Nindu Noorella Saavasam Serial Today Episode : మనోహరికి మంగళ ఫోన్ చేసి కాళీ జైలు నుంచి బయటకు వచ్చిండు అని నీకోసం నువ్వు చెప్పిన దగ్గర వెయిట్ చేస్తున్నాడు అని చెప్తుంది. దీంతో మనోహరి కోపంగా తిడుతూ.. సరే వస్తున్నాను అంటూ ఫోన్ కట్ చేస్తుంది. ఇంతలో రణవీర్ ఫోన్ చేయగానే.. నెంబర్ చూడకుండానే.. మంగళనే చేసిందనుకుని ఫోన్ లిఫ్ట్ చేసి వస్తున్నాను అని చెప్పాను కదా.. మళ్లీ ఎందుకు ఫోన్ చేస్తున్నావు అంటూ తిడుతుంది. ఇంతలో రణవీర్ కోపంగా మనోహరి నీకు కరెక్టుగా అరగంట టైం ఇస్తున్నాను. నా దగ్గరకు వచ్చి నువ్వు చేసిన పనికి కారణం చెప్పి నన్ను కన్వీన్స్ చేయలేకపోతే నెక్ట్స్ ఫోన్ కాల్ అమరేంద్రకే పోతుంది అంటూ బెదిరిస్తాడు. దీంతో మనోహరి సారీ చెప్తుంది. నీ సారీలు నాకెందుకు ముందు నా దగ్గరకు రా అంటూ చెప్పి కాల్ కట్ చేస్తాడు. దీంతో మనోహరి ఇరిటేటింగ్‌గా రణవీర్ మూర్ఖుడు.. చెప్పింది చేస్తాడు. మంగళ వాళ్లే కొంచెం బెటర్ అని మంగళకు ఫోన్ చేసి నాకు చిన్న పని పడింది. ఒక గంట తర్వాత వస్తాను. అంతవరకు కాళీ మా గేటు దాటకుండా చూసుకోవాలి అని చెప్తుంది. దీంతో మంగళ గంట ఆపడానికి ఆరు లక్షలు ఇవ్వమని అడుగుతుంది. సరే అటుంది మనోహరి.
మనోహరి కంగారుగా రణవీర్ దగ్గరకు వెళ్లబోతూ.. ఇంటి ముందు కిందపడుతుంది. ఇంతలో మిస్సమ్మ వచ్చి మను అంటూ పిలుస్తుంది. కింద పడిపోయావా..? అంటూ వచ్చి పైకి లేపి కింద భూమిని చూస్తూ.. అయ్యో బంగారు తల్లి ఏమైనా దెబ్బ తగిలిందా అని అడుగుతుంది. దీంతో మనోహరి కోపంగా ఏయ్ అంటూ వేలి చూపించగానే.. ఆ వేలిని బిగ్గరగా పట్టుకుని నలిపేస్తుంది. దీంతో మనోహరి కోపంగా ఏయ్ లూజు అని పిలుస్తుంది. ఆ పిలుపుతో మిస్సమ్మ సిగ్గుపడుతూ.. ఆయన కూడా అలాగే లూజు అని పిలుస్తాడు అంటూ నేను అక్కలా సైలెంట్ కాదు.. చాలా వైలెంట్.. పిల్లల జోలికి వస్తే జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇస్తుంది. దీంతో మనోహరి నా జాగ్రత్త గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నా గమ్యం చేరే వరకు నా ప్రతి అడుగును నేనే సిద్దం చేసుకున్నాను అంటుంది.
దీంతో మిస్సమ్మ కోపంగా అత్యాశకు పోయి మనకు కాని దాని కోసం తప్పటడుగులు వేస్తూ తప్పులు చేసుకుంటూ పోతే పోయేది నీ ప్రాణమే మను అంటుంది. దీంతో మనోహరి.. తప్పులు చేసుకుంటూ నేను ఇంత దూరం వచ్చాను. అయినా ఈ ఇంట్లో నెక్స్ట్ ఎవరైనా ఎదైనా కోల్పోతారు అంటే అది నువ్వే అంటుంది. నన్ను పట్టుకుందామని నువ్వు ఎంత తిరిగినా నన్ను నువ్వు ఎప్పటికీ పట్టుకోలేవు అంటుంది. దీంతో మిస్సమ్మ ఆల్‌రెడీ పట్టుకున్నాను మను అంటుంది. ఏయ్ తింగరి నేను అన్నది ఈ పట్టుకోవడం కాదు.. నేను తప్పు చేయడం గురించి.. అమర్ ముందు నేను చేసిన తప్పు పట్టుకోవడం గురించి అంటుంది. అవునా అయితే నువ్వు వెళ్లు అంటుంది మిస్సమ్మ.
మనోహరి కంగారుగా వెళ్లిపోతుంటే.. ఆరు గమనించి అనుమానిస్తుంది. ఇంతలో చిత్రగుప్తుడు వచ్చి ఆగు బాలిక నువ్వు కోరుకున్నది నీకు ఇవ్వాలనుకుంటున్నాను అంటాడు. ఏంటి గుప్త గారు అని ఆరు అడిగితే.. నీలా ఉన్నా మరోక శరీరంలోకి నీ ఆత్మను ప్రవేశింపజేసి నీకొక నూతన రూపాన్ని ఇస్తాను అని చెప్తాడు. ఆరు షాక్ అవుతుంది. నేను విన్నది.. మీరు అన్నది ఒక్కటేనా అని నాకు కొంచెం అనుమానంగా ఉన్నది ఇంకొక్కసారి చెప్పగలరా..? అని అడుగుతుంది. దీంతో చిత్రగుప్తుడు.. అరుంధతిగా ప్రాణం పోయి.. అర్థాంతరంగా ఆగిపోయిన నీ ప్రయాణం మళ్లీ అనామికకగా మరలా కొనసాగబోతున్నది అని చెప్తాడు. దీంతో ఆరు మీరు అబద్దం చెప్తున్నారు కదా..? నాకు ఆశ పెడుతున్నారు కదా..? నన్ను మోసం చేయాలనుకుంటున్నారు కదా..? అంటూ ప్రశ్నిస్తుంది.
దీంతో చిత్రగుప్తుడు లేదు బాలిక నేను నిజమే చెప్తున్నాను.. మా ప్రభువుల వారికి తెలియకుండా.. విచిత్రుడి కంట కూడా పడకుండా ముల్లోకాలకు.. ముక్కోటి దేవతలకు తెలియకుండా నీలాగే ఉన్న ఒక శరీరంలోకి నీ ఆత్మను పరకాయ ప్రవేశం చేయించబోతున్నాను అని చెప్తాడు. ఆరు ఆశ్చర్యంగా చూస్తుంది. ఇంతలో చిత్రగుప్తుడు మంత్రం వేసి అనామికను చూపిస్తాడు. అనామికను చూసిన ఆరు అచ్చం నాలాగే ఉంది. మీరు చెప్పింది నిజం. నిజంగా నాలాగే ఉంది. ఆమె ఎందుకు అలా ఏడుస్తుంది చిత్రగుప్త గారు ఏమైంది.. పాపం ఏం కష్టం వచ్చిందో ఏమో.. అంటుంది. అది కోరి తెచ్చుకున్న కష్టం అని చెప్తాడు గుప్త. ఇంతలో అనామిక సూసైడ్ చేసుకుంటుంది. ఆమె చనిపోయాక ఆమె శరీరంలోకి నిన్ను ప్రవేశపెడతాను నీకు ఇష్టమేనా అని అడుగుతాడు చిత్రగుప్తుడు.. ఆరు సరే అంటుంది.
కారులో వెళ్తున్న అమర్.. మనోహరి గురించి ఆలోచిస్తుంటాడు. మనోహరి ఏంటి నిమిషాల వ్యవధిలోనే మారిపోయింది అంటాడు. రణవీర్ వచ్చినప్పటి నుంచి మనోహరిలో మార్పు గమనించాను. మనోహరి మన దగ్గర ఏదో దాస్తుంది అనుకుంటున్నాను అని చెప్పగానే.. రాథోడ్ ఇన్నాళ్లకు కరెక్టు రూట్ లో ఆలోచిస్తున్నారు సార్. డొంక లాగండి.. తీగంతా కదులుతుంది అని చెప్తాడు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఫస్ట్ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?