E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి.. వల్లి రివేంజ్ స్టార్ట్.. కన్నీళ్లు తెప్పించే సీన్..

Illu Illalu Pillalu Today Episodes: కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి.. వల్లి రివేంజ్ స్టార్ట్.. కన్నీళ్లు తెప్పించే సీన్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode August 3rd :భద్ర చెప్పిన మాటలు విన్న ప్రేమ ధీరజ్ ని పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమించి తప్పు చేశాను అని ఆలోచిస్తూ ఉంటుంది. నేను చేసిన తప్పు నేను మళ్లీ చేయకూడదు అనుకుని ప్రేమ బాధ పడిపోతూ ఉంటుంది.. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన ధీరజ్ ఇలా నన్ను అంటాడని అస్సలు ఊహించలేదు అని ప్రేమ ఒంటరిగా కూర్చుని కన్నీళ్లు పెట్టుకుంటుంది.. కానీ భద్ర మాత్రం తన ప్లాను బాగా సక్సెస్ అయింది అని సంతోషంగా ఉంటుంది.. ఏం చేసినా కూడా ప్రేమని ఇంటికి తీసుకొచ్చుకున్నాను నా కోడలు నా దగ్గరే ఉంటుంది అని అనుకుంటుంది.. ప్రేమ మాత్రం ఇటు తన పుట్టింటి వాళ్ళని అటు ధీరజ్ని వదిలిపెట్టలేక ఒంటరిగా తనలో తానే బాధపడిపోతూ ఉంటుంది.. ఎంత చెప్పినా కూడా ప్రేమ అసలు వినకుండా కోపంగా ఉంటుంది.. నర్మదా ధీరజ్ చాలా మంచివాడు అని ఒక వైపు ఒప్పించడానికి ప్రయత్నించినా కూడా ప్రేమ మాత్రం ఈ ఒకటి నన్ను అడగదక్క అని అంటుంది..

వేదవతికి షాకిచ్చిన రామారాజు..

వేదవతి టిఫిన్ కి అందరు రావాలి అని అనుకుంటూ ఉంటుంది. అయితే రామరాజు మాత్రం టిఫిన్ చేయడానికి ఇష్టపడడు. అందరూ కూడా టిఫిన్ చెయ్యండి అని వల్లి అడుగుతుంది వేదవతి మాత్రం నర్మద దగ్గరికి వెళ్లి.. ఏమనింది నా మేనకోడలు వస్తానని చెప్పిందా అని ఆత్రుతగా అడుగుతుంది. కానీ నర్మద మాత్రం మీ మేనకోడకి అంతా మీ బుద్ధిలే వచ్చాయి అని అనగానే వేదవతి అవును అందరు అదే అంటున్నారు నా పోలికలే వచ్చాయి. నా బుద్ధిలే వచ్చాయి అని ఇప్పుడు ఏమైంది చెప్పు అని అడుగుతుంది.. నేను చచ్చిన రాను అని చెప్పింది. ఇక రామరాజు కోసం తిరుపతి టిఫిన్ తీసుకురావడంతో అక్కడున్న వాళ్ళందరూ కూడా మంగతాయారు టిఫిన్ పై ప్రశంసలు కురిపిస్తూ వేదవతిని బాధపెడతారు.. వేదవతి ఎంత చెప్పినా సరే మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ టిఫిన్నే తినడంతో బాధపడిపోతుంది..

ప్రేమను రెచ్చగొట్టిన ధీరజ్..

Advertisement

ప్రేమని ఎలా తెచ్చుకోవాలి తనతో ఎలా మాట్లాడాలి అని ఆలోచిస్తూ ఉంటాడు.. ప్రేమతో ఎలాగైనా మాట్లాడాలి అని అనుకుంటాడు కానీ ప్రేమ మాత్రం ధీరస్తు మాట్లాడడానికి కనీసం ఇష్టపడదు.. ప్రేమతో మాట్లాడాలి అనుకొని తన వైపు ఎంతగా చూస్తున్నా సరే తను మాత్రం పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది.. అదే సమయంలో ప్రేమ ధీరజ్ కి గిఫ్ట్ గా ఇచ్చిన షర్టు తన కాళ్ల దగ్గర పడుతుంది.. దాన్ని చూసిన ప్రేమ విసిరి మళ్ళీ ధీరజ్ ముఖం పై కొట్టేస్తుంది.. ధీరజ్ కి కోచింగ్ సెంటర్ నుంచి ఫోన్ చేయడంతో.. ధీరజ్ ఎలాగైనా సరే ప్రేమని రెచ్చగొట్టి కోచింగ్ సెంటర్ కి పంపించాలి అని అనుకుంటాడు.. ఇక అప్పుడే ఇంట్లో నుంచి బయటికి వచ్చిన తిరుపతిని చూసి తిరుపతిని అడ్డుపెట్టుకొని ప్రేమను రెచ్చగొడతాడు.. జీవితంలో ఒక ఆశయం అంటూ ఏమీ లేదా ఎలా బతుకుతున్నావ్ నువ్వు అంటూ ఇండైరెక్టుగా ప్రేమని తిడతాడు దాంతో ప్రేమ ఎలాగైనా సరే నేను కోచింగ్ సెంటర్ కి వెళ్ళాలి అని భద్రని ఒప్పిస్తుంది..

భద్ర మాటతో ధీరజ్ హ్యాపీ..

అత్త నేను కోచింగ్ సెంటర్ కి వెళ్ళాలి ఎస్ఐఐ తీరాల్సిందే అని ప్రేమ చెప్పడంతో.. మొదట వద్దని చెప్పినా ఆ తర్వాత మాత్రం భద్ర ప్రేమ మాటని గౌరవించాలి. తను మన గుప్పెట్లో ఉండాలి అంటే కచ్చితంగా తన మాట వినాలి అని అనుకుంటుంది.. ప్రేమని నువ్వు కోచింగ్ సెంటర్ కి వెళ్ళమ్మా నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను అని చెప్పగానే ప్రేమ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మా ఇంట్లో వాళ్ళు నా ఇష్టమే కాదని నిరూపించారు అని ధీరజ్ కి వెటకారంగా చురక లాంటి ఇచ్చి లోపలికి వెళ్ళిపోతుంది.. ఇక భద్ర సేన ఇద్దరు కూడా ప్రేమని మన గుప్పెట్లో ఉంచుకోవాలి అంటే తన ఇష్టాన్ని కాదనుకున్న ఉండాలి అని అనుకుంటారు.. ఏది ఏమైనా కూడా ప్రేమ కోచింగ్ సెంటర్ కి వెళుతుంది అని ధీరజ్ చాలా హ్యాపీగా ఉంటాడు.. ఇది సీన్ ఎపిసోడ్కి హైలెట్గా నిలుస్తుంది..

విశ్వంను కొట్టిన సాగర్..

Advertisement

ప్రేమ ధీరజ్ లను ఎలాగైనా కలపాలి అని విశ్వం అనుకుంటాడు.. అమూల్య హెల్ప్ తీసుకుని వాళ్ళిద్దర్నీ కలిపే ప్రయత్నం చేయాలి అని అనుకుంటాడు.. అమూల్య విశ్వాన్ని చూసి కనీసం మాట్లాడడానికి కూడా ఇష్టపడదు.. అమూల్య నేను చెప్పేది ఒక్కసారి విను అని ఎంతగా బ్రతిమిలాడుతున్నా సరే అమూల్య నా జోలికి రావద్దు అని సీరియస్ వార్నింగ్ ఇస్తుంది.. అమూల్యని ఏడిపిస్తున్నాడని చూసిన సాగర్ విశ్వం ని దారుణంగా కొట్టేస్తాడు.. ఇంకొకసారి నా చెల్లెలు జోలికొస్తే మర్యాదగా ఉండదు అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు.. అటు వేదవతి అమూల్యంగా ఇంటికి రాలేదు అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Intinti Ramayanam Today Episode: చుడిదార్ కాన్సెప్ట్ అదిరిపోయింది.. పార్వతి ఎమోషనల్… బాబు కిడ్నాప్..?

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Podarillu Today Episode : సురేష్ కు వార్నింగ్ ఇచ్చిన పోలీసులు.. కేశవ మాటతో షాక్.. నారాయణకు మహా వార్నింగ్..

Brahmamudi Serial Today Episode August 3rd ‘బ్రహ్మముడి’ సీరియల్‌: పెళ్లి గురించి నిజం చెప్పమన్న అపర్ణ   

Intinti Ramayanam Today Episode: చుడిదార్ కాన్సెప్ట్ అదిరిపోయింది.. పార్వతి ఎమోషనల్… బాబు కిడ్నాప్..?

Satyabhama krish : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్..క్రిష్ గుడ్ బై..!

Big Stories

Advertisement
×