Podarillu Today Episode July 10th: పొదరిల్లు టీ మొత్తం దుర్గం చెరువుకి వెళ్తారు.. అయితే అక్కడ చెకింగ్ లో నారాయణని చెక్ చేస్తూ ఉండగా తన మందు బాటిల్ని మహాలక్ష్మి బ్యాగులో వేస్తాడు.. దాన్ని ఎలాగైనా సరే మళ్లీ తీసుకోవాలని అనుకుంటాడు. కానీ మహాలక్ష్మి బ్యాగులో ఏముంది అని తెలుసుకోనేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఎవరో ఒకరు వచ్చి అడ్డుపడడంతో నారాయణ ఫీలవుతాడు.. చివరికి నారాయణ బ్యాగులో చేయి పెట్టి తీస్తూ ఉండగా చక్రి వచ్చి దొంగతనం చేస్తున్నావా సిగ్గు లేదా అని అవమానిస్తాడు.. ఇక ఆ బేగం తీసుకున్న మహాలక్ష్మి అందులో మందు బాటిల్ ని చూసి కొంచమైన మీకు బుద్ధి ఉందా అని ఒక్క మాటతో నారాయణకి దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇస్తుంది.. పబ్లిక్ ప్లేస్ లో ఇలా తాగడం మంచిది కాదు అని దాన్ని బ్యాగులో పెట్టేసి తర్వాత ఇస్తాను అని అంటుంది.. అదే పార్కుకి కేశవ శైలు కూడా వస్తారు.. మొత్తానికి పొదిరిల్లు ఫ్యామిలీ మొత్తం అదే పార్కులో ఒకరికి తెలియకుండా మరొకరు ఉంటారు..
నారాయణ మందు బాటిల్ ఇవ్వలేదని చాలా ఫీల్ అయిపోతూ ఉంటాడు.. నారాయణ నేను అలిగాను బుంగమూతి పెట్టాను అని పక్కకు వెళ్లిపోయి మౌనంగా ఉండిపోతాడు. నేను పక్కకు వెళ్ళిపోతాను అని నారాయణ అక్కడ పక్కకి వెళ్లిపోతాడు. మనమందరం ఎంతో సంతోషంగా గడపాలని వస్తే అతను అలిగినట్టు ఉన్నాడు కదా మా సుపుత్రని ఎలాగైనా సరే మళ్లీ మామూలు మనిషిని చేయాలి అని మహాలక్ష్మి అనుకుంటుంది. అవును నేను అలిగాను బుంగమూతి పెట్టుకున్నాను అని నారాయణ ఇంకాస్త ఎక్కువగా బెట్టు చేస్తూ ఉంటాడు. మహాలక్ష్మి ఎలాగైనా మా సుపుత్రుడిని సరదాగా ఉండేలా చేయాలి అని అనుకుంటుంది.. అయితే కన్నా మరేం పర్వాలేదు వదిన ఆయన బుంగమూతి అని చెప్పేసి పంది మూతి పెట్టుకుంటాడు అది చూడలేక చచ్చిపోతున్నాము అని కన్నా అంటుంటే అదేంటిరా అలా అంటావు అందరం సరదాగా గడపాలని ఇక్కడికి వచ్చాము ఆయన అలా ఉంటే బాగోలేదు అని అందరూ కలిసి అక్కడికి వెళ్లి నారాయణను ఆటపట్టిస్తారు. మళ్లీ నారాయణ చక్కగా నవ్వడంతో ఇప్పుడు నాకు సుపుత్రుడు అని అర్థం అయిపోయింది అని మహాలక్ష్మి అంటుంది..
ఆఖరికి నారాయణ బుంగమూతి పెట్టిన సరే తనకోసం మహాలక్ష్మి ఏదైనా చేస్తుంది. కానీ నాకోసం మాత్రం అసలు ఏమీ చేయడం లేదు అని చాలా బాధపడి పోతాడు చక్రి. వాళ్ళందరూ మళ్లీ ఆ ప్లేస్ కు వచ్చేలోగా చక్రి బాధపడుతూ కనిపించడంతో నీకేమైంది రా నువ్వు ఎందుకు అలా ఉన్నావు అని మాధవ్అ డుగుతాడు. అసలు మనం పార్క్ కి ఎందుకు వచ్చాము అన్నయ్య.. పల్లీలు తిని పడుకోడానికి వచ్చామా? ఇలా రేషన్ సరుకులు తెచ్చుకున్నట్లుగా తిండి తెచ్చుకుని తినడానికి వచ్చామా అని చక్రి చాలా ఫీల్ అయిపోతూ ఉంటాడు. ఇప్పుడు ఏం చేయమంటావురా అని మాధవ్ అడుగుతాడు. సరదాగా ఏదైనా గేమ్ ఆడుకుందాము అని చక్రి అంటాడు. ఆ మాట చక్రి అన్నాడో లేదో మహాలక్ష్మి దగ్గరికి ఒక బాల్ వచ్చి పడుతుంది. ఆ కాలనీ చూసినా మహా మనిషా మనం వెళ్లి ఆడుకున్నాం కదా అని వెళ్ళిపోతుంది. చక్రిని చూసి కన్నా అలాగే నారాయణ ఇద్దరు పగలబడినవుతారు. నీకు అదృష్టం ఆవగింజంత కూడా లేదు. అలా అన్నావో లేదో వదిన వెళ్ళిపోయింది అని కన్నా అంటాడు..
అరె కన్నా మనం ఐస్ క్రీమ్ తెచ్చుకుందాం పద అని మహాలక్ష్మి అంటుంది. అయితే కన్నా అందరికీ ఐస్క్రీం తెచ్చుకున్నాం వదినా అని అనగానే మాధవ్ డబ్బులు ఇస్తాడు. ఇక మహాలక్ష్మి నేను వెళ్లి తీసుకొని వస్తాను అని వెళుతుంది. ఇదే మంచి సమయం నేను వెళ్లి మాట్లాడాలి అని అనుకుంటాడు ఇక కన్నా కూడా ధైర్యం చెప్పడంతో చక్రి ముందుకు వెళ్తాడు. చక్రి మాట వినకుండా మహాలక్ష్మి కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. ఐస్ క్రీమ్ కావాలండి అని మహాలక్ష్మి దగ్గరికి వచ్చి చక్రి అడుగుతాడు. నాకు ఇప్పుడు జాబ్ లేదు చేతిలో డబ్బులు లేవు మీరే నాకు ఐస్క్రీం కొనివ్వాలి అని అనగానే మహాలక్ష్మి నేనెందుకు మీకు ఇవ్వాలి అని అంటుంది. అయితే మహాలక్ష్మి తో ఎలాగైనా సరే ఒంటరిగా తన మనసులో మాటని చెప్పాలని అనుకుంటాడు. ఇక చక్రి తన ప్రేమను చెప్పేటప్పుడు ఒక ఆవిడ చక్రిపై రాళ్లు వేస్తూ ఉంటుంది..
కేశవ శైలు ఇద్దరూ సరదాగా నడుచుకుంటూ వెళ్తారు. అక్కడ ఐస్ క్రీమ్ కనిపించడంతో శైలు ఐస్ క్రీమ్ తిందాం పద అని అంటుంది. నేనేమీ తప్పిపోను కదా ఎందుకు అంత గట్టిగా పట్టుకున్నావు అని కేశవ అడుగుతాడు. లవర్స్ అన్నాక ఇలానే పట్టుకొని పార్కులో నడిస్తే బాగుంటుంది రా అని శైలు అంటుంది. ముందు ఐస్క్రీం కావాలి అని అనగానే వాతావరణం చల్లగా ఉంది ఇప్పుడు ఐస్క్రీం తింటే జలుబు చేస్తుంది అని కేశవ ఎంత చెప్తున్నా సరే శైలు మాత్రం ఐస్క్రీం గురించి మాట్లాడుతుంది.. అయితే డబ్బులు నువ్వే ఇవ్వాలి అంటే దీనికి బొక్క నేనేనా అని కేశవ అంటాడు.. ఇద్దరూ కలిసి ఐస్ క్రీమ్ తీసుకొని అలా పొదల్లోకి వెళ్తారు.. కేశవ ఇప్పుడు ఆ పొదల్లోకి ఎందుకు అని అడుగుతున్న సరే శైలు అక్కడికి వెళ్తేనే బాగుంటుంది పదా అనేసి తీసుకొని వెళ్తుంది..
చక్రి మహాలక్ష్మి అనుకుని అక్కడున్న ఒక ఆవిడతో నా మనసులోని మాట నీకు చెప్పాలనుకుంటున్నా అని అంటాడు. అయితే ఆ వెనకాల ఉన్న ఆవిడ నాకే చెప్పాలనుకుంటున్నాడు ఏమో అని చాలా సంతోషంగా ఉంటుంది. మీతో ఈరోజు ఇలా బయటకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అని చక్రి అనగానే ఆవిడ మురిసిపోతుంది. భార్యతో ఎవరో మాట్లాడుతున్నాడు అని అక్కడికొచ్చిన ఆమె భర్త చక్రి ప్రపోజ్ చేయగానే భుజం మీద చేయి వేసి ఎవర్రా నువ్వు నా భార్యకి ఐ లవ్ యు చెప్తున్నావు అని అంటాడు.. ఆ మాట వినగానే చక్రి ఒక్కసారిగా షాక్ అవుతాడు. నువ్వు ఎవర్రా నీ భార్య ఎవరు రా అని అడిగి మరి ఆ రౌడీని కొడతాడు. మా ఆవిడ ఆవిడ అని మహాలక్ష్మిని చూపిస్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..
Also Read :Intinti Ramayanam Today Episode: పల్లవికి కమల్ ఝలక్.. సత్యనారాయణ పూజ సక్సెస్.. ఊహించని ట్విస్ట్..