Ranu Bombay Ki Ranu song: ఇటీవల కాలంలో ఫోక్ సాంగ్స్ విపరీతమైన ఆదరణ సొంతం చేసుకుంటున్నాయి. ఒక ఫోక్ సాంగ్ విడుదల చేసిన తక్కువ సమయంలోనే మిలియన్స్ వ్యూస్ కైవసం చేసుకుంటున్నాయి. ఇలా ఫోక్ సాంగ్స్ కి ఎక్కువ ఆదరణ వచ్చిన నేపథ్యంలో సినిమాలలో కూడా ఫోక్ సాంగ్స్ ఉండేలాగా దర్శకనిర్మాతలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇకపోతే గత ఏడాది ఫోక్ సింగర్ రాము రాథోడ్(Ramu Rathod) చేసిన రాను బొంబాయికి రాను(Ranu Bombay Ki Ranu) పాట ఎంత సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ పాట విడుదలై రెండు సంవత్సరాలు అవుతున్న ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉంది.
ఇటీవల ఈ పాట మరొక మైల్ స్టోన్ దాటిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు యూట్యూబ్ లోనే అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న పాటగా రికార్డు సృష్టించింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా నటించిన అలా వైకుంఠపురం సినిమాలోని బుట్ట బొమ్మ పాట 955 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకొని టాప్ లో ఉండగా ఇప్పుడు ఈ పాటను బీట్ చేస్తూ రాను బొంబాయికి రాను పాట 956 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. బన్నీ సినిమాలోని ఈ పాట ఆరు సంవత్సరాలకు ఈ స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకోగా రాను బొంబాయికి రాను పాట మాత్రం కేవలం రెండు సంవత్సరాల వ్యవధిలోనే 956 మిలియన్ వ్యూస్ రాబట్టింది.
ఇలా అతి తక్కువ సమయంలోనే ఈ పాట సరికొత్త రికార్డులను సృష్టించడం విశేషం. ఇలా ఈ పాటకు భారీగా వ్యూస్ రావడంతో ఈ పాట ఎంత మొత్తంలో రెవెన్యూ వచ్చింది అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు. ఇక ఈ పాట కోసం ఐదు లక్షల లోపే పెట్టుబడి పెట్టినట్టు తెలుస్తుంది. ఈ పాట షూటింగ్ కోసం 3.5 లక్షలు ఖర్చు చేశారని, మ్యూజిక్ ఇతరత ఖర్చులన్నీ కలిపి 5 లక్షల లోపు పెట్టుబడిగా పెట్టినట్టు తెలుస్తుంది. ఇలా ఐదు లక్షల పెట్టుబడితో ఈ పాట కోట్లలో ఆదాయం అందుకుందని తెలుస్తుంది.
యూట్యూబ్లో ఈ పాట మిలియన్స్ వ్యూస్ సొంతం చేసుకోవడంతో కేవలం యాడ్స్ రూపంలోనే ఈ టీమ్ కు తొలి రోజుల్లోనే కోటి రూపాయల వరకు ఆదాయం వచ్చినట్టు తెలుస్తుంది. ఇక ప్రస్తుతం వ్యూస్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ పాటకు సంబంధించిన ఆదాయం కూడా పెరుగుతూ ఉందని, ఈ పాట ద్వారా సుమారు రూ.3 కోట్ల వరకు ఆదాయం అందుకున్నట్టు తెలుస్తోంది. ఇలా లక్షలు పెట్టుబడి పెట్టి కోట్ల రూపాయల ఆదాయం అందుకోవడం అంటే ఈ పాటకు ఏ స్థాయిలో ఆదరణ లభించిందనేది స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఈ పాటను రాము రాథోడ్ పాడడమే కాకుండా డాన్సర్ లిఖితతో కలిసి అద్భుతమైన స్టెప్పులు వేస్తూ ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని అందించారు. ఇక రాను బొంబాయి కి రాను సాంగ్ మంచి హిట్ కావడంతో రాము రాథోడ్ కు విపరీతమైన క్రేజ్ పెరగడమే కాకుండా ఈయన పాటలకు కూడా మంచి డిమాండ్ ఏర్పడింది.
Also Read: ఓం ప్రీ రిలీజ్ ఈవెంట్.. ధనుష్ కు క్షమాపణలు చెప్పిన రేణు దేశాయ్.. ఏం జరిగిందంటే?