Bigg Boss 10:బిగ్ బాస్ సీజన్ 10 లో 11వ వారం నామినేషన్ ప్రక్రియ చాలా గట్టిగా సాగుతోంది. హౌస్ నుండి ఎలిమినేట్ అయిన ఎక్స్ హౌస్ మేట్స్ ని మళ్ళీ హౌస్ లోకి తీసుకొస్తూ.. వారిచేత నామినేషన్స్ చేయిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే శాలిని, మిథిలేష్ రెడ్డి, అపూర్వ, సృష్టి వంటి మాజీ ఎక్స్ హౌస్ మేట్స్ హౌస్ లోకి వచ్చి కంటెస్టెంట్స్ కి తమ పాయింట్స్ తో చుక్కలు చూపించారు. తాజాగా 72వ రోజుకు సంబంధించి విడుదల చేసిన 2వ ప్రోమోలో చైత్ర హౌస్ లోకి వచ్చినట్లు చూపించారు.
ప్రోమో విషయానికి వస్తే.. బిగ్ బాస్ సీజన్ 10 లోకి సెలబ్రిటీగా అడుగుపెట్టిన చైత్ర.. హౌస్ లోకి వచ్చిన తొలివారమే.. అందులోనూ మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ రెండు రోజులకే ఆమెను ఎలిమినేట్ చేసి పంపించారు. ఆ తర్వాత ఆమెను హౌస్ లోకి పంపిస్తారు అంటూ ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ ఆమెతో పాటు ఎలిమినేట్ అయిన చరణ్ ను హౌస్ లోకి తీసుకొచ్చారు కానీ చైత్ర మళ్ళీ హౌస్ లోకి అడుగుపెట్టలేదు.కానీ దాదాపు 10 వారాల తర్వాత 11వ వారం నామినేషన్ లో భాగంగా చైత్ర నామినేట్ చేయడానికి హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చింది.
also read:కెరూబ్’ ట్రైలర్ రిలీజ్.. రామాయణం అంత హిట్ అవుతుందా?
అందులో భాగంగానే తాజాగా హౌస్ లోకి వచ్చిన ఈమె వంశీని నామినేట్ చేసింది. చైత్ర మాట్లాడుతూ.. పేరులో టెంపర్ ఉంది కానీ.. ఆటలో ఆ టెంపర్ కనిపించడం లేదు. అంటూ తన అభిప్రాయాన్ని తెలిపింది. దీనికి వంశీ మాట్లాడుతూ.. ఇన్ని రోజులు ఇక్కడ ఉండి, వారికి ఎవరి గేమ్ నచ్చింది.. ఎవరి గేమ్ నచ్చలేదు.. వాళ్లకు తెలుసు. ఎప్పుడు బయటకు పంపియాలో తెలుసు. ఎవరిని లోపల ఉంచాలో తెలుసు అంటూ వంశీ చెప్పగా.. చైత్ర మాట్లాడుతూ టెంపర్ అనేది ఆటలో ఉండాలి..మాటల్లో కాదు అంటూ మరోసారి కౌంటర్ ఇచ్చింది. ఆ తర్వాత చైత్ర మాట్లాడుతూ త్రిగుణ్ చేతిలో మీరు ఒక కీలు బొమ్మలా మారిపోయారు మీకంటూ ఒక ఆట కనిపించడం లేదు అంటూ ఫైర్ అయ్యింది. ఆ తర్వాత వర్షిణికి కంటెస్టెంట్ ను నామినేట్ చేసే అవకాశం కల్పించింది చైత్ర. వర్షిణి అమన్ ను నామినేట్ చేసింది. ఈ నామినేషన్ లో ఇద్దరి మధ్య మాటలు హద్దులు దాటాయని తెలుస్తోంది.