E-Paper
Advertisement

ప్రైవేట్ పార్టీలో అదరగొట్టేసిన మృణాల్ ఠాకూర్..వీడియో వైరల్!

ప్రైవేట్ పార్టీలో అదరగొట్టేసిన మృణాల్ ఠాకూర్..వీడియో వైరల్!
Advertisement

Mrunal thakur:సెలబ్రిటీలు సినిమాలు, సినిమా ఈవెంట్లలోనే కాదు అటు ప్రైవేటు పార్టీలలో కూడా సందడి చేస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే అందాల తార మృణాల్ ఠాకూర్ (Mrunal thakur) కూడా తాజాగా బాలీవుడ్ లో జరిగిన ఒక ప్రైవేటు పార్టీలో తన అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ముఖ్యంగా తన స్నేహితులతో కలసి మృణాల్ చేసిన ఈ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ కి సంబంధించిన వీడియో చూసిన అభిమానులు. దీనిని షేర్ చేయకుండా ఉండలేకపోతున్నారు.

ప్రైవేట్ పార్టీలో మృణాల్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్..

పింక్ కలర్ ప్లెయిన్ శారీ కి గోల్డెన్ కలర్ బార్డర్ తో డిజైన్ చేసిన చీర కట్టుకున్న ఈమె.. దీనికి ఆపోజిట్ గోల్డెన్ కలర్ చెంకీ వర్క్ తో డిజైన్ చేసిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి తన మేకోవర్ ను ఫుల్ ఫిల్ చేసుకుంది. ఇక జుట్టును ఫ్రీగా వదిలేసి.. హిందీ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసి ఆకట్టుకుంది. మొత్తానికైతే సినిమాలలో పలు రకాల పాటలతో ప్రేక్షకులను అలరించే మృణాల్ ఠాకూర్.. ఇలా తొలిసారి ప్రైవేట్ పార్టీలో డ్యాన్స్ చేస్తూ కనిపించేసరికి అభిమానులు ఆమె డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ కి ఫిదా అవుతున్నారు. ఇందులో మృణాల్ కాస్త బొద్దుగా కనిపించడంతో చాలా ముద్దుగా ఉంది అంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం మృణాల్ చేసిన ఈ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

Advertisement

also read:టాక్సిక్ మూవీలో 5మంది హీరోయిన్స్.. హైయెస్ట్ రెమ్యూనరేషన్ ఈమెకే!

మృణాల్ ఠాకూర్ కెరియర్..

హిందీ సీరియల్స్ ద్వారా తన కెరీర్ ను ప్రారంభించిన ఈమె.. మరాఠీ చిత్రంతో నటిగా అరంగేట్రం చేసింది. ఆ తర్వాత హిందీలో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న మృణాల్ ఠాకూర్ తొలిసారి హను రాఘవపూడి దర్శకత్వంలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నేరుగా తెలుగులో చేసిన చిత్రం సీతారామం. ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. మొదటి సినిమాతోనే సీతామహాలక్ష్మి పాత్రతో కట్టుబొట్టు సాంప్రదాయంగా కనిపించి అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమాతో వంద కోట్ల క్లబ్ లో చేరి రికార్డు సృష్టించారు. ఇకపోతే పలు చిత్రాలలో నటిస్తూ మెప్పించిన ఈమె.. విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) తో కలిసి ఫ్యామిలీ స్టార్ సినిమా చేసింది కానీ పెద్దగా సక్సెస్ అవ్వలేదు. తర్వాత నాని (నాని) తో ‘హాయ్ నాన్న’ సినిమా చేసి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న మృణాల్ ఠాకూర్.. కొంతకాలం గ్యాప్ ఇచ్చి ఇటీవల అడివి శేష్ హీరోగా.. డెకాయిట్ సినిమాతో సరస్వతీ, జూలియట్ పాత్రలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో జూలియట్ పాత్రతో అందరి దృష్టిని ఆకట్టుకుంది. మొత్తానికి అయితే టాలీవుడ్ లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది.

మృణాల్ ఠాకూర్ తదుపరి చిత్రాలు..

Advertisement

మృణాల్ ఠాకూర్ సినిమాలు.. ఇకపోతే ఈ ఏడాది హై జవానీతో ఇష్క్ హోనా హై, డెకాయిట్, దో దీవానే సెహర్ మే వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం పూజ మేరీ జాన్ అనే చిత్రంలో నటిస్తున్న ఈమె.. మరొకవైపు అల్లు అర్జున్ హీరోగా, అట్లీ దర్శకత్వంలో వస్తున్న’ రాకా ‘సినిమాలో కీలక పాత్ర పోషిస్తుంది. మొత్తానికైతే ఇటు సోషల్ మీడియాలో కూడా సందడి చేస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తోంది.

Related News

“శ్రీచక్రం మీద కూర్చోవచ్చా?”.. సమంత ఫొటోపై నెటిజన్ల ఫైర్!

ఐదారు సార్లు రిహార్సల్ చేసిన రజినీకాంత్.. అసలు విషయం చెప్పిన విజయ్ సేతుపతి

వరంగల్ ఎయిర్‌పోర్టుపై సందీప్ రెడ్డి వంగా ఇంట్రెస్టింగ్ పోస్ట్.. పేర్లు కూడా చెప్పేశారు

నాని ది ప్యారడైజ్ సినిమాకు సీక్వెల్..ఫుల్ క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!

ఇంత అందంగా ఎప్పుడూ చూడలేదే.. శ్రీలీల లేటెస్ట్ లుక్ వైరల్!

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన దీపికా పదుకొనే.. ఈసారి పుట్టింది ఎవరంటే?

తిరుమల లడ్డులో కొవ్వు లేదు.. మతోన్మాదుల కొవ్వు తప్ప.. ప్రకాష్ రాజ్ ట్వీట్ వైరల్!

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న అనస్వర రాజన్..మరీ ఇంత డెడికేషన్ ఏంటీ అమ్మడు!

Big Stories

Advertisement
×