E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode June 17th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  ప్రచండకు షాక్ ఇచ్చిన అమర్ 

Nindu Noorella Saavasam Serial Today Episode June 17th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  ప్రచండకు షాక్ ఇచ్చిన అమర్ 
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: ప్రచండ పిల్లల రూంలోకి వెళ్లి బుజ్జమ్మలోని ఆరు ఆత్మను బంధించేందుకు ప్రయత్నిస్తుంటాడు. డోర్ దగ్గర నిలబడి మనోహరి, చంభా చూస్తుంటారు. అప్పుడే పెద్దగా గాలి వీస్తూ.. ఇంట్లో కిటికీ రెక్కలు గాలికి డపాడపా కొట్టుకుంటుంటాయి. ఆ శబ్దానికి అమర్‌ నిద్ర లేచి రూంలోంచి బయటకు వస్తాడు. అమర్‌ను గమనించిన మనోహరి, చంభా తమ రూంలోకి వెళ్లి డోర్‌ వేసుకుంటారు. డోర్ సౌండ్‌ విన్న అమర్‌ వెళ్లి డోర్ తెరచి చూస్తాడు. మనోహరి, చంభా నిద్రపోతున్నట్టు నటిస్తారు. వాళ్లను చూసిన అమర్‌ వెంటనే డోర్‌ క్లోజ్‌ చేసి పైకి వెళ్తాడు.

అమర్‌ వెళ్లగానే.. మనోహరి భయంగా పైన ప్రచండ దొరికిపోతాడేమో. అమర్‌కు నిజం తెలుస్తుందేమోనని భయపడుతుంది. ఇక్కడ బయపడుతూ ఉండటం ఎందుకు మనోహరి పైకి వెళ్లి ఏదో ఒకటి చేద్దాం పద అంటుంది. ఇద్దరు కలిసి పైకి వెళ్తారు. అప్పటికే పైన పిల్లల రూంలోకి వెళ్తాడు అమర్‌. అమర్‌ డోర్‌ ఓపెన్‌ చేయగానే.. ప్రచండ కర్టెన్‌ వేనక దాక్కుని ఉంటాడు. అమర్‌ పిల్లలను చూసి సారీ పిల్లలు నేను గతం మర్చిపోవడం వల్ల మిమ్మల్ని గుర్తు పట్టలేకపోయాను.. అనుకుంటూ ఎమోషనల్ అవుతూ.. పిల్లలు అందరినీ ముద్దాడి రూంలోంచి బయటకు వెళ్తుంటాడు. అప్పుడే కింద నుంచి వచ్చి చూస్తున్న మనోహరి, చంభా టెన్షణ్ పడుతుంటారు. చంభా భయంగా మనోహరి ప్రచండ ఎక్కడ ఉన్నాడు అని అడగ్గానే.. ఎక్కడో అమర్‌కు కనిపించకుండా దాక్కున్నాడేమో..? చూద్దాం ఉండు అంటుంది. అమర్‌ రూంలోంచి బయటకు వస్తున్న శబ్దం విని మనోహరి, చంభా చాటుకు వెళ్తారు. అమర్‌ డోర్‌ క్లోజ్‌ చేయబోతుంటే.. ప్రచండ చేతిలో ఉన్న మంత్రదండం తగిలి పూల బొకే కిందపడిపోతుంది.

Advertisement

వెంటన్‌ అమర్‌ షాక్‌ అవుతాడు. పూల బొకే కింద పడిపోయిన వైపు మెల్లగా అడుగులు వేస్తూ వెళ్తుంటాడు. కర్టెన్‌ వెనక దాక్కున్న ప్రచండ, రూం బయట చాటుగా ఉన్న మనోహరి, చంభా టెన్షన్‌ పడుతుంటారు. వెంటనే మనోహరి చంభా నువ్వు పాస్ట్‌ గా వెళ్లి మెయిన్‌ స్విచ్‌ ఆప్‌ చేయ్‌ వెళ్లు అని చెప్పగానే.. చంభా పరుగెత్తుకుంటూ వెళ్లి మెయిన్‌ స్విచ్‌ ఆప్‌ చేస్తుంది. ఇంట్లో కరెంట్‌ పోతుంది. దీంతో అమర్‌ ఈ టైంలో కరెంట్‌ పోవడం ఏంటి.. అని ఆలోచిస్తుంటే.. అమర్‌ వెనక నుంచి ప్రచండ రూంలోంచి బయటకు వెళ్తాడు.. మనోహరి వెంటనే ప్రచండను తన రూంలోకి తీసుకెళ్తుంది. అప్పుడే నిద్ర లేచిన మిస్సమ్మ కరెంట్ పోయిందేంటి..? అనుకుంటూ బయటకు వెళ్లి చూస్తుంది. అంతా కరెంట్‌ ఉంది మాకే పోయిందేంటి..? బహుశా మెయిన్‌ స్విచ్‌ డిప్‌ అయిందేమో.. అయ్యో కరెంట్ లేకపోతే పిల్లలు ఇబ్బంది పడతారు. అనుకుంటుండగా..

మెయిన్‌ స్విచ్‌ దగ్గరే ఉన్న చంభా ఈ పాటికి ప్రచండ తప్పించుకుని ఉంటాడు అనుకుంటూ స్విచ్‌ ఆన్‌ చేసి తిరిగి చూస్తుంది. మెయిన్‌ డోర్‌ దగ్గర ఉన్న మిస్సమ్మను చూసి షాక్‌ అవుతుంది. వెంటనే కారు చాటుకు వెళ్లి దాక్కుంటుంది. మిస్సమ్మ కూడా కరెంట్‌ వచ్చింది కదా పిల్లలు నిద్ర లేచారేమో ఓసారి చూసి వస్తాను అనుకుంటూ ఇంట్లోకి వెళ్తుంది. మిస్సమ్మ వెళ్లిపోగానే.. చంభా టెన్షన్‌ పడుతూ.. ప్రచండను మనోహరి దాచేసిందో లేదో.. భాగీకి దొరికిపోతే అంతే సంగతులు అనుకుంటుంది. ఇంతలో మిస్సమ్మ పిల్లల రూంలోకి వెళ్తుంది. అక్కడ అమర్‌ కూర్చుని ఉండటం చూసి ఆశ్చర్యపోతుంది. సార్‌ మీరు ఇంకా నిద్ర పోలేదా అని అడుగుతుంది. ఇందాక ఏదో శబ్దం వచ్చింది అందుకే పిల్లలన చూడాలని వచ్చాను.. నువ్వు నిద్రపోలేదా భాగీ అని అమర్‌ అడగ్గానే.. ఇందాక కరెంట్ పోయింది కదా సార్‌ అప్పుడే మెలుకువ వచ్చింది అని చెప్పగానే.. నా పిల్లలను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది భాగీ.. గతం మర్చిపోయిన నన్ను సార్‌ సార్‌ అంటూ పిలుస్తున్నారు.. అంటూ అమర్‌ ఎమోషనల్ అవుతుంటే..

Advertisement

మిస్సమ్మ అవును సార్‌ అంతా అక్కా.. అరుంధతి మేడం అంత బాగా పెంచారు అని చెప్పగానే.. అమర్‌ వాళ్లు నా పిల్లలు మరి ఈ బుజ్జమ్మ ఎవరు..? అని అడగ్గానే.. మిస్సమ్మ మనసులో తను కూడా మీ కూతురే సార్‌ అనుకుంటుండగానే.. వాళ్లు నా పిల్లలు అని గుర్తు వచ్చింది. ఎంత గుర్తు చేసుకున్నా ఈ బుజ్జమ్మ గురించి జ్ఞాపకం రావడం లేదు అని అమర్‌ చెప్పగానే.. వద్దు సార్‌ ఏదీ బలవంతంగా గుర్తు చేసుకోవద్దు.. అలా గుర్తు చేసుకుంటే ప్రమాదం అని డాక్టర్‌ చెప్పారు కదా..? అంటుంది మిస్సమ్మ.. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Podarillu Today Episode : సురేష్ కు వార్నింగ్ ఇచ్చిన పోలీసులు.. కేశవ మాటతో షాక్.. నారాయణకు మహా వార్నింగ్..

Brahmamudi Serial Today Episode August 3rd ‘బ్రహ్మముడి’ సీరియల్‌: పెళ్లి గురించి నిజం చెప్పమన్న అపర్ణ   

Illu Illalu Pillalu Today Episodes: కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి.. వల్లి రివేంజ్ స్టార్ట్.. కన్నీళ్లు తెప్పించే సీన్..

Intinti Ramayanam Today Episode: చుడిదార్ కాన్సెప్ట్ అదిరిపోయింది.. పార్వతి ఎమోషనల్… బాబు కిడ్నాప్..?

Satyabhama krish : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్..క్రిష్ గుడ్ బై..!

Big Stories

Advertisement
×