E-Paper
Advertisement

సింపథీ కార్డ్ ప్లే చేయకు..ఒక్కసారైనా గెలిచావా?వర్షిణిపై సృష్టి ఫైర్!

సింపథీ కార్డ్ ప్లే చేయకు..ఒక్కసారైనా గెలిచావా?వర్షిణిపై సృష్టి ఫైర్!
Advertisement

Bigg Boss 10:బిగ్ బాస్ సీజన్ 10 లో 11వ వారం నామినేషన్ ప్రక్రియ చాలా గట్టిగా సాగుతోంది. ముఖ్యంగా ఎక్స్ హౌస్ మేట్స్ ను డిక్టేటర్స్ గా మార్చేసి.. వీరి చేత నామినేషన్ చేయిస్తున్నారు. అందులో భాగంగానే ఈ వారం కెప్టెన్ కావడంతో నరేష్ నామినేషన్స్ నుండి తప్పించుకోగా.. మిగిలిన 11 మందిని ఎక్స్ హౌస్ మేట్స్.. ఒక్కొక్క పాయింట్ చెబుతూ గట్టిగా లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తున్నారు. ముఖ్యంగా ఈ రేంజ్ లో నామినేషన్స్ ఎప్పుడు జరగలేదు అనే కామెంట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇకపోతే ఇప్పటికే కొంతమంది ఎక్స్ హౌస్ మేట్స్ హౌస్ లోకి వచ్చి కంటెస్టెంట్స్ ను నామినేట్ చేయగా.. ఇక తాజాగా 72వ రోజుకు సంబంధించి మొదటి ప్రోమోని నిర్వాహకులు విడుదల చేశారు.

వర్షిణి పర్సనాలిటీ పై సృష్టి ఫైర్..

అందులో భాగంగానే కామనర్ కేటగిరిలో హౌస్ లోకి వచ్చి కొన్ని రోజులకే ఎలిమినేట్ అయిన సృష్టి హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చింది . రావడం రావడమే ఆమె రామకృష్ణ పై సెటైర్ వేసింది. నీకు, నీ వెనకాల ఉన్న లెటర్ బాక్స్ కి పెద్దగా తేడా ఏమీ కనిపించట్లేదు అంటూ కౌంటర్ ఇచ్చింది. ఇక తన నామినేషన్స్ లో భాగంగా వర్షిణిని నామినేట్ చేసింది సృష్టి. ముఖేష్ తో పాటు ఉండి పూర్తి పర్సనాలిటీ కనిపించకుండా పోయింది.. పైగా ఉమెన్ కార్డు ప్లే చేయడం చాలా చండాలంగా ఉంది. ముఖ్యంగా ఏదైనా చేయడానికి కూడా నీ వద్ద ధైర్యం లేదు. ఎప్పుడు అసహనం వ్యక్తం చేస్తూ ఉంటావు. అంటూ వర్షినిపై మండిపడింది
ఇక వర్షిని మాట్లాడుతూ ఇక్కడ నాతో పాటు గేమ్ ఆడటానికి వచ్చే ఏ అబ్బాయి కి సమానంగా స్ట్రెంత్ నా దగ్గర లేదు అంటూ ఆమె నిజం ఒప్పుకుంది. అయితే సృష్టి మాట్లాడుతూ ఇంతవరకు ఒక్క గేమ్ అయినా గెలిచారా అంటూ ప్రశ్నించింది.

అమన్ విషయంలో నువ్వు చేసింది చాలా తప్పు..

Advertisement

మధ్యలో త్రిగుణ్ కలగజేసుకొని పజిల్ టాస్క్ విత్ ముకేష్ అంటూ వెటకారంగా కౌంటర్ ఇచ్చాడు. సృష్టి మాట్లాడుతూ అమన్ దగ్గర నుంచి కెప్టెన్సీ టాస్క్ తీసుకోవడం కూడా నాకు నచ్చలేదు. పైగా హౌస్ లో వాడికి ఎక్కడి నుండి కూడా సపోర్టు రావడం లేదు అని చెప్పగా.. అమన్ మాట్లాడుతూ నేను కంటెండర్ షిప్ అయినప్పుడు కూడా నాకు ఓటేయాలని ఆమెకు అనిపించలేదు అని కామెంట్ చేయగా.. మధ్యలో రామకృష్ణ కలగజేసుకొని పదిసార్లు ఆమె మీకే ఓటు వేయాలని చెప్పింది. ఇలా మాట్లాడొద్దు అంటూ ఫైర్ అయ్యాడు. ఇక ముఖేష్ మాట్లాడుతూ ఇలాంటి అబద్ధాలే మాట్లాడొద్దు అని ముఖేష్ కూడా అమన్ పై ఫైర్ అయ్యాడు.

also read:బిగ్ బాస్ హౌస్లో ఈ వారం నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ వీరే!

విజేత అయ్యే అర్హత నీకు లేదు- త్రిగుణ్

Advertisement

ఇకపోతే బిగ్ బాస్ చెప్పినట్టుగా సృష్టి ఇతర కంటెస్టెంట్లను నామినేట్ చేసే అవకాశాన్ని త్రిగుణ్ కి ఇచ్చింది. ముఖేష్ ను నామినేట్ చేస్తూ.. ఇతరుల ఓటమిలో సంతోషం వెతుక్కునే నీకు విజేత అయ్యే అర్హత లేదు అంటూ తన నోటికి పని చెప్పాడు. నక్క పులి చర్మం వేసుకుంటే అది పులి అయిపోదు. ముఖానికి రోజుకు మూడుసార్లు మేకప్ వేస్తే లోపల ఉన్న మురికి ముఖేష్..వాడు కవర్ అవ్వడు. కంటి ముందు అలా ఆడకుండా ఐదు నిమిషాలు కూర్చోవడానికి కూడా నీకు ధైర్యం లేదని నాకు తెలుసు. అంటూ ఒక రేంజ్ లో మండిపడుతూ ముఖేష్ పై ఫైరయ్యాడు. మొత్తానికైతే ఈ వారం నామినేషన్స్ మరింత హీటెక్కింది అని చెప్పవచ్చు.

Related News

బిగ్ బాస్ హౌస్లో ఈ వారం నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ వీరే!

Gundeninda GudiGantalu Today episode: అరుణ్ కు సుమతి దూరం.. రోహిణి ప్లాన్ సక్సెస్.. పాపం మీనా..

Podarillu Today Episode : శైలు మాటతో కేశవ ఫ్యూజుల్ అవుట్.. చక్రికీ దెయ్యం పట్టిందా..? డ్యూయట్ సాంగ్..

Karthika Deepam 2 Serial Today Episode November 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  మాలిని ప్లాన్ సక్సెస్ – జ్యోత్స్నను తిట్టిన సూరజ్   

Illu Illalu Pillalu Today Episodes: వల్లికి నర్మద సూపర్ ప్లాన్.. అడ్డంగా దొరికిపోయిన సాగర్.. వల్లి గెటప్ అదిరిపోలే..

Brahmamudi Serial Today Episode November 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఎక్స్ ఫో విన్నర్ ఐశ్వర్య – షాక్ లో ఇందు, రాజు  

Intinti Ramayanam Today Episode: కమల్ ఫుల్ హ్యాపీ.. పాపం రమ్య.. నిజం తెలుస్తుందా..?

Big Stories

Advertisement
×