Manhood OTT: నేటి ఆధునిక ప్రపంచంలో మనుషులందరూ ఒక రకమైన మాస్క్ వేసుకుని బతుకుతున్నారు. బయటకు ఎంతో కూల్‌గా, ఫుల్ కాన్ఫిడెన్స్‌తో కనిపించేవారి లోపల ఎన్నో తెలియని భయాలు, అభద్రతా భావాలు దాగి ఉంటాయి. అయితే పైకి మాత్రం మ్యానేజ్ చేస్తుంటారు. ముఖ్యంగా మగవాళ్ల జీవితంలోని ఈ కోణాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తూ, ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా తెరకెక్కిన సరికొత్త మోడరన్ డాక్యుమెంటరీ డ్రామా ‘మ్యాన్‌హుడ్’ (Manhood). మగాడు అంటే బలంగా ఉండాలి.. తనలోని బలహీనతలను బయటపెట్టకూడదు.. తన శరీరాకృతి, వ్యక్తిత్వం గురించి ఎలాంటి అసంతృప్తి ఉండకూడదు.. సమాజం మగతనానికి పెట్టిన ఇలాంటి ప్రమాణాలు చాలామందిని లోలోపల ఎంతగా ఇబ్బంది పెడుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి అంశాలతో ఈ డాక్యుమెంటరీ ఆసక్తికరమైన చర్చకు తెరలేపుతుంది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ డాక్యుమెంటరీ తాజాగా డిజిటల్ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. మగవాళ్ళు మాత్రం మిస్ కాకుండా చూడాల్సిన డ్రామా ఇది.
ఈ కాలం మగాళ్లలో ఉండే ఇన్‌సెక్యూరిటీ, వాళ్ల బాడీ షేప్ గురించిన ఆలోచనలు, కాస్మెటిక్ సర్జరీల చుట్టూ తిరుగుతుంది ఈ డాక్యుమెంటరీ. డేనియల్ లోంబ్రోసో తీసిన ఈ సినిమా టెక్సాస్‌లోని డల్లాస్ నగరంలో నడుస్తుంది. అందరూ బొటాక్స్ చేయించుకున్నట్లే, పురుషాంగం పెంచుకునే ట్రీట్‌మెంట్స్ కూడా చాలా నార్మల్ అయిపోవాలని అనుకునే బిల్ మూర్ అనే ఒక బిజినెస్‌మ్యాన్, అతను నడిపే క్లినిక్ చుట్టూ ఈ కథ మొదలవుతుంది. ఈ క్లినిక్‌కు వచ్చే ఇద్దరు వ్యక్తుల జీవితాల ద్వారా అసలు మగాళ్ల మనసులో ఉండే బాధల్ని ఈ సినిమా చూపిస్తుంది.
ఒకరు డేవిడ్ స్మిత్—ఇతను ఒక ఓన్లీ ఫ్యాన్స్ క్రియేటర్. ఇంతకుముందు చేయించుకున్న ఒక ట్రీట్‌మెంట్ ఫెయిల్ అవ్వడంతో దాన్ని సరిచేసుకోవడానికి ఈ క్లినిక్‌కు వస్తాడు. ఇంకొకరు రూబెన్ రామిరెజ్—ఐదుగురు పిల్లల తండ్రి, కమెడియన్ అవ్వాలని ప్రయత్నిస్తుంటాడు. డబ్బుల్లేకపోయినా తనలో ఉన్న ఆత్మన్యూనతా భావాన్ని పోగొట్టుకోవడానికి ఈ ట్రీట్‌మెంట్ చేయించుకోవాలని అనుకుంటాడు. వీళ్లిద్దరి ఫ్యామిలీ కష్టాలు, చిన్నప్పటి చేదు అనుభవాలు ఇందులో కనిపిస్తాయి. కేవలం బాడీ మార్పుల గురించే కాకుండా, సోషల్ మీడియా ప్రభావం, చిన్నప్పటి మానసిక గాయాల వల్ల ఇప్పటి మగాళ్లు ఎంత ఒత్తిడికి గురవుతున్నారో, వాళ్లలో ఎంత ఇన్‌సెక్యూరిటీ ఉందో ఈ డాక్యుమెంటరీ చాలా రియలిస్టిక్‌గా, ఎమోషనల్‌గా చూపిస్తుంది.
‘మ్యాన్‌హుడ్’ (Manhood) డాక్యుమెంటరీలో బిల్ మూర్, రూబెన్ రామిరేజ్, డేవిడ్ స్మిత్ తమ నిజ జీవిత అనుభవాలతో కనిపించారు. డేనియల్ లొంబ్రోసో దర్శకత్వం వహించగా, కెర్రీ మాక్, రెబెక్కా షైడ్ నిర్మాతలుగా వ్యవహరించారు. 91 నిమిషాల నిడివి ఉన్న ఈ అమెరికన్ డాక్యుమెంటరీ 2026 మార్చి 14న SXSW ఫిల్మ్ ఫెస్టివల్‌లో వరల్డ్ ప్రీమియర్ జరుపుకుంది. నవంబర్ 17 నుంచి Amazon Prime Videoలో రెంట్ పద్ధతిలో అందుబాటులోకి వచ్చింది. సాధారణ సినిమాలకు భిన్నంగా, పురుషుల శరీరాకృతి, ఆత్మవిశ్వాసం, మగతనం చుట్టూ ఉన్న అపోహల గురించి తెలుసుకోవాలనుకునేవారికి ఈ డాక్యుమెంటరీ ఒక విభిన్నమైన అనుభవం.
Read Also: మనిషి చేసిన తప్పులకు ప్రకృతి ఇచ్చే శిక్ష ఇదేనా ? భూమి భవిష్యత్తును చూపించే ‘టైమ్ అండ్ వాటర్’