Podarillu Today Episode November 20th : చక్రి తన మనసులోని బాధని పక్కకు పెట్టి మహాలక్ష్మి తో పాటు ఉండడానికి వద్దు.. తన జీవితం తనది నేను ఇలాంటి పాత ఇంట్లో పుట్టాను. నాకు కార్లు లేవు నేను ఒక కారు డ్రైవర్ని అని ఎమోషనల్ గా మాట్లాడడంతో మహాలక్ష్మి చాలా ఫీల్ అయిపోతుంది. ఇకపోతే మహాలక్ష్మి చక్రి గురించి అన్న మాటలు విని మౌనంగా లోపలికి వెళ్ళిపోతుంది కానీ మాధవ్ మాత్రం నువ్విలా చేస్తావని నేను అస్సలు ఊహించలేదు రా.. ఎందుకురా ఇలా చేశావు అని అనగానే తను నా నుంచి విడాకులు కోరుకుంటుంది.. అన్నయ్య తన కోరికను తీర్చాలి కదా అని చక్రి అనగానే మాధవ్ ఎమోషనల్ అయిపోతాడు.
చక్రి బయటకు వెళ్తూ ఉంటే అక్కడ నారాయణ అడ్డుపడి ఏంట్రా దొంగ నా మై ఫ్రెండ్ నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు అని చక్రితో మాట్లాడతాడు. మహాలక్ష్మి వదిలేసి వెళ్ళిపోతే నువ్వు ఉండగలుగుతావా అని చక్రిని అడుగుతాడు. కానీ చక్రి తను నాతో ఉండాలని అనుకోవడం లేదు అందుకే నేను తనకి విడాకులు ఇవ్వాలని అనుకుంటున్నాను అలాంటిది నువ్వు ఇలా మహాలక్ష్మికి వెంటనే విడాకులు ఇవ్వాలని అనుకోవడం నాకు అస్సలు నచ్చలేదు రా అనేసి నారాయణ చక్రికి అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తాడు.. చక్రి మాత్రం నారాయణ ఎంత చెప్పినా సరే చక్రి మాత్రం అస్సలు వినడు.. మహాలక్ష్మికి ఇష్టం లేకుండా నేను ఏది చేయను అని చక్రి అంటాడు..
ఉదయం లేవగానే మహాలక్ష్మి నేను రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాను పెద్ది. ఆఫీస్ కి టైం అవుతుంది అని అంటుంది. అయితే ఆఫీస్ కి వెళ్తున్నావా అమ్మ మరి టిఫిన్ చేయవా ఏంటి అంటే నాకు టిఫిన్ ఆకలి కాలేదు పెద్దది అందుకే వెళ్ళిపోతున్నాను అని అంటుంది. కానీ మాధవ్ నిన్ను నీతో మాట్లాడాలమ్మ టిఫిన్ చెయ్యు మనిద్దరం కలిసి వెళ్దామని అంటాడు. ఇదే మాధవ తనకి టిఫిన్ పెట్టి నువ్వు చక్రితో నిజంగానే విడిపోవాలని అనుకుంటున్నావా నువ్వు ఆలోచించవా వాడు అలా మాట్లాడుతున్నాడు అంటే దాని వెనకాల ఎంతో బాధ ఉందని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావా అని అంటాడు. విడాకులు ఇస్తాను అని అంటున్నాడు కదా మరి తనకి ఎందుకు చెప్పడం లేదు మీరు అని మహాలక్ష్మి అంటుంది. కానీ పెద్ది అంటున్న మాటలు విన్న మహాలక్ష్మి ఎమోషనల్ అయిపోతుంది.
మాధవ్ ఏం జరిగితే అది జరుగుతుంది నువ్వు మాత్రం తొందరపడి ఏ నిర్ణయాన్ని తీసుకోవద్దు అమ్మ అని అంటాడు ఇక ఆ మాట విన్న మహాలక్ష్మి సరే పెద్ది అని అక్కడి నుంచి వెళ్తుంది అయితే బయటికి రాగానే చక్రి ఉన్న కూడా తను పట్టించుకోకుండా తన బండి మీద వెళ్లాలని అనుకుంటుంది. చక్రి మహాలక్ష్మి పిలుస్తుందేమో అని చూస్తూ ఉంటాడు కానీ మహాలక్ష్మి మాత్రం అస్సలు పిలవకుండా తన వైపు కూడా చూడకుండా వెళ్ళిపోతుంది వీళ్ళిద్దరి మధ్య ఈ దూరానికి సింక్ అయ్యేలా ఒక పాట కూడా వచ్చేస్తుంది. ఈ సీను మాత్రం ఎపిసోడ్కి కాస్త హైలెట్గా నిలుస్తుంది. మహాలక్ష్మి చక్రి అలా ఒకరికొకరు తెలియనట్టుగా ఉండడం ఫాన్స్ కి కాస్త ఫీలింగ్ అనిపించిన కూడా.. ఈ ఎపిసోడ్ లో ఇదే హైలెట్ సీన్ గా మారడం విశేషం…
మహాలక్ష్మి ఆఫీస్ కి వెళ్ళగానే ఒక పెద్ద ప్రాజెక్టు ఉంది అని దాన్ని చేయడానికి దివ్య ఇద్దరు కూడా చాలా కష్టపడి పోతూ ఉంటారు.. అయితే మహాలక్ష్మి ఎలాగైనా ఈ రోజు ఈ ప్రాజెక్టుని పూర్తి చేసి మళ్లీ కొత్త ప్రాజెక్ట్ కి లైన్ క్లియర్ చేసుకోవాలి అని అనుకుంటుంది. ఆ ప్రాజెక్టు గురించి ఇద్దరు చాలా కష్టపడుతూ ఉండగా విక్కీ దివ్య పక్కకు వెళ్ళగానే మహాలక్ష్మి దగ్గరికి వస్తాడు. లక్కీ ఏం చేస్తున్నావు అని చెప్పగానే నేను ప్రాజెక్టు డిజైన్ చేస్తున్న విక్కీ అని చెప్తుంది కానీ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా అని అంటుంది అప్పుడే విక్కి కాఫీ కి వెళ్దామని అడుగుతాడు. కానీ మహాలక్ష్మి మాత్రం నాకు పర్సనల్ ప్రాబ్లమ్స్ చాలానే ఉన్నాయి వాటిని పక్కన పెట్టి నేను ఇప్పుడు కాఫీకి రాలేను విక్కీ అని చెప్తుంది ఆ మాట విన్న దివ్య బాస్ నీకు బాగానే లైన్ వేస్తున్నాడు అని అనగానే మహాలక్ష్మి సీరియస్ అవుతుంది ముందు పని చూడు అని దివ్య కి చెప్తుంది. మొత్తానికి ఈ ఎపిసోడ్ మాత్రం కాస్త ఎమోషనల్ గా ఇంకాస్త కొత్తగా పూర్తవుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో చక్రి మహాలక్ష్మి మళ్ళీ కలిసిపోతారా? లేదా? చక్రి ప్లాన్ వర్క్ అవుట్ అవుతుందా అన్నది చూడాలి..