Actress Sonarika Bhadoria: అటు సినిమాల ద్వారా ఇటు సీరియల్స్ ద్వారా భారీ పాపులారిటీ సంపాదించుకున్న కొంతమంది సెలబ్రిటీలు తమ జీవితంలో తాము ఎదుర్కొన్న ఇబ్బందులను అప్పుడప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఒక సీరియల్ నటి తాను చచ్చి బతికాను అని చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. మరి ఆమె ఎవరు? ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడాల్సి వచ్చింది? అనే విషయం ఇప్పుడు చూద్దాం..
ఆమె ఎవరో కాదు సీరియల్ పార్వతీదేవిగా ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్న సోనారిక. ఈ సీరియల్ ఇచ్చిన గుర్తింపుతో సినిమాలలో అవకాశాలు అందుకొని హీరోయిన్ గా కూడా నటించింది. పైగా తమిళ్ , తెలుగులో కూడా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. గత ఏడాది డిసెంబర్లో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. వివాహానికి ముందే ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పిన ఈమె.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. జీతం పెంచమని అడిగితే సీరియల్ నుంచి తీసేసారని, ప్రసవం సమయంలో తాను చావు అంచుల వరకు వెళ్లానని, ఇలా పలు అనుభవాలను పంచుకుంది.
ఇంటర్వ్యూలో భాగంగా ఆమె మాట్లాడుతూ..” ఒక సీరియల్ కోసం నేను సుమారుగా ఏడాది పాటు పనిచేశాను. షో టి ఆర్ పి లు కూడా చాలా బాగున్నాయి. అందుకే ఛానల్ మాకు పార్టీ ఇచ్చింది.అలాంటి సమయంలో ఎవరైనా సరే జీతం పెంచాలని కోరుకుంటాం కదా.. అందరిలాగే నేను కూడా జీతం పెంచమని అడిగితే.. ఏ ప్రాతిపదికన అడుగుతున్నావు? అని నన్నే ప్రశ్నించారు . పైగా నన్ను ఆ షో నుంచి తొలగించారు కూడా ..ఇక నన్ను మార్చేస్తున్నారనే విషయం కూడా నాకు తెలియదు. ఆ సమయంలో నా సహనటుడు సీరియల్ వదిలి వెళ్ళిపోతానని బెదిరించడంతో అతడికి మూడు రెట్లు రెమ్యూనరేషన్ పెంచారు. ఇటు టాలీవుడ్ , కోలీవుడ్ లో కూడా పారితోషకం విషయంలో వ్యత్యాసాలు ఉన్నాయి. కొత్తగా వచ్చిన మగ నటులకు భారీగా రెమ్యూనరేషన్ ఇస్తారు. ప్రేక్షకులు వారిని హీరోలుగా భావించడమే ఇందుకు ప్రధాన కారణం. అటు హిందీ, టీవీ సీరియల్స్ లో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న నటీనటులకి కూడా తక్కువ పారితోషకాలే ఇస్తారు అంటూ ఆమె తెలిపింది
ఇదే ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ.. నటనకు దూరమైన తర్వాత వ్యాపారవేత్త వికాస్ పరాశర్ ను 2024లో పెళ్లి చేసుకుంది. 2025 డిసెంబర్లో వీళ్లకు ఆడ బిడ్డ పుట్టింది. అయితే ప్రసవం సమయంలో తాను చావు అంచుల వరకు వెళ్లొచ్చానని చెప్పుకొచ్చింది. ప్రసవం సమయంలో చివరి పుష్ ఇచ్చేముందు నేను కొద్దిసేపు స్పృహ కోల్పోయాను. ఇక నిజంగానే ఆ క్షణం నేను చనిపోతున్నానేమో అనిపించింది. ఒకవేళ నా బిడ్డ పుట్టిన తర్వాత నేను లేకపోతే.. ఆ పాపను ఎవరు చూసుకుంటారు అని కూడా భయం వేసింది. అంతేకాదు నా భర్తకు చివరిగా వీడ్కోలు చెప్పే అవకాశం దొరుకుతుందా? లేదా? అని భయపడ్డాను. పైగా నా భర్త మళ్లీ పెళ్లి చేసుకుంటాడా? అనే ఆలోచన కూడా వచ్చింది. అయితే నేను అతిగా చెప్పడం లేదు కానీ ఆ సమయంలో నాలో అలాంటి ఆలోచనలే పుట్టుకొచ్చాయి అంటూ ఆమె తెలిపింది. ఏది ఏమైనా సగటు అమ్మాయిగా తనలోని ఆవేదనను అభిమానులతో పంచుకుంది సోనారిక.
also read: కాకా మూవీకి భారీ డిమాండ్.. చిరంజీవా మజాకా?
2011లో తుమ్ దేనా సాథ్ మేరా అనే సీరియల్ తో బుల్లితెరకు పరిచయమయ్యింది. అలాగే దేవొంకే దేవ్.. మహాదేవ్ సీరియల్లో పార్వతీదేవి పాత్రతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. 2015లో వచ్చిన తెలుగు సినిమా జాదూగాడుతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. తర్వాత స్పీడున్నోడు , ఈడోరకం ఆడోరకం వంటి చిత్రాలు కూడా చేసింది.