E-Paper
Advertisement

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!
Advertisement

Maruti Suzuki Upcoming Cars 2026: దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి వచ్చే 12 నుంచి 18 నెలల్లో పలు కొత్త మోడళ్లను భారత మార్కెట్లోకి తీసుకురానుంది. ఇందులో ఎలక్ట్రిక్ వెహికల్స్, ఫేస్‌ లిఫ్ట్ మోడల్స్, బయోఫ్లెక్స్ టెక్నాలజీతో కూడిన కొత్త కార్లు ఉన్నాయి. SUVలతో పాటు ఇతర సెగ్మెంట్లలో కూడా తన ఉత్పత్తులను విస్తరించే దిశగా కంపెనీ అడుగులు వేస్తోంది. త్వరలో అందుబాటులోకి రానున్న 4 క్రేజీ మోడళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1.కొత్త ఎలక్ట్రిక్ MPV

మారుతి సుజుకి నుంచి రాబోయే అత్యంత ఆసక్తికరమైన మోడల్ కొత్త ఎలక్ట్రిక్ MPV. కంపెనీ దీనిని YMC పేరుతో అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. స్పై ఫొటోల ఆధారంగా చూస్తే ఈ వాహనంలో ఎత్తైన రూఫ్, పొడవైన వీల్‌ బేస్, మూడు వరుసల సీట్లు ఉండే అవకాశం ఉంది. ది పెద్ద కుటుంబాల ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. ఈ MPV పొడవు సుమారు 4.5 మీటర్ల వరకు ఉండొచ్చని అంచనా. ఈ మోడల్‌ లో ఈ-విటారాలో ఉపయోగించిన EV ప్లాట్‌ ఫామ్‌ను వినియోగించే అవకాశం ఉంది. ఈ వాహనం ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్లకు పైగా రేంజ్ అందించే అవకాశముందని తెలుస్తోంది.

2.బాలెనో ఫేస్‌ లిఫ్ట్

Advertisement

మారుతి సుజుకి బాలెనో కూడా త్వరలో అప్‌ డేటెడ్ వెర్షన్‌ లో రానుంది. ప్రస్తుతం మార్కెట్లో మంచి అమ్మకాలు సాధిస్తున్న ఈ ప్రీమియం హ్యాచ్‌ బ్యాక్‌ కు ఇదే తొలి ఫేస్‌ లిఫ్ట్ కానుంది. టెస్టింగ్ టైమ్ లో కనిపించిన వాహనాలను బట్టి ముందు గ్రిల్, బంపర్లు, హెడ్‌ల్యాంప్స్, వెనుక భాగంలో కొన్ని డిజైన్ మార్పులు ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా క్యాబిన్‌ లో కొత్త ఫీచర్లు, మెరుగైన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, అప్‌ డేటెడ్ ఇంటీరియర్ డిజైన్‌ను కూడా అందించే అవకాశం ఉంది.

3.ఫ్రాంక్స్ ఫేస్‌ లిఫ్ట్

మారుతి ఫ్రాంక్స్ SUVకు కూడా మిడ్ లైఫ్ అప్‌ డేట్ సిద్ధమవుతోంది. టెస్టింగ్‌ లో కనిపించిన మోడళ్లను బట్టి బయటి డిజైన్‌ లో కొన్ని మార్పులు ఉండనున్నాయి. డిజైన్‌తో పాటు ఫీచర్లలో కూడా అప్ డేట్ కానున్నాయి. ముఖ్యంగా ADAS లాంటి ఆధునిక భద్రతా టెక్నాలజీని ఇందులో అందించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇది నిజమైతే ఫ్రాంక్స్ తన సెగ్మెంట్‌ లో మరింత పోటీగా మారే అవకాశం ఉంది.

4.బయోఫ్లెక్స్ కార్లు

Advertisement

మారుతి సుజుకి బయోఫ్లెక్స్ ఇంధన టెక్నాలజీపై కూడా దృష్టి పెడుతోంది. ఇటీవల కంపెనీ వాగన్‌ ఆర్ బయోఫ్లెక్స్ మోడల్‌ ను పరిచయం చేసింది. ఇదే టెక్నాలజీని మరిన్ని కార్లలో కూడా అందించాలని యోచిస్తోంది. రాబోయే మరికొద్ది నెలల్లో కంపెనీకి చెందిన మరికొన్ని సరసమైన మోడళ్లలో బయో ఫ్లెక్స్‌ కు అనుకూలమైన ఇంజిన్‌లు వచ్చే అవకాశం ఉంది. దీంతో వినియోగదారులకు ప్రత్యామ్నాయ ఇంధన ఎంపికలు పెరగడమే కాకుండా, సంప్రదాయ పెట్రోల్‌ పై ఆధారపడటాన్ని కూడా తగ్గించవచ్చు. రాబోయే 12 నుంచి 18 నెలల్లో విడుదలయ్యే ఈ కొత్త కార్లు భారత ఆటోమొబైల్ మార్కెట్లో పోటీని మరింత పెంచే అవకాశముంది.

Read Also: హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

Related News

థార్ కొనాలనుకుంటున్నారా? కాస్త ఆగండి.. కొత్త ఫేస్‌లిఫ్ట్ వచ్చేస్తోంది!

అపాచీ బైక్‌లకు బిగ్ అప్‌డేట్.. కొత్త వేరియంట్లు, అదిరిపోయే ఫీచర్లు ఇవే!

మారుతి బాలెనో vs టాటా ఆల్ట్రోజ్.. టాప్ వేరియంట్లలో ఏది బెస్ట్?

థార్ To డస్టర్.. దీపావళికి ముందే రాబోతున్న 5 అదిరిపోయే SUVలు!

మహీంద్రా BE 6 vs టాటా కర్వ్ EV.. రెండింటిలో ఏది తోప్ అంటే?

సీటు కింద ఏకంగా 70 లీటర్ల స్టోరేజ్.. ఎక్కువ బూట్ స్పేస్ కావాలంటే వీటిని కొనండి!

ఎర్టిగా To ఇన్నోవా.. ఆగస్టులో ఎక్కువగా అమ్ముడైన 7-సీటర్ కార్లు ఇవే!

సింగిల్ ఛార్జ్ తో 400 కి.మీ రేంజ్.. కళ్లు చెదిరే ఈవీ స్కూటర్లు ఇవే!

Big Stories

Advertisement
×