Intinti Ramayanam Today Episode February 11th: నిన్నటి ఎపిసోడ్ లో.. అవని ఎన్నిసార్లు చెప్పినా కూడా దయాకర్, స్వరాజ్యం ఇద్దరు ఒప్పుకోరు. మా ఇంట్లోనే ఉండాలని అంటారు.. ఇక అవని తప్పని పరిస్థితులలో అక్కడే ఉండటానికి ఒప్పుకుంటుంది. ఆ తర్వాత అవనిని వాళ్ళు సొంత కూతురు లాగా చూసుకుంటారు. వాళ్ళ పరిస్థితిని చూసి ఎలాగైనా ఆదుకోవాలి అని అనుకుంటుంది అవని.. కోమలి తన ఫ్రెండ్ కి చే బదులు డబ్బులు ఇస్తుంది. అయితే ఆమె ఇవ్వనని చెప్పడంతో కోమలి కోపంగా ఉంటుంది ఈ విషయాన్ని పార్వతీ భానుమతితో చెప్తుంది. ఫ్రెండుకి 10000 డబ్బులు ఇచ్చాను అది ఎల్లుండి ఇస్తానని చెప్పింది ఇప్పటివరకు ఇవ్వలేదు అడిగితే అసలు ఇవ్వను పో అన్నట్లు మాట్లాడుతుంది అనేసి కోమలి చెప్తుంది.. ఇక భానుమతి పైకి కనిపించే వాళ్ళందరూ మంచివాళ్ళు కాదు మన నమ్మి మోసపోవడం తప్ప అవని గురించి చూశాం కదా పైకి ఎంత అమాయకంగా ఉంటుంది ఇంత మోసం చేస్తదని ఎవరూ ఊహించలేదు కదా అనేసి అంటుంది దానికి పార్వతి అవని గురించి మాట్లాడకండి అత్తయ్య ఆమె చేసిన మోసాన్ని నేను ఇప్పటికీ మర్చిపోలేక పోతున్నాను అని పార్వతి అంటుంది.. శ్రియ పై పల్లవి పెత్తనం చెలాయించాలని అనుకుంటుంది. కానీ శ్రియ మాత్రం పల్లవికి దిమ్మ తిరిగిపోయే షాక్ ఇస్తుంది. ఆ తర్వాత శ్రీను చేసిన విషయాన్ని పల్లవి బయటపెడుతుంది. పల్లవికి రాజేంద్రప్రసాద్ కౌంటర్ ఇస్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అవని ఉద్యోగం చేయాలని ఇంటర్వ్యూ కి వెళ్తుంది ఎన్ని ఆఫీసులు తిరిగినా తనకి ఇంట్లో వాళ్ళ షూరిటీ అన్న కనీసం భర్త శూరిటీ అన్న ఇవ్వాలని అంటారు. చివరికి ఓ ఆఫీస్ కి వెళ్తే అక్కడ ఉద్యోగం ఇస్తామని అంటారు కానీ చక్రధర్ ఫోన్ చేయడంతో ఉద్యోగం ఇవ్వడం కుదరదని అతను చెప్తాడు దాంతో నిరాశతో బయటికి వచ్చిన అవనీకి చక్రధరి పల్లవిల్లు కనిపించడంతో ఇదంతా వీరి పని అని అనుకుంటుంది. ఇక ఇద్దరూ కలిసి పెద్ద యుద్ధమే చేసుకుంటారు మధ్యలో మా తండ్రి గ్రేటు మా తండ్రి గ్రేటు అని చెప్పుకుంటారు ఇక తల్లిని పక్కన పెట్టుకొని ఇద్దరు వదిలాడుకోవడంతో చక్రధర్ ఫీల్ అయిపోతాడు.. మీరు ఎన్నిసార్లు నన్ను తొక్కేయాలని చూసినా కూడా దేవుడనేవాడు ఉంటాడు ఏదో ఒక రోజు నాకు న్యాయం జరిగేలా చూస్తాడు అనేసి అవని పల్లవి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి వచ్చేస్తుంది. ఇక అవని బయట బస్ స్టాప్ లో వెయిట్ చేస్తూ ఉంటుంది. బస్సు కోసం చూస్తున్నావా నేను చూసి ఇద్దరు రౌడీలు అల్లరి చేయాలని చూస్తారు. బస్టాప్ లో ఉన్న వాళ్ళని ఈరోజు బస్సులు రావట్లేదు వెళ్లండి అని పంపించేస్తారు. అవని నీ రౌడీలు ఇద్దరు నువ్వు చాలా బాగున్నావు నెంబర్ ఇస్తావా ఎప్పుడు కాబట్టి అప్పుడు మాట్లాడుకుందాం అనేసి ఆట పట్టిస్తారు.
వాళ్ళ మాటలకు కోపంతో రగిలిపోయిన అవని వాళ్ళని చంప పగలగొడుతుంది. ఏం మమ్మల్ని కొడతావని ఆ రౌడీలు మళ్ళీ కొట్టడానికి ప్రయత్నిస్తారు కానీ అప్పుడే అక్షయ అక్కడికి వచ్చి ఏ మిస్టర్ ఆమె ఎవరనుకుంటున్నారు నా భార్య అనేసి చితక్కొడతాడు. ఇక తర్వాత అవనిని రా వెళ్దాం అని పిలిస్తే అవని ఎక్కడికి వెళ్దాం మీఇంటికా అక్కడ నేనే తప్పు చేయలేనని ఒక్క మాట చెప్పలేదు మీరు. అదే గనక మీరు చెప్పింటే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అనేసి అక్షయ్ ని తిడుతుంది అవని. ఎక్కడుంటున్నాను అక్కడ సేఫ్గా వదిలిపెడతారు అవసరం లేదు బస్సు ఎక్కిన ఆటో ఎక్కిన నేను సేఫ్ గానే అక్కడికి వెళ్ళిపోతాను అనేసి అంటుంది.
అవని ఇంటికి ఏడ్చుకుంటూ వస్తుంది స్వరాజ్యం ఏమైందని అడుగుతుంది కానీ ఏం కాలేదండీ. నా కర్మ ఇంతే అనేసి అంటుంది అవని. నేనడిగితే మనకి నిజం చెప్పదు మనం వెళ్లి డైరెక్టుగా ఆ రాజేంద్రప్రసాద్ అని అడుగుదాం పదండి అనేసి స్వరాజ్యం ఆ ఇంటికి వెళ్తారు.. అక్కడ స్వరాజ్యం అందర్నీ ఒక ఆట ఆడుకుంటుంది. కోట్లు ఉన్నాయి కానీ మీ దగ్గర కొంచెం కూడా మానవత్వము సంస్కారం లేదు అనేసి అనగానే రాజేంద్రప్రసాద్ మౌనంగా ఉంటాడు కానీ పార్వతి మాత్రం స్వరాజ్యం మాటకు మాట సమాధానం చెబుతుంది. మీరు ఎలా కాదు గాని మిమ్మల్ని ఎలా దారికి తెచ్చుకోవాలో నాకు తెలుసు ఎవరికి ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు ఎన్నో పంచాయతీలు తీర్చాను కదా ఆ మాత్రం తెలియకుండా ఉన్నాను కదా అనేసి స్వరాజ్యం వాళ్లకి వార్నింగ్ వచ్చి వెళ్ళిపోతుంది.. ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో పార్వతీ పల్లవి అవని దగ్గరికి వెళ్లి డబ్బులు ఇస్తారు అవని దాని వద్దని తిరస్కరిస్తుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూడాలి..