Madhuri Rathod: మాధురీ రాథోడ్.. అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మన్స్ తో చిన్నపిల్లలను మొదలుకొని పెద్దల వరకు తన ఆటపాటతో ఉర్రూతలూగిస్తున్న ఈమె గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. సన్నాసన్నా బియ్యమే, బాసింగ బలాలే అంటూ ఎన్నో పాటలతో ఆ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె కెరియర్ పీక్స్ లో ఉండగానే తన తోటి డాన్సర్ అయిన ఈశ్వర్ సాయి (Eshwar Sai) తో వివాదం ఈమెను మరింత వార్తల్లో నిలిచేలా చేసింది. బాసింగ బలాలే సాంగ్ యూట్యూబ్ లో ఒకవైపు సంచలనం సృష్టిస్తున్న సమయంలో.. తోటి డాన్సర్ ఈశ్వర్ సాయితో ఏకాంతంగా అతడి భార్య శరణ్యకు చిక్కడం, ఆ తర్వాత పోలీసులు , కోర్టు కేసులు అంటూ వార్తల్లో నిలిచింది. అంతేకాదు ఈశ్వర్ సాయి తనను నమ్మించి మోసం చేశాడు అంటూ ఆత్మహత్యాయత్నం కూడా చేసిన విషయం తెలిసిందే.
అలా ఈశ్వర్ సాయి వివాదంతో విమర్శలు ఎదుర్కొని, ఆ తర్వాత సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో కూడా నిలిచిన ఈ ముద్దుగుమ్మ.. ఆ వివాదం తర్వాత ఇప్పుడు రెట్టింపు వేగంతో దూసుకుపోతోంది. అంతేకాదు ఆ వివాదం కారణంగా ఈమె చేసిన పాటలకి కూడా అంతే క్రేజ్ లభించిందని చెప్పవచ్చు. ఇటీవల “బిందే బిందెలు బావయ్యో”,” భామ సుందరాలో” అనే పాటతో మరోసారి ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఇక ఒకవైపు ఫోక్ సాంగ్ లతో మరొకవైపు డాన్స్ పెర్ఫార్మెన్స్ లతో అదరగొడుతున్న ఈమె డిమాండ్ ఇప్పుడు ఊహించని రేంజ్ కి వెళ్ళిపోయిందని చెప్పాలి. గతంతో పోల్చుకుంటే ఈశ్వర్ సాయితో వివాదం తర్వాత ఈమె సంపాదన కూడా భారీగా పెరిగిపోయిందని చెప్పవచ్చు.
ముఖ్యంగా ఈ రెండు పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయి అంటే ఒక పాటకు 12 మిలియన్ వ్యూస్ రాగా, మరో పాటకు 23 మిలియన్స్ కి పైగా వ్యూస్ వచ్చాయి. ఇంకా ఆమె చేసిన అనేక పాటలకు సంబంధించిన ప్రోమోలు కూడా ఇప్పుడు యూట్యూబ్లో సంచలనం సృష్టిస్తున్నాయి. అలా తన పాటలతో ఫుల్ బిజీగా ఉంటూ నెలకు సుమారుగా రూ.30 లక్షల వరకు ఈమె సంపాదిస్తోందట. ఈ స్థాయిలో ఒక ఫోక్ సింగర్ సంపాదించడం అంటే ఇటీవల కాలంలో ఎక్కడా చూడలేదు. పైగా ఒక హీరోయిన్ కంటే ఈ అమౌంట్ చాలా ఎక్కువే అని చెప్పాలి. ఈ విషయం తెలిసాక..మాధురి లెవెల్ వేరే రేంజ్ కు వెళ్ళిపోయింది అంటున్నారు ఆడియన్స్. మొత్తానికి అయితే వివాదం తర్వాతే ఈ రేంజ్ ఆదరణ లభిస్తోందనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.
ALSO READ: MS సుబ్బులక్ష్మి బయోపిక్ కోసం మరో సాహసానికి సిద్ధమైన రష్మిక!
సాధారణంగా సోషల్ మీడియా ద్వారా గుర్తింపు తెచ్చుకున్న సెలబ్రిటీలకు బిగ్ బాస్ వంటి రియాలిటీ షో లలో అవకాశం లభిస్తూ ఉంటుంది. అక్కడ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని.. మళ్లీ సినిమాలలో అవకాశాలు అందుకుంటూ ఉంటారు. అయితే మాధురి రాథోడ్ కి లభిస్తున్న ఆదరణ చూస్తుంటే బిగ్ బాస్ వంటి రియాలిటీ షో లు కాదు ఏకంగా సినిమాల్లోనే ఈమెకు అవకాశాలు వస్తాయని అంటున్నారు. మరి చూద్దాం ఆమె భవిష్యత్తు ఎలా ఉంటుందో .. ఏది ఏమైనా మాధురి రాథోడ్ కి ఈమధ్య బాగా కలిసొచ్చిందని చెప్పవచ్చు.