E-Paper
Advertisement

డిజిటల్ అరెస్ట్ పేరుతో భారీ దోపిడీ.. 72 ఏళ్ల వృద్ధురాలికి రూ.1.42 కోట్ల టోకరా

డిజిటల్ అరెస్ట్ పేరుతో భారీ దోపిడీ.. 72 ఏళ్ల వృద్ధురాలికి రూ.1.42 కోట్ల టోకరా
Advertisement

Digital Arrest: స్వేచ్ఛ బ్యూరో: పెన్షన్ డబ్బులతో ప్రశాంతంగా జీవించాల్సిన ఓ 72 ఏళ్ల రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగినిని సైబర్ నేరగాళ్లు అత్యంత చాకచక్యంగా మోసం చేశారు. ఢిల్లీ సెంట్రల్ టెలిఫోన్ డిపార్ట్‌మెంట్, సీబీఐ అధికారులమంటూ ఏకంగా 60 రోజుల పాటు ఆమెను ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో మానసిక క్షోభకు గురిచేసి, కోట్ల రూపాయలు దోచుకున్న ఈ ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపింది.

విచారణ పేరుతో ఇంటిలోనే రెండు నెలలు కట్టడి..

Advertisement

సెప్టెంబర్ 10న బాధితురాలికి ఫోన్ చేసిన కేటుగాళ్లు, జెట్ ఎయిర్ వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ కేసులో ఆమె ఏటీఎం కార్డు దొరికిందని, మనీలాండరింగ్ కార్యకలాపాలు నడుపుతున్నారంటూ బెదిరించారు. ముంబై సైబర్ క్రైమ్, సీబీఐ అధికారుల వేషధారణలో వీడియో కాల్స్ చేస్తూ భయపెట్టారు. విచారణ పేరుతో దాదాపు రెండు నెలల పాటు ఆమె బయటకు వెళ్లకుండా కట్టడి చేశారు.

కేసు నమోదు..

Advertisement

ఈ నమ్మకం కుదిరేలా చేసి.. ఆమెకు చెందిన నాలుగు బ్యాంకుల నుంచి రూ. 1.44 కోట్లు ఆన్‌లైన్ ద్వారా ట్రాన్స్ ఫర్ చేయించుకున్నారు. అంతటితో ఆగకుండా, ఆమె వద్ద ఉన్న బంగారంపై రూ. 18 లక్షల గోల్డ్ లోన్ కూడా తీసుకుని ఆ డబ్బును కూడా తమ ఖాతాలకు మళ్లించారు. విచారణ పూర్తయ్యాక మొత్తం డబ్బు తిరిగి ఇస్తామని నమ్మించారు. అయితే, నగదు బదిలీ అయ్యాక వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు, చివరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: 3 వారాల్లో 3 తుఫానులు.. బంగాళాఖాతంలో అసలేం జరుగుతోంది?

Tags

Related News

సోనియా గాంధీ గుండెల్లో నిజంగా తెలంగాణ లేదు.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్!

తాగునీటి ముసుగులో.. నాగార్జున సాగర్ నుంచి ఏపీ జలదోపిడీ స్కెచ్..?

పాన్ షాప్ ముసుగులో గంజాయి దందా.. 21 కిలోల సరుకుతో క్యారియర్ అరెస్ట్

మంచిర్యాలలో నలుగురు పంచాయతీ కార్యదర్శులు సస్పెండ్!

ఎల్లంపేట్ మున్సిపాలిటీలో మామూళ్ల మాఫియా.. అంతా ఆ ఇద్దరి చేతిలోనే..?

అత్తతో గొడవ.. 8 నెలల పసికందును చంపి తల్లి ఆత్మహత్యాయత్నం

స్ట్రాటజీనా..? అలకనా..? కొండా సురేఖ మౌనంపై కాంగ్రెస్‌లో చర్చ

Big Stories

Advertisement
×