E-Paper
Advertisement

ఒంటికన్ను రాక్షసుడితో విశ్వంభర ఫైట్.. ఆ వార్తలను ఖండించే ప్రయత్నమా

ఒంటికన్ను రాక్షసుడితో విశ్వంభర ఫైట్.. ఆ వార్తలను ఖండించే ప్రయత్నమా
Advertisement

Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నుండి ఈ మధ్యకాలంలో ఎన్ని సినిమాలు వస్తున్నా.. అభిమానుల చూపంతా ‘విశ్వంభర’ పైనే అని చెప్పాలి. సోషియో ఫాంటసీ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రం కోసం అభిమానులే కాదు సినీ ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అలాంటి ఈ సినిమా నుండి తాజాగా ఒక ఆసక్తికరమైన విషయం వెలుగు చూడడంతో అభిమానులు మరింత ఎక్సైట్ అవుతున్నారు. అయితే ఈ వార్త సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తుంటే.. మరొకవైపు చిత్ర బృందం ఇలాంటి న్యూస్ ను స్ప్రెడ్ చేసి ఇప్పటివరకు ఈ సినిమాపై వచ్చిన నెగిటివ్ వార్తలను ఖండించే ప్రయత్నం చేస్తోంది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ఒంటికన్ను రాక్షసుడితో చిరంజీవి వార్..

బింబిసారా సినిమాతో దర్శకుడిగా తనను తాను ప్రూవ్ చేసుకున్న వశిష్ట మల్లిడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న చిత్రం విశ్వంభర. ఎప్పుడో గత ఏడాదే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా పలుమార్లు వాయిదా పడుతూ వస్తోంది. వాస్తవానికి ఈ సినిమా నుంచి గత ఏడాది చిన్న గ్లింప్స్ విడుదల అవ్వగా.. అందులో సీజీ వర్క్ బాగాలేదని వీఎఫ్ఎక్స్ చాలా పేళవంగా ఉందనే కామెంట్లు వినిపించాయి. దీంతో కచ్చితంగా సినిమాను అంతర్జాతీయ స్థాయిలో రూపొందించాలని ఆ దిశగా అడుగులు వేస్తూ వీఎఫ్ఎక్స్ పై దృష్టి పెట్టిన చిత్ర బృందం విడుదల తేదీని వాయిదా వేసింది. అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒంటికన్ను రాక్షసుడితో మెగాస్టార్ చిరంజీవి చేసే యుద్ధం సినిమాకే హైలైట్ గా ఉంటుందట . ఈ యాక్షన్ ఎపిసోడ్ ని హాలీవుడ్ స్థాయిలో రూపొందించారని ఇన్సైడ్ వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణలో ఈ ఎపిసోడ్ కూడా ఒకటి అని సమాచారం. ఏది ఏమైనా సినిమాపై అంచనాలు పెంచడానికి ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తున్న ఇలాంటి న్యూస్ సినిమాపై మరింత హైప్ పెంచుతోంది.

సమ్మర్ రేస్ నుంచి తప్పుకున్నట్టేనా?

Advertisement

ఇకపోతే సినిమాపై అంచనాలు పెంచుతున్నారు.. బాగానే ఉంది.. కానీ ఎప్పుడు విడుదల చేస్తారు అనే కామెంట్లు మాత్రం అభిమానుల నుంచి వ్యక్తం అవుతున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా సమ్మర్ రేస్ నుంచి కూడా తప్పుకున్నట్లు తెలుస్తోంది. అనుకున్న తేదీ కంటే ఇంకాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉందట. ఏది ఏమైనా ఈ సినిమాపై ఇప్పుడు హైప్ పెంచుతూ విడుదల సమయానికి అభిమానులలో మరింత క్యూరియాసిటీని పెంచబోతుందని కామెంట్లు మాత్రం గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రముఖ స్టార్ హీరోయిన్ త్రిష కథానాయికగా నటిస్తుండగా.. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. విక్రమ్, వంశీ, ప్రమోద్ యు వి క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ALSO READ:నా పని అయిపోయింది.. వారణాసి నుండి కుంభ పాత్రపై పృథ్వీ కామెంట్!

Related News

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన బాలయ్య భామ..టార్గెట్ సెకండ్ ఇన్నింగ్స్ ?

Big Stories

Advertisement
×