E-Paper
Advertisement

వైభ‌వ్ కు క‌ళ్లు నెత్తికి ఎక్కాయ్…వీడు టీమిండియాకు ప‌నికిరాడు!

వైభ‌వ్ కు క‌ళ్లు నెత్తికి ఎక్కాయ్…వీడు టీమిండియాకు ప‌నికిరాడు!
Advertisement

Sunil Gavaskar:  టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ (Team India vs. England) మధ్య నిన్న 4వ టి20 ( India tour of England, 2026) జరిగింది. ఇప్పటికే రెండింటిలో ఓడిపోయిన టీమిండియా, నిన్న బ్రిస్టల్ (County Ground, Bristol) వేదికగా జరిగిన నాలుగోవ టి20 లో కూడా చిత్తుగా ఓటమిపాలైంది. దీంతో ఈ సిరీస్ కోల్పోవాల్సి వచ్చింది. నిన్న రాత్రి 10 గంటలకు షురూ అయిన ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ చేతిలో ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో అత్యంత దారుణమైన ఓటమి చవి చూసింది టీమిండియా. గతంలో చేసిన తప్పిదాలే మళ్లీ మళ్లీ చేశారు టీమిండియా క్రికెటర్లు. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi).. ఆర్చర్ వేసిన బంతులకు బెంబేలెత్తిపోయి వికెట్ సమర్పించుకున్నాడు. అయితే దీనిపై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar ) సీరియస్ అయ్యారు. వైభ‌వ్ కు క‌ళ్లు నెత్తికి ఎక్కాయ్…వీడు టీమిండియాకు ప‌నికిరాడు అంటూ ఆగ్ర‌హించారు. క‌ళ్లు మూసుకుని బ్యాట్ ఊపుతున్నాడని ఫైర్ అయ్యారు. ప్ర‌తీ బంతి సిక్స‌ర్ కొట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నాడ‌ని ఆగ్ర‌హించారు.

Also Read: Inzamam-ul-Haq Reaction On Team India Kohli Vs Shreyas Iyer : కోహ్లీ కంటే శ్రేయ‌స్ అయ్య‌రే బెట‌ర్ కెప్టెన్‌..టీమిండియాకు ఎలాంటి ఢోకా లేదు

వైభ‌వ్ కు క‌ళ్లు నెత్తికి ఎక్కాయ్…వీడు టీమిండియాకు ప‌నికిరాడు!

Advertisement

టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య నిన్న బ్రిస్టల్ బిగ్ ఫైట్ జరిగింది. ఈ నాలుగవ టి20 లో కూడా టీమిండియా ఓటమిపాలైంది. ఇందులో మొదటి బ్యాటింగ్ చేసిన భారత్ , చచ్చి చెడి 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు సాధించింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఒక్కడే 80 పరుగులతో రాణించాడు. మిగిలిన ఆటగాడు ఎవ్వడు కూడా ఆడలేదు. ఇక ఈ మ్యాచ్ లో చేజింగ్ కు దిగిన ఇంగ్లాండు ఒకే ఒక్క వికెట్ కోల్పోయి మ్యాచ్ గెలిచింది. అయితే నాలుగవ టీ20 లో కూడా 15 పరుగుల వద్ద వైభవ్ సూర్యవంశీ సిక్సర్ కోసం ట్రై చేసి అవుట్ అయ్యాడు. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ లోనే వెనుతిరిగాడు. అయితే నిన్న వైభవ్ ఆడిన షాట్ పైన సునీల్ గవాస్కర్ చాలా సీరియస్ అయ్యారు.

ఈ 15 ఏళ్ల వైభవ్ ప్రతి బంతిని సిక్సర్ మలిచే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు. టి20 అంటే సిక్సర్లు కొట్టడం కాదని.. బంతిని చూసుకుంటూ ఆడాలని వెల్లడించారు. కానీ ఐపీఎల్ లో ఊపినట్లుగానే.. కళ్ళు మూసుకొని ఇంగ్లాండ్ గడ్డపై వైభవ్ బ్యాట్ ఊపుతున్నాడని మండిపడ్డారు. ఇలాంటి వాడు టీమిండియా కు అస్సలు పనికిరాడు అని విమర్శలు చేశారు. జోఫ్రా ఆర్చర్ తెలివిగా షార్ట్ డెలివరీస్ వేస్తున్నాడని తెలిసి కూడా.. అతని వలలో వైభవ్ పడుతున్నాడని మండిపడ్డారు. టీమిండియా బ్యాటింగ్ కోచ్ ఏం పీకుతున్నాడని నిలదీశారు. వైభవ్ ఎలా ఆడాలనే దానిపైన ట్రైనింగ్ ఇవ్వలేదా ? అంటూ ఆగ్రహించారు. వైభవ్ ఇలా ఆడితే… ఐపీఎల్ తప్ప, ఎక్కడ రాణించలేదని బాంబు పేల్చారు.

Advertisement

Also Read: Mohammad kaif blasts selectors Over Team India Vs England : శివమ్‌ దూబే కంటే ముందు హ‌ర్షిత్ రాణాను తీసుకురావ‌డం గంభీర్ ముర్ఖ‌త్వమే 

 

Related News

గెలుపు కోసం మా ముందు టీమిండియా బిక్షాట‌న చేస్తోంది !

TG20 లీగ్ లో ‘బాసింగ బలాలు’ సాంగ్…మ‌ళ్లీ ట్రోలింగ్ షురూ !

కోహ్లీ కంటే శ్రేయ‌స్ అయ్య‌రే బెట‌ర్ కెప్టెన్‌..టీమిండియాకు ఎలాంటి ఢోకా లేదు

ఇండియా, పాక్ మ‌ధ్య వ‌రుస‌గా మూడు మ్యాచ్ లు..షెడ్యూల్ ఇదే

గంభీర్ ను వెంట‌నే త‌ప్పించండి.. లేక‌పోతే టీమిండియాను ఉగాండా చేస్తాడు!

ఇక‌పై నా ఫోక‌స్ టీమిండియాపైనే..ప్ర‌తీ మ్యాచ్ లోనూ చిత్తుగా ఓడిస్తా

అన‌వ‌స‌రంగా ట్రోల్ చేస్తున్నారు..శ్రేయ‌స్ క‌చ్చితంగా ధోని అంత‌టి కెప్టెన్ అవుతాడు

Big Stories

Advertisement
×