Noise Buds N1 Pro: మ్యూజిక్ వినడం నుంచి ఆఫీస్ కాల్స్ మాట్లాడటం వరకు నేటి రోజుల్లో ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయాయి. అయితే.. తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం లుక్, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ,ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ ఉన్న ఇయర్ బడ్స్ దొరకడం కాస్త కష్టమే. కానీ, ప్రముఖ ఆడియో బ్రాండ్ నాయిస్ కేవలం రూ. 1,499ధరలోనే ‘Noise Buds N1 Pro’మార్కెట్లోకి తెచ్చింది. మెటాలిక్ ఫినిష్, క్రోమ్ పర్పుల్ కలర్‌తో ఆకట్టుకుంటున్న ఈ ఇయర్‌బడ్స్ పూర్తి విశేషాలు ఇప్పుడు చూద్దాం.
ఏదైనా గాడ్జెట్ కొనేటప్పుడు దాని డిజైన్ మనల్ని ముందుగా ఆకర్షిస్తుంది.ఈ మోడల్ ఈ విషయంలో పూర్తి మార్కులు కొట్టేస్తుంది. దీనికి అందించిన మెటాలిక్ ఫినిష్, క్రోమ్ పర్పుల్ కలర్ చూడటానికి చాలా రాయల్‌గా, స్టైలిష్‌గా కనిపిస్తాయి. ఛార్జింగ్ కేస్ చాలా కాంపాక్ట్‌గా ఉండటం వల్ల జేబులో ఈజీగా పట్టేస్తుంది. ఇయర్‌బడ్స్ చెవులకు చాలా ఈజీగా అమరిపోతాయి, దీని వల్ల ఎక్కువ సేపు పాటలు విన్నా లేదా ప్రయాణాలు చేసినా చెవులకు ఎలాంటి నొప్పి కలగదు.
రూ.1,500 లోపు ధరలో 32dB ఏఎన్సీ ఫీచర్ రావడం ఈ ఇయర్ బడ్స్‌కు ఉన్న అతిపెద్ద బలం. మీరు బస్సులో, ట్రైన్‌లో ప్రయాణిస్తున్నా లేదా రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఉన్నా చుట్టుపక్కల సౌండ్స్ 32 డెసిబెల్స్ వరకు ఇది తగ్గిస్తుంది. దీని వల్ల బయటి గోల లేకుండా.. మీకు ఇష్టమైన మ్యూజిక్ లేదా పాడ్‌కాస్ట్‌లను చాలా స్పష్టంగా ఆస్వాదించవచ్చు. అంతే కాకుండా, కాల్స్ మాట్లాడేటప్పుడు అవతలి వారికి మీ వాయిస్ క్లియర్‌గా వినిపించేందుకు ఇందులో క్వాడ్-మైక్ సపోర్ట్ కూడా ఉంది.
బ్యాటరీ విషయంలో ఈ ఇయర్ బడ్స్ బెస్ట్ అని చెప్పొచ్చు. ఛార్జింగ్ కేస్‌తో కలిపి ఇది ఏకంగా 60 గంటల ప్లేటైమ్‌ను అందిస్తుంది. అంటే.. ఒక్క సారి ఫుల్ ఛార్జ్ చేస్తే.. రోజుల తరబడి ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం ఉండదు. ఒక వేళ మీకు అత్యవసరంగా బయటకు వెళ్లాల్సి వచ్చి ఛార్జింగ్ లేకపోయినా ..కంగారు పడాల్సిన పని లేదు. ఇందులోని ఇన్‌స్టాఛార్జ్ టెక్నాలజీ సహాయంతో కేవలం 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే.. సుమారు 120 నిమిషాల (2 గంటల) ప్లేటైమ్ లభిస్తుంది.
Also Read: ఫ్లిప్ కార్ట్ సేల్‌లో వాషింగ్ మెషీన్లు, ఫ్రిడ్జ్‌లపై కళ్లు చెదిరే డిస్కౌంట్లు!
కనెక్టివిటీ కోసం ఇందులో లేటెస్ట్ బ్లూటూత్ v5.3 వెర్షన్‌ను ఇచ్చారు. దీని వల్ల మీ స్మార్ట్ ఫోన్ లేదా ల్యాప్ టాప్‌కు ఇయర్ బడ్స్ చాలా వేగంగా కనెక్ట్ అవుతాయి. అంతే కాకుండా కనెక్షన్ మధ్యలో ..తెగి పోయే సమస్య ఉండదు. గేమింగ్ ఇష్టప డే వారి కోసం ఇందులో లో-లేటెన్సీ మోడ్ కూడా ఉంది. ఇది గేమ్ ఆడేటప్పుడు ఆడియో, వీడియో మధ్య ఎలాంటి ఆలస్యం లేకుండా చూసుకుంటుంది.
మీరు రూ. 1,500 లోపు బడ్జెట్‌లో స్టైలిష్ లుక్, మంచి సౌండ్ క్వాలిటీ ,నాయిస్ క్యాన్సిలేషన్ ఉన్న ఇయర్ బడ్స్ కోసం చూస్తున్నట్లయితే..రూ. 1,499 ధరలో లభిస్తున్న ఈ మోడల్ ఒక అద్భుతమైన ఆప్షన్. 32dB , 60 గంటల బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ ,మెటాలిక్ ఫినిష్ వంటి ఫీచర్లు దీనిని బెస్ట్ అని చెప్పొచ్చు.