్వాలని అనుకుంటాడు.
రామరాజు వెంట బతుకమ్మ సంబరాలు మొదలైపోతాయి. ఇంట్లోనే ఆడవాళ్ళందరూ కూడా బతుకమ్మను చేయడానికి అంత సిద్ధం చేస్తారు. అందరూ కూడా చాలా సరదాగా ఆడవాళ్ళందరూ కూర్చుని బతుకమ్మని తయారు చేస్తూ ఉంటారు. మన ఇంటి నుంచి నాలుగు బతుకమ్మలు వెళుతున్నాయి ఈ ఊర్లో ఎవరి ఇంటి నుంచి కూడా బతుకమ్మలు నాలుగు వెళ్ళలేదు అని అమూల్య చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది. అయితే అప్పుడే వేదవతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఏమైంది ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు అని అందరూ అడుగుతారు. అయితే వళ్లీ కూడా ఉంటే బాగుండేది అని చాలా బాధ పడిపోతుంది. వల్లి ఉనింటే తను కూడా బతుకమ్మను చేసి ఉండేది తన చేతులారా తానే తన జీవితం నాశనం చేసుకుంది అని కన్నీళ్లు పెట్టుకుంటుంది.
చందు అప్పుడే సడన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ వల్లి గురించి ఎందుకు మాట్లాడుతున్నావ్అ.మ్మ అందరు సంతోషంగా ఉన్నప్పుడు ఆ దయ్యం గురించి నువ్వు ఎందుకు తీస్తున్నావు అని అంటాడు. అదొక దెయ్యం లాంటిది దాంతో మాట్లాడాల్సిన అవసరం కూడా నీకు లేదు మన కుటుంబాన్ని నాశనం చేయాలని చూసిన దాని గురించి నువ్వు ఎందుకమ్మా ఇప్పుడు బాధపడుతున్నావు అని చందు అంటాడు.. నేనేమీ అనలేదు రా నువ్వేంటి రా తూగుతున్నావు తూలుతున్నావు ఏ రాత్రంతా ఇంటికి ఎందుకు రాలేదు రా అని అడుగుతుంది వేదవతి. తాగేసి వచ్చావా పెద్దోడా అని వేదవతి అడుగుతుండగా అక్కడికొచ్చిన రామరాజు అరే ఈరోజు గుడికి వెళ్ళాలి నువ్వు తలస్నానం చేసే రెడీ ఇవ్వు అని అంటాడు. అయితే వాడి జీవితం ఇలా మారిపోవడానికి నేనే కారణం అలాంటిది ఇప్పుడు వారిని నేను అడిగితే వాడు చాలా బాధపడిపోతాడు.. నేను ఇంకా బాధ పడిపోతాను అని రామరాజు ఎమోషనల్ అయిపోతాడు..
వల్లి తన ఇంట్లో బతుకమ్మ అని పెడుతూ తన జీవితం మారాలి అని అనుకుంటూ ఉంటుంది. అయితే అప్పుడే తనకు ఫోన్ లో ఒక వీడియో వస్తుంది తన అత్తింటి వాళ్ళు అందరూ కలిసి బతుకమ్మ అని పెడుతున్నట్లు ఆ ఫోన్లో చూస్తుంది. ఇంట్లోని వాళ్ళందరూ కూడా సంతోషంగా బతకమని పెడుతున్నారు నేను కూడా అక్కడే ఉండింటే బతుకమ్మని పెట్టేదాన్ని కదా అని బాధ పడిపోతూ ఉంటుంది. బతుకమ్మ సంబరాలు అందరూ చేస్తున్నారు అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా.. అక్కడికి వచ్చిన భాగ్యం నువ్వు బతిమలాడి ఇలా బతుకమ్మను పెట్టి అక్కడ ఆడాలని చూస్తే వాళ్ళు నేను రానిస్తారా బెదిరించో భయపెట్టే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కానీ అంటుంది.. ఆ మాటకు వల్లి చాలా సీరియస్ అవుతుంది. నా సంగతి నేను చూసుకుంటాను నువ్వు మళ్ళీ వేలు పెట్టొద్దు అని వల్లి వార్నింగ్ ఇస్తుంది..
భద్ర బయట రామరాజు ఇంట్లో ఏంట్రా ఇంత కళకళలాడుతుంది. మొత్తం అంతా నవ్వులే వినిపిస్తున్నాయి అని అడుగుతుంది. అయితే ఇవాళ బతుకమ్మ కదా అక్క అందరూ బతుకమ్మని తయారు చేసి.. బతుకమ్మ సంబరాలు చేసుకుంటున్నారేమో అని అంటాడు అయితే బతుకమ్మ సంబరాలు ఇంట్లో జరగకూడదు రా వాడికి ఎంతగా అవమానించాలని చూసినా కూడా అందరూ నవ్వుకుంటూ నవ్విస్తూ ఉంటారు. అప్పుడే వల్లికి చందు విడాకులు నోటిఫికేషన్ పంపించడం చూసి రామరాజుకి అక్కడే అవమానం జరిగేలా చేయాలి అని ప్లాన్ చేస్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది మరి రేపటి ఎపిసోడ్లో భద్ర ప్లాన్ సక్సెస్ అవుతుందా లేదా అన్నది చూడాలి..
Also Read :Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. అక్టోబర్ నెల హైలెట్స్..