E-Paper
Advertisement

భార్యాభర్తల గొడవ… కట్ చేస్తే లేడీస్ గ్యాంగ్ రచ్చ… డోంట్ మిస్

భార్యాభర్తల గొడవ… కట్ చేస్తే లేడీస్ గ్యాంగ్ రచ్చ… డోంట్ మిస్
Advertisement

Emotional Mystery Drama Series:  భార్యాభర్తలు అన్నాక గొడవ పడకుండా ఉంటారా ? ఆ తరువాత ఒక్కటి అవ్వకుండా ఉంటారా ? కానీ అదే గొడవ ఓ మనిషి ప్రాణాన్ని తీస్తే ? ఆ ఫ్యామిలీని నాశనం చేసే స్థితికి తీసుకొస్తే ? ఆ తరువాత వచ్చే లేడీస్ గ్యాంగ్ తాగి రచ్చ రచ్చ చేస్తే ఎలా ఉంటుంది ? తెలుసుకోవాలంటే ఈ వెబ్ సిరీస్ ను చూడాల్సిందే. ఆ హాలీవుడ్ ఎమోషనల్ డ్రామా వెబ్ సిరీస్ పేరు The Five Star Weekend. ఇంతకీ ఈ సిరీస్ లో ఏముంది ? ఎక్కడ చూడవచ్చు ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

ఇందులో మన పేరు కథానాయిక హోలిస్ షా. ఆమె ప్రసిద్ధ ఫుడ్ బ్లాగర్, వంటల నిపుణురాలు. నన్‌టుకెట్ అనే అందమైన ద్వీపంలో భర్త మాథ్యూతో సుఖంగా జీవితం గడుపుతూ ఉంటుంది. కానీ ఒక ఉదయం చిన్న గొడవ జరిగిన కొద్దిసేపటికే మాథ్యూ ఘోర కారు ప్రమాదంలో మరణిస్తాడు. ఈ విషాదం హోలిస్ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్‌లు, వ్యక్తిగత బాధలు ఆమెను మానసికంగా కుంగిపోయేలా చేస్తాయి. ఈ డిప్రెషన్ నుంచి బయటపడాలని హోలిస్ ఒక ప్రత్యేకమైన ప్లాన్ చేస్తుంది.

Advertisement

తన జీవితంలోని వేర్వేరు దశల్లో చాలా క్లోజ్ అయిన నలుగురు బెస్ట్ ఫ్రెండ్స్‌ను నన్‌టుకెట్‌లోని తన లగ్జరీ ఇంటికి ఒక “ఫైవ్ స్టార్ వీకెండ్” గడపడానికి ఆహ్వానిస్తుంది. ఈ వీకెండ్ ఆమె జీవితంలో కొత్త మలుపు తీసుకురావాలని ఆశిస్తుంది. ఆ నలుగురు స్నేహితులు ఎంతో వైవిధ్యమైన వ్యక్తిత్వాలు కలిగి ఉంటారు. టాటమ్ హోలిస్ చిన్ననాటి స్నేహితురాలు, నన్‌టుకెట్‌లోనే సెటిల్ అయి ఉంటుంది. డ్రూ-ఆన్ కాలేజీ బెస్ట్ ఫ్రెండ్, సక్సెస్‌ఫుల్ స్పోర్ట్స్ ఏజెంట్‌గా ఉంటూ కూడా ఒక పెద్ద వివాదంలో చిక్కుకుపోయి ఉంటుంది.

హోలిస్ ముప్పై ఏళ్ల వయసులో పరిచయమైన స్నేహితురాలు బ్రూక్. బయటకు పర్ఫెక్ట్ భార్య, తల్లిగా కనిపించినా లోపల డిప్రెషన్‌తో బాధపడుతుంది. గిగి సోషల్ మీడియా ద్వారా పరిచయమైన కొత్త స్నేహితురాలు. ఆమె గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ ఆమె వెనుక ఒక పెద్ద రహస్యం దాగి ఉంటుంది. ఐదుగురు మహిళలు ఒకే ఇంట్లో చేరగానే కథ సస్పెన్స్‌గా మారుతుంది.

Advertisement

మొదట్లో నవ్వులు, గత జ్ఞాపకాలు గుర్తుచేసుకోవడాలు వంటి సీన్స్ ఉంటాయి. కానీ క్రమంగా ప్రతి ఒక్కరి లోపల దాచుకున్న రహస్యాలు, ఈర్ష్యలు, పాత పగలు బయట పడతాయి. ముఖ్యంగా హోలిస్ భర్త మాథ్యూ మరణానికి ముందు ఆ నలుగురిలో ఒకరితో అతనికి అక్రమ సంబంధం ఉందనే షాకింగ్ నిజం వెలుగులోకి వస్తుంది. మరి ఆ అమ్మాయి ఎవరు అనేది హీరోయిన్ ఎలా కనిపెట్టింది ? వీకెండ్ పార్టీకి పిలిచి, భర్తతో ఎఫైర్ పెట్టుకున్న అమ్మాయి బాగోతాన్ని ఆమె ఎలా బయట పెట్టింది ? అన్నది తెలియాలంటే ఈ సిరీస్ ను వీక్షించాల్సిందే.

తెలుగులో స్ట్రీమింగ్ ?

‘ది ఫైవ్ స్టార్ వీకెండ్’ సిరీస్ లగ్జరీ డ్రామా – మిస్టరీ మిక్స్. ఐదుగురు మహిళల మధ్య జరిగే భావోద్వేగాల ప్రయాణం మిమ్మల్ని కన్నీళ్లు పెట్టిస్తుంది. జూలై 9 నుండి Peacockలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ఇంగ్లీష్ ఒరిజినల్‌తో అందుబాటులో ఉన్న ఈ సిరీస్ త్వరలో భారతదేశంలో జియో సినిమా లేదా లయన్స్ గేట్ ప్లే ద్వారా స్ట్రీమ్ అయ్యే అవకాశం ఉంది. ఎలిన్ హిల్డర్‌బ్రాండ్ రాసిన బెస్ట్‌సెల్లర్ నవల ఆధారంగా రూపొందిన ఈ సిరీస్ ఐదుగురు మహిళల కథను హార్ట్ టచింగ్ గా చూపించారు.

Read Also: ప్రతీ ఆడపిల్ల తండ్రి ఇలాగే ఉండాలి భయ్యా… కార్పొరేట్ సిండికేట్ ను చితగ్గొట్టే శివంగి

Tags

Related News

దెయ్యాలనే బంధువులుగా భావించే వింత మనిషి… నవ్విస్తూ, ప్రేమలో ముంచెత్తే మలయాళం ఫాంటసీ మూవీ ఓటీటీలోకి

పోలీసులకు హింట్ ఇచ్చి మరీ చంపే కిల్లర్… ట్విస్టుల మీద ట్విస్టులు… సీజన్ 2 రచ్చ షురూ

గ్రామ దేవత ప్రతిరూపంగా భావించే దున్నపోతు… బలిచ్చే రోజే మిస్సింగ్… రవితేజ సోదరుడి కొడుకు మూవీ స్ట్రీమింగ్

దొంగతనాలు చేసే అమ్మాయికి సీక్రెట్ స్పై మిషన్… టార్గెట్ కొడుకుతోనే ప్రేమలో… క్రేజీ కొరియన్ థ్రిల్లర్

అంగారకుడిపై మనుషుల శరీరాలను ఆక్రమించే దుష్టశక్తులు… హాలీవుడ్ హర్రర్ థ్రిల్లర్ నెట్‌ఫ్లిక్స్‌లో

పక్షిలో మాంత్రిక శక్తులు… దేవుళ్లు, రాక్షసుల మధ్య చిక్కుకునే యువతి… హర్రర్ ఫాంటసీ సిరీస్

కోహినూర్‌ను మించిన వజ్రం కోసం వేట… హంపి ట్రిప్ లో అదిరిపోయే ఛేజింగ్… బెంగాలీ అడ్వెంచర్ థ్రిల్లర్

స్మగ్లింగ్ సామ్రాజ్యంలో బట్టల షాప్ కుర్రాడి మాస్ రాంపేజ్… పృథ్వీరాజ్ ఊరమాస్ యాక్షన్ థ్రిల్లర్ తెలుగులో

Big Stories

Advertisement
×