E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode July 27th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: దీప, దశరథ కూతురన్న నిజం తెలుసుకున్న శ్రీధర్‌ 

Karthika Deepam 2 Serial Today Episode July 27th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: దీప, దశరథ కూతురన్న నిజం తెలుసుకున్న శ్రీధర్‌ 
Advertisement

Karthika Deepam 2 serial today Episode: జ్యో ఆఫీసు నుంచి చెప్పపెట్టకుండా వెళ్లిపోయినందుకు శివనారాయణ ఇంట్లో మీటింగ్‌ పెడతాడు. కారణం లేకుండా వెళ్లడమే కాకుండా ఎవ్వరికీ చెప్పకుండా వెళ్లడం కూడా పెద్ద తప్పని సూరజ్‌ అంటే సూరజ్‌ తాను చైర్మన్‌ గారితో మాట పడ్డాను కాబట్టి అడుగుతానని చెప్తాడు. అప్పుడే వచ్చిన దశరథ కూడా మన ఆఫీసులో పని చేసే వారందరికీ నిజాయితీ.. నిబద్దత టైం సెన్స్‌ ఉండాలి అని చెప్తాడు. అవన్నీ ఎవరికి లేవని చెప్తున్నావు దశరథ అని పారు అడిగితే జ్యోత్స్నకు లేవనే కదా ఇప్పుడే ఈ మీటింగ్‌ పెట్టుకున్నామని కార్తీక్‌ చెప్తాడు.

అందుకు పారు కోపంగా ఆ తాడు బొంగరం లేనోడు ఏం మాట్లాడినా నువ్వు వాడికి సపోర్ట్‌ చేస్తావేంటి..? అంటే.. సూరజ్‌ తాడు బొంగరం లేనోడు అంటే ఎవరండి అని అడగ్గానే.. నీలాగా పెళ్లి పెటాకులు లేనోడు అని పారు చెప్పగానే.. అయితే మీరు  తిట్టేది నన్ను, జ్యోత్స్న గారిని కలిపి తిడుతున్నారా..? అనగానే.. పారు షాక్‌ అవుతుంది. ఇంతలో శివనారాయణ ఇక ఆపండి ఇక నుంచి ఎవ్వరైనా నిజాయితీగా ఉండండి అంటూ ఇక అందరూ వెళ్లిపోండి అనగానే.. కార్తీక్, దీపలను తాను డ్రాప్‌ చేస్తానని దశరథ వెళ్లబోతూ.. జ్యోత్స్నను తన పెళ్లి గురించి బయట తనను అడుగుతున్నారని.. వెంటనే పెళ్లి గురించి ఆలోచించమని చెప్పి వెళ్లిపోతాడు.

Advertisement

దీప, కార్తీక్‌లను ఇంటి దగ్గర డ్రాప్‌ చేసి వాళ్లిద్దరితో జ్యోత్స్న పెళ్లి విషయం మాట్లాడతాడు. జ్యోత్స్న పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందో.. నా కూతురు దీప ఎప్పుడు ఇంటికి వస్తుంది అని బాధపడుతుంటాడు. ఇంట్లోంచి వాళ్లను గమనించిన శ్రీధర్‌ వాళ్లను సర్‌ఫ్రైజ్‌ చేయాలని చాటుగా వెళ్లి వాళ్ల మాటలు వింటాడు శ్రీధర్‌. ముగ్గురు జ్యోత్స్న పెళ్లి దీప జీవితంతో ముడిపడి ఉంది అని మాట్లాడుకోవడం విని షాక్‌ అవుతాడు. జ్యోత్స్న పెళ్లితో దీప జీవితం ముడిపడి ఉండటం ఏంటి..? అనుకుంటాడు. ఇంతలో శ్రీధర్‌ తనకు అర్జెంట్‌ పని ఉందని వెళ్లిపోతాడు. కార్తీక్‌ నవ్వుతూ మావయ్య తొందర చూశావా..? వీలైనంత తొందరగా ఆ కూతురు పెళ్లి చేసి ఈ కూతురును అంటూ శ్రీధర్‌ను గమనించి దగ్గరకు వెళ్తాడు.

ఎప్పుడొచ్చారు మాస్టారు అని అడిగితే భోజనం టైంకే వచ్చానురా అని శ్రీధర్‌ చెప్పగానే.. మరి ఫోన్‌ చేయోచ్చు కదా అని కార్తీక్ అడిగితే ఫోన్‌ చేస్తే మీరు సర్‌ప్రైజ్‌ మిస్‌ అవుతారు అనుకున్నాను కానీ మీరు నాకు సర్‌ఫ్రైజ్‌ ఇచ్చారు అంటూ దశరథ, దీప, కార్తీక్‌ మాట్లాడుకున్నది చెప్తాడు. ఆ మాటలకు దీప, కార్తీక్‌ షాక్‌ అవుతారు. ఇంతలో కార్తీక్‌ మాట మార్చి పేషెంట్‌వు హాయిగా రెస్ట్‌ తీసుకోకుండా ఈ ఆలోచనలు ఎందుకు అంటాడు. తాను పూర్తి ఆరోగ్యంతోనే తిరిగి వచ్చానని శ్రీధర్‌ చెప్తాడు. కార్తీక్‌, దీప శ్రీధర్‌ను కన్వీన్స్‌ చేసి ఇంట్లోకి తీసుకెళ్తారు.

Advertisement

రూంలో ఉన్న సూరజ్‌ జ్యో  ఆల్బమ్‌ ఫోటోలు చూస్తుంటాడు సూరజ్‌. అప్పుడే జ్యో రూంలోకి వెళ్తుంది. జ్యోను చూసిన సూరజ్‌ వెంటనే అల్బమ్‌ ను దాచేస్తాడు. ఏంట్రా అంత కంగారుపడుతున్నావు ఏం చూస్తున్నావు అందులో. అది ఇటివ్వు అని అడుగుతుంది. సూరజ్‌ ఇవ్వనంటాడు. జ్యో వెంటనే లాక్కుని ఆల్బమ్‌ తీసుకుని చూస్తుంది. రేయ్‌ ఏంట్రా ఇందులో నా ఫోటోలు ఉన్నాయి అంటూ కోప్పడుతుంది. అందుకు సూరజ్‌ ఒక్కో ఫోటోకు ఒక్కో కారణం చెప్తాడు. కాలం ఎలా మారుతుందో నువ్వు అలాగే మారుతుంటావు అని చెప్పగానే.. కోపంగా నా ఫోటోలు ఎందుకు తీశావురా అని అడగ్గానే.. నా ఇష్టం ఈ ప్రపంచంలో నాకు నచ్చిన దాన్ని నేను ఫోటో తీస్తాను.. ఈ ఫోటోలు నీకు నచ్చలేదా…? అని అడగ్గానే.. దొంగచాటుగా నా ఫోటోలు తీసి చూపించు అంటుంది. ఫోటోలు తీయడం ఆర్ట్‌ నువ్వు కూడా నా ఫోటోలు తీసి చూపించు అంటాడు. అవేమీ నేను చేయను కానీ నా పెళ్లి గురించి ఇంకోసారి మా ఇంట్లో వాళ్లతో చెప్పొద్దు అనగానే.. అవును చెప్పను కానీ నువ్వు టాబ్లెట్‌ కోసం వెళ్లావో ఎవరినైనా కలవడానికి వెళ్లావో నాకు తెలియదా..? అంటాడు. సూరజ్‌ మాటలకు జ్యో షాక్‌ అవుతుంది. కోపంగా నీకు పోయే కాలం దగ్గర పడిందిరా అంటూ తిడుతూ వెళ్లిపోతుంది.

కాంచన ఇంట్లో అందరూ భోజనం చేస్తుంటే.. శౌర్య కాంచన, శ్రీధర్‌ లతో అల్లరి చేస్తుంది. తాత ఇక్కడ ఉంటే నాన్నమ్మ ఫోన్‌ అసలు మోగదు. అమెరికా వెళ్లిపోతే ఫోన్‌ మోగుతూనే ఉంటుంది అంటుంది. ఆ మాటలకు దీప కోపంగా శౌర్యను పంపిస్తుంది. అప్పుడే శ్రీధర్‌ తమ ఇంటికి దశరథ వచ్చి వెళ్లిన విషయం కాంచనకు చెప్తాడు. అలాగే దీప, కార్తీక్‌, దశరథ మాట్లాడుకున్న విషయాలను ఇన్‌డైరెక్టుగా కాంచనకు చెప్పబోతుంటే.. కార్తీక్‌ అడ్డుపడతాడు. శ్రీధర్‌కు నిజం తెలిసినట్టు ఉందని దీప, కార్తీక్‌ మనసులో అనుకుంటారు. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

శ్రీసత్యకి లవ్ ప్రపోజ్ చేసిన హీరో.. అమ్మడి రియాక్షన్?

బిగ్ బాస్ 10లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్.. మొత్తం ఎంతమంది? ఎవరెవరంటే ?

అలీ హోస్ట్ గా మరో కొత్త షో..ఈసారి డబుల్ అల్లరి అంటూ!

బిగ్‌బాస్ హోస్టింగ్‌కు ఇంత డబ్బా? రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవుతారు!

బిగ్ బాస్ 10లో ఎవరు ఎంత తీసుకుంటున్నారు? లెక్కలు బయటికి!

‘నిన్ను కోరి’ సీరియల్ నుంచి హీరో ఔట్.. బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారా?

యాటిట్యూడ్ చూపిస్తున్నారు.. కామనర్స్ పై బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ ఫైర్!

ఆట మొదలుపెట్టిన షాలిని.. ఇదికదా అసలైన సింపథీ గేమ్!

Big Stories

Advertisement
×