Martin Guptill: ఫిబ్రవరి 10 సోమవారం రోజున లెజెండ్స్ 90 లీగ్ 2025 లో భాగంగా 8వ మ్యాచ్ లో చత్తీస్గడ్ వారియర్స్- బిగ్ బాయ్స్ తలపడ్డాయి. రాయ్ పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టు మాజీ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ {Martin Guptill} చత్తీస్గడ్ వారియర్స్ కి ప్రతినిత్యం వహిస్తున్నాడు. ఈ మ్యాచ్ లో మార్టిన్ గప్టీల్ ఓ అద్భుతమైన సెంచరీ తో చెలరేగాడు. ఓపెనర్ గా బరిలోకి దిగి ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోశాడు.
Also Read: IPL 2025: ఐపీఎల్ 2025 షెడ్యూల్ ఖరారు..రిలీజ్ ఎప్పుడంటే ?
అంతర్జాతీయ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ.. ఇంకా తనలో దూకుడు తగ్గలేదని మరోసారి నిరూపించుకున్నాడు. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఛత్తీస్గడ్ వారియర్స్ నిర్ణయిత 90 బంతులలో వికెట్ నష్టపోకుండా 240 పరుగులు చేసింది. చత్తీస్గడ్ వారియర్స్ ఓపెనర్ గా బరిలోకి దిగిన {Martin Guptill} గప్టిల్.. కేవలం 49 బంతులలోనే 16 సిక్సులు, 12 ఫోర్ లతో ఏకంగా 160 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇక మరో ఓపెనర్ రిషి ధావన్ 42 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 76 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
అనంతరం 251 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బిగ్ బాయ్స్ జట్టు.. నిర్ణీత 90 బంతులలో నాలుగు వికెట్లు కోల్పోయి 151 పరుగులు మాత్రమే చేసింది. బిగ్ బాయ్స్ బ్యాటర్లలో రాబిన్ బిస్ట్ {55}, సౌరబ్ తివారి {37} పరుగులతో రాణించినా ఫలితం దక్కలేదు. ఇక {Martin Guptill} మార్టిన్ గప్టీల్.. ఈ ఏడాది జనవరి 8న తన 14 సంవత్సరాల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కి వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 2019లో సన్రైజర్స్ హైదరాబాద్ {sun risers hyderabad} తరపున ఆడిన గప్టిల్.. ప్రస్తుతం ఫ్రాంచైజీ క్రికెట్ లో కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్ తరఫున 2009లో జాతీయ జట్టులోకి వచ్చిన {Martin Guptill} గప్టిల్.. మూడు ఫార్మాట్లలో కలిపి 367 మ్యాచ్ లకి ప్రతినిత్యం వహించాడు. న్యూజిలాండ్ తరఫున వన్డేలలో డబుల్ సెంచరీ చేసిన తొలి క్రికెటర్ గా రికార్డులకెక్కిన ఈ విధ్వంసకర ఓపెనర్.. తన కెరీర్ లో 198 వన్డేలు, 122 టి-20 లు, 47 టెస్టులు ఆడాడు.
Also Read: Donate Organs Campaign: అవయవ దానం.. రంగంలోకి టీమిండియా ప్లేయర్స్ !
ఈ మూడు ఫార్మాట్లలో కలిపి {Martin Guptill} గప్టిల్ 23 సెంచరీలు చేశాడు. వన్డేలలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్లలో న్యూజిలాండ్ జట్టు తరపున మూడవ స్థానంలో నిలిచాడు. 2015 వన్డే ప్రపంచ కప్ లో వెస్టిండీస్ పై 237 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇక 2019 సెమీఫైనల్ లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని రనౌట్ చేసి తన దేశాన్ని విజయం వైపు నడిపించాడు. ఇలా క్రికెట్ అభిమానుల హృదయాలలో గప్టిల్ {Martin Guptill} పేరు చిరస్తాయిగా నిలిచిపోతుంది.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">