E-Paper
Advertisement

పూజా నాగేశ్వర్ డాన్స్ చేసిన టాప్ 5 సాంగ్స్.. ఇదెక్కడి క్రేజ్ రా మావా!

పూజా నాగేశ్వర్ డాన్స్ చేసిన టాప్ 5 సాంగ్స్.. ఇదెక్కడి క్రేజ్ రా మావా!
Advertisement

Pooja Nageshwar Top 5 Folk Songs:తెలంగాణా జానపదాలు ఇపుడు దుమ్ము రేపుతున్నాయి. సినిమా పాటల కన్నా మించి వీటికి ఆడియన్స్ లో క్రేజ్ ఉందంటే ఆశ్చర్యం లేదు.ఇక ఈ మధ్య వీటి దూకుడు మరింతగా పెరిగిందనే చెప్పాలి.తెలంగాణా మట్టి పరిమళం గుభాలిస్తున్న పాటలు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ కావడంతో ఇపుడు ఎక్కడ చూసినా ఈ ఫోక్ పాటలే రీ సౌండ్ చేస్తున్నాయి.

ఇక పాటలకి ఎంతటి క్రేజ్ వస్తుందో వాటిలో నటించిన నటీ నటులు కూడా అంతకు మించిన క్రేజ్ దక్కించుకోవడం విశేషం.ఇదే క్రమంలో ఇపుడు వరుస సాలిడ్ హిట్స్ ని సొంతం చేసుకుంటూ మీడియాలో హైలెట్ అవుతుంది ఫోక్ డాన్సర్ పూజా నాగేశ్వర్.మరి పూజా నాగేశ్వర్ టాప్ 5 సాంగ్స్ ఏంటో మనమూ ఒకసారి చూసేద్దాం.

Advertisement

”ఓ పిలగా వెంకటేషు”

ముందుగా పూజా నాగేశ్వర్ అనే పేరు వినగానే మనకి ముందుగా గుర్తొచ్చే ఫోక్ సాంగ్ ”ఓ పిలగా వెంకటేషు”.రెండేళ్ళ కింద వచ్చిన ఈ పాట ఏకంగా 405మిలియన్ల వ్యూస్ ని సొంతం చేసుకోవడం విశేషం.సింగర్ ప్రభ రాసి పాడిన ఈ పాటలో పూజా నాగేశ్వర్ కి జోడీగా రౌడీ హరీష్ స్టెప్పులేసి అదరగొట్టాడు.ఇక ఇప్పుడు బాగా వినిపిస్తున్న వెంకట్ అజ్మీరా దీనికి మ్యూజిక్ ఇవ్వడం విశేషం. ఇక స్టార్ ఫోక్ కొరియోగ్రాఫర్ శేఖర్ వైరస్ కంపోజ్ చేసిన ఈ పాట నెట్టింట్లో ఒక సెన్సేషన్ అనే చెప్పాలి.

Advertisement

”బిందె మీద బిందె పెట్టి”

ఇక పూజా నాగేశ్వర్ కి మరింత పేరు తీసుకొచ్చిన పాట ”బిందె మీద బిందె పెట్టి”.వైష్ణవీ సోనీ చేసిన వరిజినల్ పాటకి డిజే వెర్షన్ లో వచ్చిన ఈ పాటలో పూజా నాగేశ్వర్ కి తోడుగా యమునా తారక్ కూడా నటించడం విశేషం .ఒక రకంగా చెప్పాలంటే ఇపుడు ఎక్కడ చూసినా ఈ పాటనే మారు మ్రోగిపోతుందంటే ఆశ్చర్యం లేదు.ఈ పాటకి రెండు నెలల్లో వచ్చిన 97 మిలియన్ల వ్యూసే అది ప్రూవ్ చేస్తుంది కూడా. ఇక ఈ పాటకి శాండీ సంగీత దర్శకత్వంలో నాగవ్వ. శ్రీనిధిల గొంతు కూడా బాగా కలిసివచ్చిందనే చెప్పాలి.

 

‘గాజులు తెమ్మంటిని పెనిమిటి’
ఇక ‘గాజులు తెమ్మంటిని పెనిమిటి’ అనే పాట కూడా పూజా నాగేశ్వర్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పాలి.కళ్యాణ్ కీస్ మ్యూజిక్ అందించిన ఈపాట ని సురేష్ కడారి రాయగా దివ్య మాలిక తన గొంతుతో పాటని మరో లెవెల్ లో పెట్టేసింది. ముఖ్యంగా శేఖర్ వైరస్ కొరియోగ్రఫిలో జనతా బాబు అందించిన పల్లెటూరి విజువల్స్ మెయిన్ ఎసెట్.ఇక ఈ పాట ఇప్పటికి 4.2మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుని మరింతగా దూసుకుపోతుంది.

‘బావో బంగారం ‘

ఇక పోయినేడు వచ్చిన ‘బావో బంగారం ‘కూడా ఆడియన్స్ ని అలరించిందే.స్టార్ ఫోక్ సింగర్ మమతా రమేష్ పాడిన ఈ పాట ఇప్పటికి ఏకంగా 28 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకోవడం విశేషం.ఇక ఈ పాటలో కూడా ”ఓ పిలగా వెంకటేషు”లో కలిసి స్టెప్పులు వేసిన రౌడీ హరీష్ కనిపించడం మరో విశేషం.

‘రాధ రాధ బైకడి రాధ’

ఇక ఒకప్పుడు బాగా విపించిన ట్యూన్ కి చేసిన పాట ..’రాధ రాధ బైకడి రాధ’.అవదూతి లక్ష్మణ్ రాసిన ఈ పాటకి హనీ గణేష్ అందించిన న్యూ బీట్ పాటని మరో లెవెల్ లో పెట్టేసింది.ముఖ్యంగా పూజా నాగేశ్వర్ వేసిన స్టెప్పులు, ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ టాప్ నాచ్.ఇక ఈ పాట కూడా ఇప్పటికి 18 మిలియన్ల కి పైగా వ్యూస్ సొంతం చేసుకుని పూజా కెరీర్ ని మలుపు తిప్పిందే.’

‘కిందో బంగుల మీదో బంగుల’
ఇక తాజాగా రిలీజ్ అయిన ‘కిందో బంగుల మీదో బంగుల’ అనే మరో పాట కూడా ఇపుడు సోషల్ మీడియా చేస్తుందే.కొంగరి కృష్ణ, శీనిధి కలిసిపాడిన ఈ పాట వచ్చిన ఐదు గంటల్లోనే ఏకంగా 50 వేల వ్యూస్ సొంతం చేసుకోవడం విశేషం. చూడాలి కళ్యాణ్ కీస్ మ్యూజిక్ లో శేఖర్ వైరస్ కోరియోగ్రఫీ చేసిన ఈ పాట ముందు ముందు ఇంకెన్ని సంచలనాలు నమోదు చేస్తుందో !

Tags

Related News

ఈశ్వర్ సాయితో వివాదం.. మాధురి రాథోడ్ కి కలిసొచ్చిందా?

4 నెలలుగా సంతోషంగా ఉన్నా.. అనసూయ వీడియో వైరల్!

ఢీ 21 షో విన్నర్ గా ఆర్నాల్డ్ మునిగల్..ప్రైజ్ మనీ ఎంతంటే?

నర్మద ఫ్యాన్స్ కు మైండ్ బ్లాక్.. ఇది అస్సలు ఊహించలేదు మావా..

Illu Illalu Pillalu Today Episodes: గుడ్ న్యూస్ చెప్పిన శ్రీవల్లి.. ధీరజ్ ఫుల్ హ్యాపీ.. దీపావళి సంబరాలు షురూ..

Podarillu Today Episode : నారాయణ మాటతో మహా ఫుల్ హ్యాపీ.. మాధవ్ ను ఆడుకున్న తమ్ముళ్లు.. పాపం చక్రీ..

Brahmamudi Serial Today Episode November 23rd ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజు, ఇందులను చంపేందుకు రేఖ వేసిన ప్లాన్ వర్కవుట్ అవుతుందా..?  

Big Stories

Advertisement
×