Sangareddy: సంగా రెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జుర సంఘం మండలం పరిధిలో కక్కర్వాడు గ్రామంల జరిగిన ఈ ఘటనలో తన కూతురు తమ కులం కానీ యువకుడ్ని పెళ్లి చేసుకుందని, యువకుడి ఇంటికి నిప్పు పెట్టారు యువతి తండ్రి.
కురుమ కులానికి చెందినటువంటి యువతిని ముద్రాజు కులానికి చెందిన రాధాకృష్ణ పెళ్లి చేసుకున్నాడు. తమ కూతురి ప్రేమ వివాహాన్ని వ్యతిరేకించారు తల్లిదండ్రులు. ఇప్పటికే ఈ వివాదం పోలీసుల దగ్గరకు చేరడంతో, ఇరువర్గాలకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు పోలీసులు. అయినప్పటికీ శాంతించిన యువత కుటుంబీకులు యువకుడి ఇంటికి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో యువతి కుటుంబీకులు, యువతి తండ్రి, సోదరుడిపై కేసు కూడా నమోదు చేశారు. ఇరువురికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించిన తర్వాత కూడా ఇలాంటి ఘటనలు జరగటం దారుణం.
Read Also: Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ముగ్గురు
తమ ఇంటికి నిప్పు పెట్టడంతో ఇంట్లో ఉన్న వస్తువులతో పాటుగా నగదు మొత్తం బూడిదయిందంటూ వరుడి సోదరుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ‘‘మొన్న డీజే మొత్తం కాలిపోయింది. రూ. 5 లక్షలు విలువైన డీజేను కాలబెట్టారు. ఒక ల్యాప్ టాప్ కూడా కాలిపోయింది. మూడున్నర తులాల బంగారం ఉండేది. అది కూడా కాలిపోయింది. ₹1,50,000 రూపాయల నగదు కాలిపోయింది. అది కూడా బెడ్ కిందనే పెట్టినాము ఆ బెడ్ కింద కూడా మొత్తం కాలిపోయినాయి.’’ అని మీడియాకు చెప్పాడు.