Nindu Noorella Saavasam Serial Today Episode: మిస్సమ్మ ఆరుకు రాఖీ కట్టి వెళ్లిపోగానే మిగిలిని రాఖీని గుప్తకు కట్టాలనుకుంటుంది ఆరు. దీంతో గుప్త ఎమోషనల్ అవుతాడు. చిన్నప్పటి నుంచి అనాథ శరణాలయంలో బతికిన నాకు మా ఆయన నుంచి పిల్లల నుంచి చాలా ప్రేమ దొరికింది. మధ్యలో దేవుడు నన్ను బౌతికంగా నా కుటుంబానికి దూరం చేశాడు. అయితే నన్ను సోదరి అటూ మొదటిసారి అన్న ప్రేమను అందించారు. ఇప్పుడు నాకు మీరు తప్ప ఎవరూ లేరు గుప్త గారు. అందుకే ఈ రాఖీ మీకు కట్టాలనుకుంటున్నాను. కట్టమంటారా..? అని అడగ్గానే..
గుప్త చేయి ఇస్తాడు. ఆరు బొట్టు పెట్టి రాఖీ కడుతుంది. అక్షింతలు గుప్త చేతిలో పెడుతూ నన్ను ఆశీర్వదించండి అంటూ కాళ్లు మొక్కుతుంది. గుప్త అక్షింతలు చల్లుతూ దీర్ఘాయుష్మాన్ భవ అనబోతూ ఆగిపోతాడు. ఆరు ఏడుస్తూ చూస్తుంది. రాగ ద్వేషములకు అతీతంగా మానవుల పాపపుణ్యములను లెక్కించి లికించుటయే తెలిసిన మాకు మానవ సంబంధాలలో మాధుర్యాన్ని రుచి చూపించి నీ సోదర బంధంతో మాకు రక్షా బంధమైతివి. మీ రుణమును ఎటుల తీర్చుకొనెదను బాలిక అంటూ గుప్త కూడా ఎమోషనల్ అవుతాడు. ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆరు హ్యాపీగా నవ్వుకుంటుంది.
స్కూల్‌లో ఉన్న ఆనంద్, అంజు ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలో ఆనంద్ ప్లాన్ ఏంటి అంజు అని అడుగుతాడు. దూరంగా మాట్లాడుతూ కూర్చున్న ఆకాష్, అమ్ములను చూపిస్తూ వాళ్లను ఓట్లు అడుగుదాం అంటుంది. వాళ్లకు ఓట్లు ఇష్టం లేదు కదా..? ఓట్లు ఎందుకు వేస్తారు అంటాడు ఆనంద్. ఎలక్షన్స్ ఇష్టం ఉన్నా లేకపోయినా..? ఓటు వేసి తీరాలి అంటుంది అంజు. దీంతో వాళ్లు మనతో సపరేట్ అయ్యారు కదా వాళ్లు మనకు ఓటు వేయరు అంటాడు ఆనంద్. దీంతో శత్రువులు అయినా సరే ఓటు అడగడం మన ధర్మం అంటుంది అంజు. దీంతో ఆనంద్ ఏంటో ఏదో పెద్ద పొలిటీషన్ లా మాట్లాడుతున్నావు అంటాడు. ఫ్యూచర్‌లో నేను పెద్ద పోలిటీషియన్ అవుతా పద వెళ్లి ఓట్లు అడుగుదాం అంటూ ఇద్దరూ కలిసి అమ్ము, ఆకాష్ దగ్గరకు వెళ్తారు. అమ్ము, ఆకాష్ చూసి చూడనట్టు ఉంటారు.
ఆనంద్ చిన్నగా దగ్గినట్టు నటిస్తాడు. అయినా పట్టించుకోరు దీంతో అంజు కోపంగా వాడు అలా దగ్గుతుంటే మీకు వినిపించడం లేదా..? అంటుంది. దీంతో అమ్ము ఏంటో అడుగు ఆకాష్ అంటుంది. దీంతో ఆకాష్.. ఏంట్రా దగ్గుతున్నావు.. స్వీట్లు ఏమైనా ఎక్కువ తిన్నావా..? లేక జలుబు చేసిందా..? అంటాడు. దీంతో అంజు ఏంటి కామెడీయా..? అంటుంది. దీంతో అమ్ము కోపంగా మేము క్లాస్ వర్క్ చేసుకుంటుంటే వచ్చి డిస్టర్బ్ చేస్తుంది మీరు అంటుంద. ఇంతలో ఆనంద్ నేను నామినేషన్ వేశాను అంటాడు. కంగ్రాట్స్ చెప్తుంది అమ్ము.. మాకు మీ ఓట్లు కావాలి అంటాడు ఆనంద్. మేము ఓటు వేయము అంటుంది అమ్ము. దీంతో అంజు కోపంగా ఎందుకు వేయరు..? ఓటున్న ప్రతి స్టూడెంట్ ఓటు వేయాలి అంటుంది.
దీంతో ఆకాష్.. మేము ఎలక్షన్స్ ను బాయ్ కాట్ చేస్తున్నాం. అని చెప్తాడు. అలా ఎలా చేస్తారు అని అంజు అడుగుతుంది. మా ఇష్టం అని అమ్ము చెప్తుంది. దీంతో ఆనంద్ బాధగా అమ్మును రిక్వెస్ట్ చేస్తాడు. ఫ్లీజ్ అక్కా నాకు ఓటు వేయండి అంటూ బతిమిలాడుతాడు. దీంతో అమ్ము ఇదంతా నాకు ఇష్టం లేదు. చదువుకోవాలి అని నేను నీకు ముందే చెప్పాను. అనవసరంగా దీని మాటలు నమ్మి ఎలక్షన్స్ లో దిగావు. మేము ఓటు వేసేదే లేదు అంటుంది. దీంతో అంజు వేయకండి మీ రెండు ఓట్లు పడకపోతే మేము గెలవకుండా పోము.. ఓట్లు అడిగితే పెద్ద బిల్డప్ ఇస్తున్నారా..? పదరా అన్నయ్యా.. అంటూ ఆనంద్‌ను తీసుకుని వెళ్తుంది. వెళ్లండి వెళ్లండి మీకు రావాలసింది ఓట్లు కాదు మార్క్స్ అని మీకు ఎగ్జామ్స్ అయిపోయాక తెలుస్తుంది అంటుంది అమ్ము. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం