E-Paper
Advertisement

జబర్దస్త్ ఫైమాకి గాడ్ ఫాదర్ నుండి అదిరిపోయే గిఫ్ట్.. పెళ్ళికానుకలో ఏముందంటే?

జబర్దస్త్ ఫైమాకి గాడ్ ఫాదర్ నుండి అదిరిపోయే గిఫ్ట్.. పెళ్ళికానుకలో ఏముందంటే?
Advertisement

Jabardasth Faima:జబర్దస్త్ లేడీ కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది ఫైమా.. అద్భుతమైన నటనతో, ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్విస్తూ.. ఊహించని పాపులారిటీ అందుకున్న ఫైమా జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలలో కూడా మెరిసింది. ముఖ్యంగా పటాస్ ప్రవీణ్ తో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ నడుపుతూ నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నాం అనే రేంజ్ లో ఆడియన్స్ ను నమ్మించింది. కట్ చేస్తే అదంతా స్క్రీన్ వరకే పరిమితం అని తనకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తొమ్మిదేళ్ల ప్రేమాయణానికి స్వస్తి పలుకుతూ ఇటీవల రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని అందరికీ సడన్ షాక్ ఇచ్చింది ఫైమా.

ఫైమా కి సడెన్ సర్ప్రైజ్ ఇచ్చిన నాగబాబు..

చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అటు ఈమెకు ఆన్ స్క్రీన్ జోడిగా నిలిచిన ప్రవీణ్ కూడా తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇకపోతే తన పెళ్లితో అందరినీ ఆశ్చర్యపరిచిన ఫైమాకి జబర్దస్త్ కి గాడ్ ఫాదర్ అని ముద్దుగా అభిమానుల చేత పిలువబడే మెగా బ్రదర్ నాగబాబు ఫైమా దంపతులకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ విషయాన్ని ఫైమా తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది. మరి జబర్దస్త్ గాడ్ ఫాదర్గా ప్రేక్షకుల చేత పిలవబడుతున్న నాగబాబు.. ఫైమా దంపతులకు ఎలాంటి సర్ప్రైజ్ ఇచ్చారు అనే విషయం ఇప్పుడు చూద్దాం..

Advertisement

also read:సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన శ్రద్ధాదాస్ హారర్ థ్రిల్లర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే?

అసలు విషయం పంచుకున్న ఫైమా..

వివాహం తర్వాత అత్తారింట్లో సందడి చేస్తున్న ఫైమా అక్కడి నుండి తన రోజువారి దినచర్యను ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా తన పెళ్లికి జబర్దస్త్ జడ్జి నాగబాబు రాకపోయినా ఆయన పంపించిన బహుమతి గురించి చెబుతూ మురిసిపోయింది. ఈ మేరకు ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక వీడియోను కూడా షేర్ చేసింది. అందులో ఫైమా మాట్లాడుతూ..” మా పెళ్ళికి నాగబాబు సార్ రాలేదు. కానీ ఈ రోజు నేను జబర్దస్త్ షూటింగ్ కి వెళ్ళగా.. అక్కడ నాకు ఈ డబ్బులు బహుమతిగా ఇచ్చారు. చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే సార్ నన్ను ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆయన ఇచ్చిన ప్రోత్సాహం వల్లే నేను ఇంకా బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను.. నాగబాబు సార్ ఇచ్చిన ఈ బహుమతి ఎప్పుడు మరువలేనిది” అంటూ ఒక పోస్ట్ పంచుకుంది. ఇక ప్రస్తుతం పైమా షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. ఫైమా దంపతులకు అభిమానులు, నెటిజనులు, సినీ సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

నాగబాబు కెరియర్..

Advertisement

నాగబాబు విషయానికి వస్తే.. ఎక్కువగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించిన ఈయన.. నిర్మాతగా కూడా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే జబర్దస్త్ కి నిర్విరామంగా జడ్జిగా వ్యవహరించిన నాగబాబు.. కొన్ని కారణాలవల్ల సడన్గా జబర్దస్త్ నుంచి తప్పుకున్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ జబర్దస్త్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అంతేకాదు షోలో చాలా మార్పులకు శ్రీకారం కూడా చుట్టారు. గత కొన్ని రోజులతో పోల్చుకుంటే ఇప్పుడు జబర్దస్త్ రేటింగ్ కూడా మెరుగుపడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

Related News

త్వరలో పెళ్లి చేసుకోబోతున్న జబర్దస్త్ కమెడియన్..!

Intinti Ramayanam Kamal : అయ్యో.. కమల్ అవుట్.. ఇదేం ట్విస్ట్ మామా..

Gundeninda Gudigantalu : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మీనా చెల్లి అవుట్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లిని ఇంట్లోంచి గేంటేసిన వేదవతి.. భాగ్యంకు నర్మదా స్ట్రాంగ్ వార్నింగ్.. పాపం శ్రీవల్లి..

Intinti Ramayanam Today Episode: అవని పై భానుమతి సీరియస్.. అవనికి సీరియస్.. ప్రణతి కాపురంలో చిచ్చు..

Karthika Deepam 2 Serial Today Episode October 10th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: కార్తీక్ దెబ్బకు టిపిన్ బండి ఎత్తేసిన మాలిని           

Podarillu Today Episode : నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్.. మహా పై సీరియస్.. కన్నా కన్నీళ్లు..

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ మాటతో ప్రభా షాక్.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రభా.. బాలు రచ్చ రచ్చ..

Big Stories

Advertisement
×