E-Paper
Advertisement

అంటువ్యాధులు, అగ్నిప్రమాదాలు… పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ భయ్యా

అంటువ్యాధులు, అగ్నిప్రమాదాలు… పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ భయ్యా
Advertisement

Family Drama Series: సొంత ఊరూ, ఇల్లూ ఎంత సేఫ్ అండ్ సెక్యూర్ ప్లేస్ అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ చాలామంది లైఫ్ లోకి పైకి రావడానికి బాగా సంపాదించాలి అనే ఆలోచనతో వేరే ఊరికి వెళ్తూ ఉంటారు. అయితే ఇంటికి ఎంత దూరంగా ఉన్నా… పుట్టిన ఊరు, కన్న వాళ్ళపై మనసు లాగేస్తుంది. కానీ ఫ్యామిలీ అంతా కట్టకట్టుకుని ఊరు విడిచి, కొత్త ప్లేస్ లో బతుకుదెరువు కోసం వెళ్తే… పచ్చని పచ్చికబయళ్ళను విడిచి, ఎడారి లాంటి నరకంలో కాలు పెడితే ఎలా ఉంటుందో చూడాలని ఉందా ? అయితే Little House on the Prairie అనే ఈ సిరీస్ ను డోంట్ మిస్.

కథలోకి వెళ్తే…

కథ 1870ల చివరలో విస్కాన్సిన్‌లోని దట్టమైన అడవుల్లో షురూ అవుతుంది. చార్లెస్ ఇంగాల్స్ అనే ధైర్యవంతుడైన వ్యవసాయదారుడు తన భార్య కారోలిన్, పెద్ద కుమార్తె మేరీ, 8 ఏళ్ల చిన్న కుమార్తె లారాతో కలిసి ఉంటాడు. అయితే మెరుగైన జీవితం కోసం కొత్త భూములను వెతకాలని డిసైడ్ అవుతాడు. గుర్రపు బండ్లపై ఏకంగా 800 మైళ్ల ప్రయాణం స్టార్ట్ చేస్తారు. ఈ ప్రయాణంలో వాళ్ళు భయంకరమైన నదులు, అడవులు, వర్షాలు, జంతువుల దాడులను ఎదుర్కొంటూ చివరికి కాన్సాస్‌లోని విశాలమైన, నిర్మానుష్యమైన మైదాన ప్రాంతంకు చేరుకుంటారు.

Advertisement

అక్కడే కొత్త జీవితం ప్రారంభిస్తారు. చార్లెస్ చెక్కలతో ఒక చిన్న లాగ్ క్యాబిన్ అంటే ఇల్లును నిర్మించుకుంటాడు. కుటుంబం అంతా కలిసి నేలను తవ్వి వ్యవసాయం చేస్తూ, పంటలు పండించి జీవనం సాగించాలని ప్రయత్నిస్తారు. కానీ ఆ నిర్జన ప్రాంతంలో జీవించడం అంత తేలిక కాదు. భయంకరమైన శీతాకాలపు చలి, ఆకలి, కరువు, అడవి జంతువుల దాడులు, ప్రాణాంతక జ్వరాలు వాళ్ళను వెంటాడతాయి. ఈ ఛాలెంజెస్ ను ఫేస్ చేస్తూనే కుటుంబం ఒకరినొకరు ఆదుకుంటూ, ప్రేమతో ముందుకు సాగుతుంది.

కథలో మరో ముఖ్యమైన అంశం స్థానిక అమెరికన్ గిరిజన తెగలతో ఏర్పడే సంబంధాలు. భూమి హక్కుల కోసం తెల్లటి వలసదారులు, స్థానికుల మధ్య గొడవలు ఎక్కువవుతాయి. చిన్నారి లారాకు గిరిజన బాలుడు ‘గుడ్ ఈగిల్’తో ఏర్పడిన స్నేహం రెండు వేర్వేరు సంస్కృతుల మధ్య వారధిగా నిలుస్తుంది. అంతలోనే ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతుంది. అప్పులు తీర్చడానికి లారా, మేరీ కలిసి టౌన్‌లో జరిగే ‘ఫౌండర్స్ డే’ పోటీల్లో పాల్గొని బహుమతి డబ్బు గెలవడానికి ప్రయత్నిస్తారు. మరి వాళ్ళు అనుకున్నట్టే డబ్బులు సంపాదించారా ? అంతటి భయంకరమైన ప్రదేశంలో ఆ ఫ్యామిలీ సెటిల్ అయ్యిందా ? లేదంటే వేరే ప్రాంతానికి వెళ్లిపోయారా ? అన్నది తెలియాలంటే ఈ సినిమాను మస్ట్ వాచ్.

స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

Advertisement

ఈ సిరీస్ ప్రయాణంలో కుటుంబం ఎదుర్కొనే ఆనందాలు, బాధలు, నవ్వులు, కన్నీళ్లు ప్రేక్షకుల హృదయాన్ని కదిలిస్తాయి. అద్భుతమైన విజువల్స్, కాస్ట్యూమ్స్, సెట్స్ 19వ శతాబ్దపు అమెరికాను సజీవంగా తెరపైకి తీసుకొస్తాయి. 2026లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా ఆకట్టుకుంటున్న హాలీవుడ్ పీరియడ్ డ్రామా వెబ్ సిరీస్ తెలుగు ఆడియోతో ఓటీటీలో అందుబాటులో ఉంది. లారా ఇంగాల్స్ వైల్డర్ రాసిన ప్రపంచ ప్రసిద్ధ పుస్తకాల ఆధారంగా రూపొందిన ఈ సిరీస్ 19వ శతాబ్దం అమెరికా పశ్చిమ సరిహద్దుల్లో ఒక సాధారణ కుటుంబం సాగించిన మనుగడ పోరాటాన్ని హృదయానికి హత్తుకునేలా చూపిస్తుంది. రెబెక్కా సోనెన్‌షైన్ షోరన్నర్‌గా పని చేసిన ఈ సిరీస్ మొదటి సీజన్ 8 ఎపిసోడ్‌లతో వచ్చింది.

Read Also: నరకంలో ఉన్న పేరెంట్స్ కోసం దేవుడితో ఒప్పందం… మెంటలెక్కించే సూపర్ నేచురల్ థ్రిల్లర్

Tags

Related News

పాడుబడిన బావిలో కన్పించే పిల్లాడు… లాస్ట్ ట్విస్ట్ కు దిమాక్ కరాబ్

భార్యాభర్తల గొడవ… కట్ చేస్తే లేడీస్ గ్యాంగ్ రచ్చ… డోంట్ మిస్

డుగ్ డుగ్ బండిని పట్టుకుని దేవుడంటూ పూజలు… మైండ్ బ్లాక్ స్టోరీ

పేషెంట్స్ ను ఆధారాల్లేకుండా చంపే కిల్లర్… ప్రతి ఒక్కరూ చూడాల్సిన మలయాళం మెడికల్ థ్రిల్లర్

10 గంటలు ప్రభుత్వాన్ని అల్లాడించే అరాచకం… మస్ట్ వాచ్ మలయాళం పొలిటికల్ థ్రిల్లర్

అమ్మవారికి కట్టిన ముడుపులో రక్తం… అర్దరాత్రి నుంచే తెలుగు హర్రర్ థ్రిల్లర్ స్ట్రీమింగ్

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీ సినిమాలు.. ఏకంగా 14 సినిమాలు స్ట్రీమింగ్..!

Big Stories

Advertisement
×