E-Paper
Advertisement

చిన్నారి అశ్వర్థకు అండగా శివ జ్యోతి ..భారీగా ఆర్థిక సాయం!

చిన్నారి అశ్వర్థకు అండగా శివ జ్యోతి ..భారీగా ఆర్థిక సాయం!
Advertisement

Siva Jyothi: శివ జ్యోతి యాంకర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం పలు బుల్లితెర కార్యక్రమాలతో పాటు వెండితెర సినిమాలలో కూడా నటిస్తూ సందడి చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో కూడా ఈమె ఇంస్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ వీడియోలతో భారీ స్థాయిలోనే ఆదాయం అందుకుంటున్నారు. ఇలా వృత్తిపరమైన జీవితంలో ఎంతో బిజీగా గడుపుతున్న శివజ్యోతి (Siva Jyothi)తాజాగా తన మంచి మనసును చాటుకున్నారు. సోషల్ మీడియా ఫాలో అయ్యే వారికి చిన్నారి అశ్వర్ధ గురు దత్త (Aswarth guru datta )గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఒక్క ఇంజక్షన్ ధర రూ.26 కోట్లు…

చిన్నారి అశ్వర్థ డుచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ (DMD)అని అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు జన్యుపరమైన ఈ వ్యాధి సోకడంతో ఈ వ్యాధి చికిత్స కోసం సుమారు 26 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. జన్యుపరమైన వ్యాధి రావడంతో శరీరంలోని కండరాలు క్రమక్రమంగా బలహీనపడి చిన్నారి ప్రాణాలకు ప్రమాదకరంగా మారబోతుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిన్నారి కోలుకోవడానికి ఎలివిడిస్ అనే జీన్ థెరపీ ఇంజక్షన్ ఎంతో అవసరం. అయితే ఈ ఇంజక్షన్ ధర 26 కోట్లు ఉంటుంది. ఇంత మొత్తంలో తాము పెట్టుకోలేమని భావించిన అశ్వర్థ తల్లిదండ్రులు ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా తమ కొడుకు సమస్యను తెలియజేస్తూ నిధులు సేకరిస్తున్నారు.

అశ్వర్ధకు అండగా శివజ్యోతి..

Advertisement

ఎంతోమంది సోషల్ మీడియా సెలబ్రిటీలు కూడా చిన్నారి కోసం పెద్ద ఎత్తున విరాళాలు సేకరించిన సంగతి తెలిసిందే. తాజాగా అశ్వర్థ తన తల్లితో కలిసి యాంకర్ శివజ్యోతిని కలిసారు. ఈమె తన కొడుకు చికిత్సలో భాగంగా తన వంతు సహాయం చేయడమే కాకుండా తన అభిమానులందరికీ కూడా సహాయం చేయాలని ఈ సందర్భంగా కోరారు. తన కొడుకు పరిస్థితి అలాగే ఉందని ఇప్పటివరకు నిధుల ద్వారా 12 కోట్ల రూపాయల వరకు సేకరించామని అశ్వర్థ తల్లి తెలియజేశారు. తన కొడుకు ఇంజక్షన్ కోసం ప్రతి ఒక్కరూ సహాయం చేయాలని ఈమె తెలిపారు.

?vrfl=bjVwcmthajQ4MHVn

Advertisement

అశ్వర్ధ చికిత్స కోసం తన వంతుగా శివజ్యోతి లక్ష రూపాయలను సహాయం చేశారు. అయితే తాను ఇచ్చే ఈ డబ్బు తన కొడుకు చికిత్సకు ఏమాత్రం సరిపోదు కానీ తనవంతు సాయంగా లక్ష రూపాయలు ఇస్తున్నానని తన అభిమానులు కూడా చిన్నారి అశ్వర్థకు అండగా నిలవాలి అంటూ ఈ సందర్భంగా శివ జ్యోతి చిన్నారి కోసం ముందుకు వచ్చి తన వంతుగా లక్ష రూపాయలు ఇవ్వడం పట్ల అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇక శివ జ్యోతి కెరియర్ విషయానికి వస్తే ఇన్ని రోజుల పాటు బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేసిన ఈమె వెండితెరపైకి రావడానికి సిద్ధమవుతున్నారు. ఇటీవల ప్రియదర్శి హీరోగా నటించిన ఇడుపు కాయితం సినిమా ద్వారా వెండి తెరపై సందడి చేయబోతున్నారు. ఈ సినిమా డిసెంబర్ 11వ తేదీ విడుదల కాబోతుంది.

Also Read: ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది.. భవిష్యత్తులో కూడా ఉంటుంది:రమ్య కృష్ణ

Related News

త్రిగుణ్ చేతిలో వంశీ కీలుబొమ్మా? ఇచ్చిపడేసిన చైత్ర!

పెట్టింది లక్షల్లో లాభాలు మాత్రం కోట్లలో.. రాను బొంబాయికి రాను క్రేజ్ వేరే లెవెల్!

జూనియర్ బాలు దైవిక్‌కు జరిగిన అవమానం వెనుక అసలు కథ!

సింపథీ కార్డ్ ప్లే చేయకు..ఒక్కసారైనా గెలిచావా?వర్షిణిపై సృష్టి ఫైర్!

బిగ్ బాస్ హౌస్లో ఈ వారం నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ వీరే!

Gundeninda GudiGantalu Today episode: అరుణ్ కు సుమతి దూరం.. రోహిణి ప్లాన్ సక్సెస్.. పాపం మీనా..

Podarillu Today Episode : శైలు మాటతో కేశవ ఫ్యూజుల్ అవుట్.. చక్రికీ దెయ్యం పట్టిందా..? డ్యూయట్ సాంగ్..

Big Stories

Advertisement
×