E-Paper
Advertisement

వంశీ నీకు మానవత్వమే లేదా..అందరూ చూస్తున్నారు!

వంశీ నీకు మానవత్వమే లేదా..అందరూ చూస్తున్నారు!
Advertisement

Bigg Boss 10:బిగ్ బాస్ సీజన్ 10 ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతున్న విషయం తెలిసిందే. ఇకపోతే వినోదం సంగతి పక్కన పెడితే హౌస్ లో ఉండే కంటెస్టెంట్స్ వ్యక్తిత్వాలు, వారి ప్రవర్తనలు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ముఖ్యంగా వీరు ఒక రియాలిటీ షోలో పాల్గొన్నారు.. ప్రజలు వీరిని చూస్తున్నారు.. అనే ఆలోచన కూడా లేకుండా వీరు ప్రవర్తిస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సాధారణంగా బిగ్ బాస్ నుండి వచ్చే ప్రోమోలు రెండు నిమిషాలు లేదా మూడు నిమిషాలు.. హౌస్ లో జరిగిన పాజిటివ్ లేదా ఎవరినైనా టార్గెట్ చేయాలనుకుంటున్నారో వారి సన్నివేశాలను మాత్రమే ట్రిమ్ చేసి సోషల్ మీడియాలో విడుదల చేస్తూ ఉంటారు. ఇక రాత్రిపూట వచ్చే ఒక గంట ఎపిసోడ్ కూడా ఇలాగే జరుగుతుంది. కానీ జియో హాట్ స్టార్ లో ప్రసారమవుతున్న 24 * 7 స్ట్రీమింగ్ చూస్తే మాత్రం కంటెస్టెంట్స్ అసలు రంగు బయటపడుతుంది.

తగ్గించు లేదా తప్పించు టాస్క్ లో ఊహించని గొడవలు..

ఇకపోతే నిన్న జరిగిన టాస్క్ లో వంశీ ప్రవర్తించిన తీరు అందరికీ ఆగ్రహాన్ని తెప్పించింది. అసలు నువ్వు మనిషివేనా? మానవత్వమే లేదా ? అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. గేమ్ లో ఆడ మగ తేడా లేదు కానీ ఆడే తీరులో కూడా కాస్త ప్రవర్తన ఉండాలి అని మండిపడుతున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. రివార్డ్ అండ్ రివేంజ్ లో భాగంగా కంటెస్టెంట్స్ కి ఇచ్చిన మరో టాస్క్ “తగ్గించు లేదా తప్పించు”.. కంటెస్టెంట్స్ అందరూ థర్మోకోల్ బాల్స్ తో నిండిన సంచులు తగిలించుకోవాలి. ఇక అవతలి వ్యక్తి వాటిని తగ్గించకుండా కాపాడుకోవాలి . అలా ఎవరి బ్యాగ్ లో అయితే ఎక్కువ థర్మోకోల్ బాల్స్ ఉంటాయో వారే విజేత అని టాస్క్ నిర్వహించారు.

వంశీ.. నీకు మానవత్వమే లేదా..

Advertisement

ఇకపోతే ప్రోమో లో నీతూ మాస్టర్ వంశీ బ్యాగులోని థర్మోకోల్ బాల్స్ ను తీసే ప్రయత్నం చేసిందని, ఆమె అతడిని కొట్టింది అన్నట్టుగా చూపించారు. కానీ అసలు ఎపిసోడ్ చూస్తే మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంది. నీతూ మాస్టర్ వంశీ బ్యాగ్ లోని థర్మోకోల్ బాల్స్ ను కింద పడగొట్టడానికి ప్రయత్నం చేయగా.. కోపంతో ఊగిపోయిన వంశీ ఆమె బ్యాగును తీసుకొని ..ఆ బాల్స్ అన్నింటినీ పీకేయడమే కాదు ఆమెను పట్టి ఈడ్చాడు.. ఆ సమయంలో నీతూ మాస్టర్ కింద పడిపోయింది. వద్దని వారించినా వినకుండా ఆమె వీపున తగిలేసుకున్న బ్యాగును గట్టిగా పట్టుకొని లాగుతూ ఆమెను ఈడుస్తూ అసలు మానవత్వమే లేకుండా వంశీ ప్రవర్తించాడు.

బిగ్ బాస్ పై ఆడియన్స్ ఫైర్..

ఇది చూసిన ఆడియన్స్ కూడా ఫైర్ అవుతున్నారు. వంశీ మీకు అసలు మానవత్వమే లేదా ?ఇది ఒక షో.. అక్కడ ఉన్నది అమ్మాయి అని ఆలోచించకపోయిన పర్లేదు కనీసం తోటి కంటెస్టెంట్ అని కూడా ఆలోచన లేదా నీకు? ఇంత విచక్షణారహితంగా ప్రవర్తిస్తావా ? అంటూ మండిపడుతున్నారు. మరికొంతమంది అయితే బిగ్ బాస్ ఇలాంటివన్నీ చూపించవా?.. ఇలాంటివి చూపించక పోయినా పర్లేదు కనీసం అలా చేసినవారికి పనిష్మెంట్ కూడా ఇవ్వవా అంటూ ఫైర్ అవుతున్నారు. మరి కొంతమంది వీకెండ్స్ లో నాగార్జున వంశీ పై యాక్షన్ తీసుకుంటారా అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Related News

శైలు ఎంత క్యూట్ గా ఉందో.. కుర్రాళ్ళు ఫిదా అవ్వాల్సిందే..!

Illu Illalu Pillalu Today Episodes: తండ్రిని ఎదురించిన చందు.. కుప్పకూలిన రామరాజు.. ఇదేం ట్విస్ట్..

Podarillu Today Episode : పెద్ది స్టైల్ కేక.. చక్రికీ మహా కౌంటర్స్.. శైలు మాటతో కేశవ షాక్..

Karthika Deepam 2 Serial Today Episode November 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఆఫీసుకు రాకుండా మాలిని ఆపగలదా..?   

Gundeninda GudiGantalu Today episode: ఇంటి కోసం ప్రభా ఎమోషనల్.. బాలు ప్లాన్ ఇదే..? రోహిణికి దిమ్మతిరిగే షాక్..

Brahmamudi Serial Today Episode November 5th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు చలపతి గ్రీన్ సిగ్నల్ – ఇందు మెడలో రాజు తాళి కడతాడా..? 

గాజుల గలగలతో ఓవర్ నైట్ స్టార్.. ఇప్పుడు అయ్యప్ప పాటతో మరోసారి ట్రోలింగ్!

Big Stories

Advertisement
×