CM Revanth Reddy: నేడు ఢిల్లీలో బిజిబిజిగా గడపనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీసీ బిల్లుకు జాతీయ మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. BC బిల్లు గురించి ఇండియా కూటమి ఎంపీలకు వివరించనున్నారు. అనంతరం కాంగ్రెస్ ఎంపీలకు కులగణనపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
బీసీల హక్కులను చట్టబద్ధంగా సాధించేందుకు
తెలంగాణలో ఇటీవల నిర్వహించిన కులగణన సర్వేను ఆధారంగా చేసుకొని.. బీసీల హక్కులను చట్టబద్ధంగా సాధించేందుకు.. సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని, సర్వే ఫలితాలను దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలన్న ధ్యేయంతో కేంద్ర నాయకత్వాన్ని కలవనున్నారు.
ఇండియా కూటమి ఎంపీలకు వివరాలు – బీసీ బిల్లుపై అవగాహన
ఈరోజు రేవంత్ రెడ్డి ఇండియా కూటమిలోని ఎంపీలను.. ప్రత్యేకంగా కలిసి బీసీ బిల్లుపై వీరి మద్దతును కోరనున్నారు.
కాంగ్రెస్ ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్
అంతేగాక, కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు ప్రత్యేకంగా.. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న సీఎం, తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన కులగణన సర్వే విధానం, తీరులు, ఫలితాలను చర్చించనున్నారు. ఈ సర్వే ద్వారా రాష్ట్రంలోని బీసీ వర్గాల వాస్తవ పరిస్థితులు వెలుగులోకి వచ్చాయని, అదే విధంగా దేశవ్యాప్తంగా దీనిని అనుసరించవచ్చని సూచించనున్నారు.
రాహుల్, ఖర్గే లకు నివేదిక సమర్పణ
ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే లను కలిసి.. తెలంగాణ కులగణన సర్వే ఫలితాలను అధికారికంగా సమర్పించనున్నారు. బీసీల సాధికారతకు ఈ సర్వే ఎంత కీలకమైందో, దానిని ఎలా ఉపయోగించుకోవాలో వివరిస్తారు. బీసీలకు న్యాయం చేయాలంటే.. పార్లమెంటు స్థాయిలో చర్యలు అవసరమని సూచించనున్నారు.
కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి – 9వ షెడ్యూల్‌లో చేర్చాలన్న డిమాండ్
రేవంత్ రెడ్డి ముఖ్యంగా పార్లమెంట్‌లో.. బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని, ఆ బిల్లును భారత రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాలని.. కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయనున్నారు. ఈ మేరకు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉంది.
Also Read: మరో మైలురాయిని దాటేసిన తెలంగాణ ఆర్టీసీ.. ఏకంగా 200 కోట్ల మంది మహిళలు..?
బీసీ బిల్లు – దేశవ్యాప్తంగా చర్చకు దారి
తెలంగాణ సీఎం ఈ ప్రయత్నం దేశవ్యాప్తంగా బీసీల ప్రాతినిధ్యంపై.. చర్చకు దారితీయబోతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధమైన గౌరవం లభించేందుకు ఈ కృషి కీలకమైందని విశ్లేషకులు భావిస్తున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన..
ఢిల్లీలో రెండు రోజులు పర్యటించనున్న ముఖ్యమంత్రి
నేడు పలువురు కేంద్రమంత్రులతో రేవంత్ రెడ్డి సమావేశం
రేపు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలతో భేటీ
బీసీ కులగణన సర్వేపై ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం
బీసీ బిల్లును పార్లమెంటులో… https://t.co/nNczrJZpjL pic.twitter.com/bCdfeDu8ds
— BIG TV Breaking News (@bigtvtelugu) July 23, 2025