Brahmamudi serial today Episode: అపర్ణ, సుభాష్ వాళ్లు గుడికి వెళ్లిపోయారని వాళ్లు ఏ గుడికి వెళ్లారో ఎలా తెలుస్తుందని భ్రమరాంబ అడగ్గానే.. ఇప్పుడే తెలుసుకుంటానని రాజుకు కాల్ చేస్తాడు శేషు. ఎక్కడున్నావని అడగ్గానే.. ఎక్కడున్నాను ఆఫీసులోనే ఉన్నానని చెప్పగానే.. అదేంటి మీతో సత్యనారాయణ వ్రతం చేయిస్తామని చెప్పారు.. నువ్వు ఆఫీసులోనే ఉండటం ఏంటని శేషు అడిగితే రాజు షాక్ అవుతాడు. వీళ్లకు అనుమానం రాకుండా మేనేజ్ చేయాలి. అనుకుని ఒక అర్జెంట్ పని ఉండటంతో ఆగిపోయాను. ఇప్పుడే వెళ్తున్నాను.. అని చెప్పగానే.. శేషు శివాలయంలోనే కదా మనకు దగ్గరేలే వెళ్లి వచ్చేయ్ అంటాడు.
అందుకు రాజు అదేంటి నాకు వెంకటేశ్వర స్వామి గుడి అని చెప్పారు అంటాడు. ఆ మాటకు భ్రమరాంబ హ్యాపీగా ఫీలవుతుంది. శేషు మాత్రం అవునా నేనే మర్చిపోయినట్టు ఉన్నాను అల్లుడు వెంకటేశ్వర స్వామి ఆలయంలోనే ఉంటుందితే నేనే మర్చిపోయానేమో.. ఉంటాను అల్లుడు అంటూ కాల్ కట్ చేస్తాడు. భ్రమరం చూశావా నా తెలివి తేటలు ఎలా కనుక్కున్నానో..? అని అడగ్గానే.. సరే వెళ్దాం పద అంటూ ఇద్దరూ గుడికి వెళ్తారు. కాల్ కట్ చేయగానే.. రాజు అనుమానంగా మామయ్య ఫోన్ చేసింది పూజ ఏ గుడిలో జరుగుతుందో తెలుసుకోవడానికే అనుకుంటా..? కొంపదీసి వాళ్లు అక్కడకు వెళ్లాలి అనుకుంటున్నారా..? అనవసరంగా నోరు జారి గుడి పేరు చెప్పేశానే.. నా మీద ఏమైనా అనుమానం వచ్చిందా..? ఒకవేళ వాళ్లు గుడికి వెళితే అక్కడ నేను ఇందు పూజ చేయలేదని తెలిస్తే మాకు పెళ్లి కాలేదన్న అనుమానం వాళ్లకు కన్‌ఫం అయిపోతుంది. లేదు అలా జరగడానికి వీల్లేదు అనుకుంటూ రాజు వెంటనే ఇందుకు కాల్ చేస్తాడు. ఇందు కాల్ కట్ చేస్తుంది. ఫోన్ కట్ చేస్తుందే.. దీని ఇగో హర్ట్ అయినట్టు ఉంది. ఇక లాభం లేదు మనమే గుడికి వెళ్లి మామయ్య వాళ్లకు అనుమానం రాకుండా చూయాలి అనుకుంటాడు.
గుడిలో ఇందు, రాజుల కోసం అపర్ణ, సుభాష్ ఎదురుచూస్తుంటారు. ఇంతలో పంతులు వచ్చి రాహుకాలం దగ్గర పడుతుంది. వేరే వాళ్లకు కూడా వ్రతం చేయించాలి నేను వెళ్లి వాళ్లతో చేయిస్తాను అంటూ చెప్పి వెళ్లిపోతాడు. అపర్ణ, సుభాష్ కంగారు పడుతుంటారు. మరోవైపు గుడికి కారులో బయలుదేరిన భ్రమరాంబ, శేషులు కారు ట్రబుల్ ఇవ్వడంతో మధ్యలోనే ఆగిపోతారు. వెంటనే ఆటో బుక్ చేసుకుని వెళ్లిపోతారు.
గుడికి ఇందు ఒక్కతే వెళ్లడంతో అపర్ణ కోపంగా రాజు ఏక్కడ అని అడుగుతుంది. రాజు రాలేదని తనకు ఏదో పనుందని చెప్పాడంటుంది ఇందు. ఆ మాటకు అపర్ణ కోపంగా అసలు ఏం జరుగుతుంది. మీ ఇద్దరి మధ్య ఉన్న బంధమేంటో నాకు తెలియాలి. మర్యాదగా నిజం ఏంటో చెప్పు.. అనగానే.. నాన్నమ్మ నేను నిజమే చెప్తున్నాను. రావాలనుకున్నాడు.. కానీ ముఖ్యమైన పనుండి రాలేకపోయాడు.. అని ఇందు చెప్పగానే.. రాలేకపోయాడా..? లేకపోతే రాకూడదు కాబట్టి రాలేదా..? అనగానే.. ఇందు భయంగా నాన్నమ్మ ఏం మాట్లాడుతున్నావు.. అనగానే.. అవును ఐశ్వర్య మాట్లాడుతుంటే ఏమో అనుకున్నాను కానీ రాత్రి నువ్వు రాజు వేరుగా పడుకోవడం చూశాక మీ పెళ్లి మీద అనుమానం వచ్చింది. ఇప్పుడు రాజు రాలేదు ఇక నా అనుమానం ఇంకా బలపడింది ఇంతకీ రాజు ఎవరు…? అంటూ అపర్ణ ప్రశ్నల మీద ప్రశ్నలు వేయగానే.. ఇందు బాధపడుతుంది.
అపర్ణ తన మీద ఒట్టేసి నిజం చెప్పమని అడగ్గానే.. ఇందు నిజం చెప్తుంది. తమకు పెళ్లి కాలేదని చెప్తుంది. ఆ మాటకు అపర్ణ కోపంగా ఇందును కొడుతుంది. గట్టిగా ఏడుస్తూ.. బాధపడుతుంది అపర్ణ. అసలు పరాయి వాడిని మొగుడు అని ఎలా చెప్పుకుని తిరుగుతున్నావే..? అంటూ అపర్ణ నిలదీయగానే.. ఇందు ఆవేశంలో నిజం చెప్తుంది. తన పరాయి వాడు కాదు. దుగ్గిరాల వారసుడు అని చెప్తుంది. అపర్ణ షాక్ అవుతుంది. దుగ్గిరాల వారసుడా..? అని అపర్ణ అడగ్గానే.. అవును తను నీ కూతురు బిడ్డ నాన్నమ్మ.. మన ఇంటి బిడ్డ.. మన ఇంటి రక్తం అంటూ చలపతి తనకు చెప్పింది మొత్తం చెప్తుంది. ఆ మాటలకు అపర్ణ, సుభాష్ గర్వంగా ఎమోషనల్ అవుతారు.
రాజు మా మనవడా..? నా మనవడు అనుకుంటూ ఇద్దరూ హ్యాపీగా ఫీలవుతారు. అయితే ఈ నిజం బయటకు తెలియకూడదని.. తెలిస్తే రేఖ ఆంటీ ఏదైనా చేస్తుందని ఇందు చెప్తుంది. తన తల్లి కావ్య ఆశపడిన కొన్ని పనులు చేయాలని అంతవరకు ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దని ఇందు చెప్తుంది. అపర్ణ, సుభాష్ సరే అంటారు. ఇంతలో రాజు పట్టుబట్టలతో గుడిలోకి పరుగెత్తుకుంటూ వస్తాడు. అపర్ణ వాళ్ల కోసం చూస్తుంటే.. దూరం నుంచి రాజును గమనించిన అపర్ణ, సుభాష్ ఎమోషనల్ అవుతారు. ఇంతలో ఈరోజు బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.