Kissik Talks:ప్రముఖ సినీ నటులు, రాజకీయ నాయకులు, జయభేరీ సంస్థ నిర్మాత మురళీమోహన్ (Murali Mohan) తాజాగా బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్ గా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ (Kissik Talks) కార్యక్రమానికి గెస్ట్ గా విచ్చేశారు. దీపావళి స్పెషల్ ఎపిసోడ్ సందర్భంగా నవంబర్ 8వ తేదీన రాత్రి 8 గంటలకు బిగ్ టీవీ ఛానల్ వేదికగా ప్రసారమయ్యే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోని తాజాగా నిర్వాహకులు విడుదల చేశారు. ఇందులో పాల్గొన్న మురళీ మోహన్ అసలు జీవితం అంటే ఏంటి? అనే విషయంపై స్పష్టత ఇచ్చారు.
ఈ మధ్యకాలంలో మరీ ముఖ్యంగా కొంతమంది బంధాల కంటే డబ్బులే ముఖ్యమని పరిగెడుతున్నారు. దీనిపై మీ స్పందన ఏమిటి ? అని ప్రశ్నించగా.. మురళీమోహన్ ఒక ఎగ్జాంపుల్ తో సహా అసలు విషయాన్ని బయటపెట్టారు. ఒక ఊరిలో ఒక ముసలాయన ఉండేవారు. ఆయన దగ్గరకు ఒక స్వామీజీ వచ్చారు. అప్పుడు ఆ ముసలాయన నేను చనిపోయాక స్వర్గానికి వెళ్లేటట్టుగా నాకు ఏదైనా ఉపాయం చెప్పండి అని అడిగారు. దానికి ఆ స్వామీజీ ఒక గుండు సూదిని ఇచ్చి.. రేపు మీరు చనిపోయాక పైకి వచ్చినప్పుడు ఈ సూది నాకు చూపించాలి అని చెప్పాడు.అసలు అది సాధ్యమవుతుందా?” అని తన మాటలతో అందరినీ ఆలోచింపజేశారు.
ఈ సంపాదన అంతా కూడా ఎవరికి దక్కుతుందో.. ఎవరు ఏం చేస్తారో మనం చనిపోయాక ఏం తెలియదు. అందుకే బ్రతికున్నప్పుడే నాలుగు మంచి పనులు చెయ్యి అంటూ జీవిత సత్యాన్ని బయటపెట్టారు. ఇక ఇదే ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..” ఇటీవల ఒకాయన మిలియన్ డాలర్లు సంపాదించారు. కానీ ఆయన అనారోగ్య బారిన పడినప్పుడు హాస్పిటల్ కి తీసుకెళ్లాలంటే అంబులెన్స్ వచ్చింది. ఇన్ని కార్లు ఉండగా అంబులెన్స్ ఎందుకు అని ప్రశ్నిస్తే.. పేషెంట్గా వెళ్లేటప్పుడు అంబులెన్స్ లోనే తీసుకెళ్లాలి అని సమాధానం చెప్పారు. ఏది తినకూడదు అంటారు. దాహంగా ఉంది మంచినీళ్లు ఇవ్వండి అని అడిగినా సరే ఒక స్పూను మంచినీళ్లు పోస్తారు అంతే.. దేనికోసం ఇన్నేళ్లు తాపత్రయపడ్డాము. అంటూ అసలు విషయాన్ని చెప్పి అందరి కళ్ళు తెరిపించారు మురళీమోహన్.
also read:ఏడాదిలో 2 కంపెనీలు మూతపడ్డాయి.. అప్పులిచ్చినవాళ్లు నా వెంటబడ్డారు: మురళీ మోహన్
ఒక మనిషిగా మనం భూమి మీదకు వచ్చాము అంటే నలుగురికి ఉపయోగపడేలా జీవించాలి.. నలుగురికి ఉపయోగపడేలా ఏదైనా మంచి పనులు చేయాలి. అంతేకాదు మనం కుడిచేత్తో చేసే సహాయం ఎడమ చేతికి కూడా తెలియకుండా చేసినప్పుడే ఆ దేవుడు కూడా మనల్ని కాపాడతాడు.. డబ్బు సంపాదించడం కాదు దానం చేసే గుణం కూడా ఉండాలి అనేట్టుగా ఈయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.