E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode July 10th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:   గుడిలో కలిసి పూజ చేసిన జ్యోత్స్న , సూరజ్

Karthika Deepam 2 Serial Today Episode July 10th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:   గుడిలో కలిసి పూజ చేసిన జ్యోత్స్న , సూరజ్
Advertisement

Karthika Deepam 2 serial today Episode: గుడిలో దక్షిణమూర్తి హోమం చేయడం చూసిన శివనారాయణ మనం వెళ్లిపోదాం పదండి అంటూ అందరినీ తీసుకుని వెళ్లిపోతుంటే.. అప్పుడే హోమం అయిపోయిన దక్షిణమూర్తి, శివనారాయణ దగ్గరకు వచ్చి తాను ఎందుకు హోమం చేస్తున్నానో ఆ దేవుడికి తెలియకపోయినా నా కూతురుకు తెలియకపోయినా పర్వాలేదు కానీ నీకు కచ్చితంగా తెలియాలి అంటూ వచ్చే జన్మలోనైనా నా కూతురు ప్రేమగా నన్ను నాన్న అని పిలిచే భాగ్యం దక్కాలని చేస్తున్నాను అంటూ చెప్తాడు.

సుమిత్ర కోపంగా చూస్తూ.. నీది ఎంత రాతి గుండె నాన్న కూతురుకు అమ్మా అనే పిలుపు లేకుండా చేసి నాన్న అని పిలిపించుకోవాలి అనుకుంటున్నావు మనసులో లేని శాంతిని మాటల్లో వెతుక్కుంటే దొరుకుతుంది. గుండెల్లో లేని ప్రేమని గుడిలో కలిస్తే పుడుతుందా..? ప్రాణమే లేని బంధానికి శాంతి అవసరమా..? అంటూ ప్రశ్నిస్తుంటే.. అవసరమే సుమిత్రా అంటూ మాలిని వస్తుంది. ఈవిడెవరు అంటూ జ్యోత్స్న సూరజ్‌ను అడిగితే మాలిని, దక్షిణమూర్తి గారి కోడలు అని చెప్పగానే.. నీకెలా తెలుసు అంటూ అనుమానంగా అడిగితే మిత్రుల కన్నా శత్రువుల గురించి తెలుసుకోవాలని చైర్మన్‌ గారు చెప్పారు కదా..? అందుకే నేను తెలుసుకున్నాను అంటూ చెప్తాడు.

Advertisement

దగ్గరకు వచ్చిన మాలిని అందరినీ పలకరిస్తుంది. జ్యోత్స్నను కూడా పేరు పెట్టి పిలుస్తుంది. జ్యోత్స్న షాక్‌ అవుతుంది. మాలిని అందరినీ పేరు పెట్టి పిలుస్తుంటే.. అందరూ షాకింగ్ గా చూస్తుంటారు. దీంతో శివనారాయణ కోపంగా మాలినిని గతం మర్చిపోయానని అనుకోవద్దు.. ఇక్కడ రెండు హోమాలు మండుతున్నాయి.. ఒకటి అక్కడ ఒకటి ఇక్కడ తన గుండెల్లో అంటూ చూపిస్తాడు. అది ఆరిపోతుంది. ఇది ఆరిపోదు.. గుడిలో ఎవరి దారిన వాళ్లం వెళ్లిపోదాం అంటూ చెప్తుండగానే.. పంతులు వచ్చి శివనారాయణ వాళ్లను తీసుకెళ్తాడు. దక్షిణమూర్తి బాధపడుతుంటే.. మాలిని ఓదారుస్తుంది.

నవగ్రహాల దగ్గరకు వెళ్లిన సూరజ్‌, జ్యోత్స్నలను చూసి పంతులు మీ దంపతులు ఇలా వచ్చి ప్రదక్షిణ చేయండి అంటూ చెప్పగానే.. జ్యోత్స్న కోపంగా పంతులును తిడుతూ.. మేము భార్యాభర్తలం కాదు ఈయన మా కంపెనీలో కొత్త సీఈవోకు పీఏ అంటూ వెటకారంగా మాట్లాడుతుంది. దీంతో పంతులు సారీ చెప్పి పూజ ఎలా చేయాలో జ్యోత్స్నకు చెప్తాడు. జ్యోత్స్న ఎలా పూజ చేస్తే సూరజ్ అలాగ చేస్తుంటాడు. దీంతో జ్యోత్స్న కోపంగా చూస్తూ.. నీ పూజ నీదే.. నా పూజ నాదే.. కానీ మంత్రాలు మాత్రం ఒక్కటే అంటూ జ్యోత్స్న ఎలా చేస్తే సూరజ్‌ అలా చేస్తుంటాడు. పూజ అయిపోయాక జ్యోత్స్న దేవుడికి మొక్కుతూ.. తన జీవితంలోంచి సూరజ్‌ గాడిని దూరం చేయమని మొక్కుతుంది.

Advertisement

సూరజ్‌ మాత్రం జ్యోత్స్నను పెళ్లి చేసుకోవాలని కోరుకుంటాడు. తర్వాత ఇద్దరూ కలిసి నవగ్రహాలకు ప్రదక్షిణ చేస్తూ.. దక్షిణమూర్తి, మాలిని గురించి మాట్లాడుకుంటారు. వాళ్లిద్దరిని దూరం నుంచి చూస్తున్న పారిజాతం సూరజ్‌ను కోపంగా తిడుతుంది. వెనక నుంచి గమనిస్తున్న కార్తీక్‌ గొంతు మార్చి శివనారాయణలాగే పారిజాతం అని పిలవగానే.. పారిజాతం భయంతో ఏవండి నేను మీ కోసమే చూస్తున్నానండి అంటూ తిరిగి చూస్తుంది కార్తీక్‌ నవ్వుతుంటే.. నువ్వా అంటూ కోప్పడుతుంది.

దీప గుడిలో అందరికీ ప్రసాదం పంచుతూ.. వెళ్లి మాలినికి కూడా ప్రసాదం ఇస్తుంది. మాలిని ప్రసాదం బాగుందని తమ రెస్టారెంట్‌లో చెఫ్‌గా పని చేస్తావా..? అని అడుగుతుంది. దీప తను ఎవరో మీకు తెలుసా..? అంటూ అడగ్గానే.. అప్పుడే వచ్చిన కార్తీక్‌ తను జ్యోత్స్న రెస్టారెంట్‌ సీఈవో.. నా భార్య కూడా అని చెప్తుండగానే.. శివనారాయ వచ్చి ఆ విషయం మాలినికి తెలియదు అనుకున్నావా..? అంటాడు. శివనారాయణను చూసిన కార్తీక్‌, దీప షాక్‌ అవుతారు. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

సోల్ మేట్ దొరికేశాడు..పెళ్లి పీటలెక్కబోతున్న రోహిణి!

రామ్ ప్రసాద్ బిహేవియర్ మార్చుకో.. అపూర్వ గుట్టు బయటపెట్టిన శాలిని!

అర్ధరాత్రిళ్లు ఏంటా పనులు.. శాలిని, రోహిత్‌లకు షాకిచ్చిన నాగ్, ఝాన్సీ కన్నీళ్లు!

త్వరలో పెళ్లి చేసుకోబోతున్న జబర్దస్త్ కమెడియన్..!

Intinti Ramayanam Kamal : అయ్యో.. కమల్ అవుట్.. ఇదేం ట్విస్ట్ మామా..

Gundeninda Gudigantalu : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మీనా చెల్లి అవుట్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లిని ఇంట్లోంచి గేంటేసిన వేదవతి.. భాగ్యంకు నర్మదా స్ట్రాంగ్ వార్నింగ్.. పాపం శ్రీవల్లి..

Intinti Ramayanam Today Episode: అవని పై భానుమతి సీరియస్.. అవనికి సీరియస్.. ప్రణతి కాపురంలో చిచ్చు..

Big Stories

Advertisement
×