Nindu Noorella Saavasam Serial Today Episode: తన ఆఫీసుకు మనోహరిని పిలిపించుకున్న అమర్ ప్రశ్నిస్తుంటాడు. కోల్‌కతా ఎందుకు వెళ్లావు…? రెండేళ్లు ఎక్కడున్నావు..? ఏం చేశావు.. ఆశ్రమంలో ఉంటానని సరస్వతి గారికి చెప్పి వెళ్లావు. కానీ ఆశ్రమంలో లేవు మరి ఎక్కడున్నావు..? ఆ రెండేళ్ల గురించి ఆరు ఎప్పుడు అడిగినా ఎందుకు చెప్పలేదు..? పైగా మాట దాటేసే దానివి అదెందుకో.. అంటూ అమర్ ప్రశ్నించడంతో మాట దాటేయడం ఏం లేదు అమర్ అంటే చెప్పడానికి ఏమీ లేదని అంటూ మనోహరి ఏదేదో చెప్పబోతుంటే.. నువ్వు గడిచిన టూ ఇయర్స్ గురించి చెప్పడానికి ఏమీ లేదా..? ఎక్కడున్నావు.. ఏం చేశావు.. ఎవరినైనా ఇష్టపడ్డావా..? పెళ్లి చేసుకున్నావా..? ఇలా ఏదైన ఒకటి ఉంటుంది కదా..? అంటూ అమర్ అడుగుతుంటే మనోహరి భయంతో వణికిపోతుంది.
అంటే ఆరు నువ్వు బెస్ట్ ఫ్రెండ్స్ కదా ఎందుకు లాస్ట్ వరకు ఆరుకు చెప్పలేదు.. ఏంటి మనోహరి నువ్వు మాట్లాడితే నేను విందామనుకుంటే అప్పటి నుంచి నేనే మాట్లాడుతున్నాను. నువ్వేం మాట్లాడలేదు అంటాడు అమర్. దీంతో అంటే నిజంగా చెప్పడానికి ఏమీ లేదు అమర్. ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాను. అందుకే అక్కడ ఉండలేక తిరిగి వచ్చేశాను అని చెప్తుంది మనోహరి. చిన్న ఉద్యోగమా..? నేనేదో బాధ్యత గల ఉద్యోగమేమో అందుకే అక్కడ రెండేళ్లు ఉన్నావేమో అనుకున్నాను అంటూ అమర్ చెప్పగానే.. మనోహరికి రణవీర్‌తో దుర్గను చూసుకునే విషయం గుర్తుకు వస్తుంది. సరే చెప్పడానికి ఇబ్బంది పడుతున్నట్టు ఉన్నావు.. బయలుదేరు మనోహరి.. ఇక నువ్వు వెళ్లొచ్చు అని చెప్పగానే..
సరే అమర్ అంటూ లేచి వెళ్లబోతూ కిందపడబోతుంది మనోహరి. మనోహరి వెళ్లిపోగానే.. రాథోడ్, మిస్సమ్మకు ఫోన్ చేస్తాడు. కంగారుగా మిస్సమ్మ హలో రాథోడ్ మను దొరికిందా..? అసలు ఆయనకు మను గురించి ఏ విషయం తెలిసింది..? అని అడుగుతుంది. దీంతో రాథోడ్ తెలియదు మిస్సమ్మ అని చెప్తాడు. దీంతో మిస్సమ్మ తెలియకపోవడం ఏంటి రాథోడ్.. మను ఇంకా బయటకు రాలేదా..? అని కోపంగా అడుగుతుంది. వచ్చారు మిస్సమ్మ కానీ ఉలుకు పలుకు లేకుండా వెళ్లిపోయారు అని చెప్పగానే.. వెళ్లిపోయారా…? అని మిస్సమ్మ అడుగుతుంది.
అవును మిస్సమ్మ కానీ వెళ్లే అప్పుడు ఆవిడను చూస్తే భయం వేసింది. మనిషి వణికిపోతుంది. కళ్లల్లో భయం అడుగుల్లో తడబాటు.. సారు ఏం అడిగారో తెలియదు కానీ ఆ విషయం మాత్రం చాలా భయపెట్టినట్టు ఉంది మిస్సమ్మ అని రాథోడ్ చెప్పగానే… రణవీర్‌కు సాయం చేస్తుంది మనునే అనే అనుమానం ఆయనకు వచ్చి ఉంటుంది అంటావా రాథోడ్. ఒకవేల వచ్చి ఉంటే ఆయన మనును అంత ఈజీగా వదలరు కదా అంటుంది. తెలిసి కూడా ఈ కేసును వదిలేశారు అంటే మా సారు దగ్గర ఏదో బలమైన కారణం ఉండి ఉంటుంది మిస్సమ్మ అని రాథోడ్ చెప్పగానే.. సరే రాథోడ్ నీకు ఏదైనా విషయం తెలియగానే.. నాకు ఫోన్ చేయ్ అని కాల్ కట్ చేస్తుంది మిస్సమ్మ.
తర్వాత రూంలో అమర్ వర్క్ చేసుకుటుంటే పేపర్స్ తీసుకుని వస్తుంది మిస్సమ్మ. అందులో అమర్‌ను సైన్ చేయమని అడిగితే చేయడు. అయితే అవి బెస్ట్ కపుల్ అవార్డు కోపం అప్లయ్ చేయడానికి అని అందులో అవార్డు గెలిస్తే వచ్చే డబ్బులు అనాథ శరణాలయానికి డొనేట్ చేద్దామని మిస్సమ్మ చెప్తుంది. అయినా విననట్టు అమర్ ఉండటంతో మిస్సమ్మ పడుకుంటుంది. అమర్ కూడా నిద్ర పోతాడు. మధ్యలో నిద్ర లేచి మిస్సమ్మను చూస్తూ తన పర్సులోని ఆరు ఫోటోను చూస్తూ.. ఆరు నువ్వు బతికి ఉంటే ఎలా ఆలోచించే దానివో భాగీ కూడా అలాగే ఆలోచిస్తుంది. అంటూ ఎమోషన్ అవుతాడు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఫస్ట్ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?