E-Paper
Advertisement

Podarillu Today Episode : సురేష్ కు వార్నింగ్ ఇచ్చిన పోలీసులు.. కేశవ మాటతో షాక్.. నారాయణకు మహా వార్నింగ్..

Podarillu Today Episode : సురేష్ కు వార్నింగ్ ఇచ్చిన పోలీసులు.. కేశవ మాటతో షాక్.. నారాయణకు మహా వార్నింగ్..
Advertisement

Podarillu Today Episode august 3rd: మాధవ్ కి పెళ్లి జరగాలి అని కేశవ ఆలోచించి శైలు నీ ఇంటి దగ్గర వదిలేసి వస్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత శైలుకి అందరూ కూడా తిట్టడం కొట్టడం చేస్తారు.. అటు మాధవ్ వాళ్ళింట్లో కేశవ చేసిన పనికి అందరూ తిడుతూ ఉంటారు. నువ్వు ఇలా చేయడం అస్సలు బాగోలేదు అని కేశవ అని అడుగుతారు.. చక్రి కి మాత్రం కేశవ ఎందుకు ఇలా చేశాడు అన్న నిజాన్ని చెప్తాడు.. మాధవ కోసం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నిజంగా గ్రేట్ అని అందరూ కేశవ్ అని పోగిడేస్తారు.. కేశవ చేసిన పనికి మహాలక్ష్మి ఫిదా అయిపోతుంది.. ఏది ఏమైనా కేశవా లాంటి మంచి అబ్బాయి దొరకడం శైలు అదృష్టవంతురాలు అని మహాలక్ష్మి అనుకుంటారు..

పోలీసులను పిలిచిన శైలు..

శైలు లోపలికి వెళ్ళిన తర్వాత కాసేపు ఆగి పోలీసులు లోపలికి ఎంట్రీ ఇస్తారు.. పోలీసులు లోపలికి రాగానే వరాలతో పాటు ఇంట్లోనే వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు.. ఏంటి మేడం ఎందుకు వచ్చారు లోపలికి అని వరాలు అడుగుతుంది. జైలుని పోలీసులు వచ్చారని బయటకి పిలవగానే ఇక పోలీసులు ముందర అన్ని నిజాలను కక్కిస్తుంది శైలు. నేను ప్రేమించానని చెప్పి నన్ను ఇంట్లో వాళ్ళు టార్చర్ చేస్తున్నారు మేడం.. అని శైలు కన్నీళ్లు పెట్టుకొని పోలీసులు ముందర చెప్పడంతో. వాళ్లు నిజమేనని నమ్మి వీళ్లిద్దరు కొడుతున్నారు కదా వీళ్ళని జైల్లో వేస్తాను అని పోలీస్ లు అంటారు. ఇక సురేష్ కి అలాగే వరాలకి షాక్ ఇస్తూ వచ్చిన ఎస్ఐ తన మీద గీతపడిన అస్సలు ఊరుకోను మీ అంతు చూస్తాను అని వార్నింగ్ ఇవ్వడంతో పాటుగా లెటర్ సంతకాలు పెట్టిస్తుంది..

శైలు నిజం చెప్పడంతో కేశవ హ్యాపీ..

Advertisement

శైలు మెకానిక్ షాప్ కి వచ్చి ఒకవైపు సమోసాలు మరోవైపు టీ తాగుతూ గ్యాప్ లేకుండా తింటూ ఉండగా.. కేశవ చూసి ఏంటి వచ్చిన పనిచేసి తింటూనే ఉన్నావు అని లెక్క పెడుతూ ఉంటాడు.. నిన్ను వదిలేసినప్పటినుంచి నాకు నిన్ను ఏం చేస్తారో అని టెన్షన్ ఉంది.. నువ్వు మాత్రం ఇలా కూల్ గా ఏమీ తెలియని దాని లాగా ఉన్నావు అంటే నాకు చాలా కంగారుగా ఉంది అసలు నేనేం అనలేదు అని కేశవ అడుగుతాడు.. కేశవ ఆ మాట వినగానే శైలు పై ఇంకాస్త ప్రేమ పెరుగుతుంది.. నా మీద ఇంకెవరు చేయి చేసుకోరు నేను చేసిన పనికి వాళ్లు భయపడిపోతున్నారు అని చెప్పగానే కేశవ ఒక్కసారిగా నవ్వుతాడు.. ఇది ఇంట్లోని వాళ్ళందరూ కూడా నిజంగానే గ్రేట్ అంటూ పొగిడేస్తూ ఉంటారు..

చక్రీ పై మహా సీరియస్..

ఇక కేశవ వాళ్ళ ఇంట్లో వాళ్ళు అందరూ భోజనానికి కూర్చుంటారు.. ఏమైంది శైలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమైనా అన్నారా అని అందరూ అడుగుతారు.. కానీ శైలు మాత్రం చేసిన పని విని అందరు ఒక్కసారిగా నవ్వుకుంటారు.. అమ్మాయికి ధైర్యం ఎక్కువే అని మహాలక్ష్మి తో పాటు నారాయణ కూడా ఒక్కసారిగా నవ్వడంతో అందరూ నవ్వుకుంటారు.. మహాలక్ష్మి పెళ్లి గురించి మధ్యలో రావడంతో చక్రి కూడా మాట్లాడుతాడు.. వాళ్ల నాన్నని తిట్టడంతో చక్రిపై సీరియస్ గా ఉంటుంది మహా.. కేశవ నువ్వు చాలా అదృష్టవంతుడివి ఆ అమ్మాయిని ఎట్టి పరిస్థితులను నువ్వు వదలొద్దు అని మహాలక్ష్మి చెప్తుంది. చక్రి అన్న మాటలకి మహాలక్ష్మి చాలా సీరియస్ గా ఉంటుంది..

మాధవ్ కోసం నారాయణ పై ఫైర్..

Advertisement

నారాయణ బయట కూర్చుని జంతికలు తింటూ ఉండగా మహాలక్ష్మి చాలా కోపంగా చూస్తుంది. తన చూపులుని చూసినా నారాయణ ఎందుకంత కోపంగా చూస్తున్నావ్ నేనేం తప్పు చేశాను అని అడుగుతాడు.. జంతికలు తింటావా మరి ఎందుకు అలా చూస్తున్నావు కావాలంటే చెప్పు ఇస్తాను అని నారాయణ భయపడిపోతూ ఉంటాడు.. ఇక మహాలక్ష్మి నలుగురి పిల్లల్ని కని నువ్వు ఇక్కడ జంతికలు తింటున్నావు.. పెద్ద కొడుకు మాత్రమే పిల్లల్ని పెంచి బాధ్యతలను భుజాల మీద వేసుకున్నాడు.. అతనికి పెళ్లి చేయాలని మీకు ఏ మాత్రం లేదు కదా కొంచమైనా బుద్ధి ఉందా అని నారాయణ అని దారుణంగా తిట్టేస్తుంది.. మాధవ్ కి సంబంధాలను వెతకడానికి మీరు ఏ ప్రయత్నం చేయడం లేదు అని చెప్పగానే నారాయణ నేనేం చేయాలి వాడు ఏది ఇష్టమైతే అదే చేయనివ్వు అని చెప్తాడు.. మొత్తానికి మాధవ్ కి పెళ్లి చేసేందుకు మహాలక్ష్మి తొందర పడుతుందని అర్థమవుతుంది.. నారాయణ మీద కోపాన్ని ఇంట్లో వాళ్ళందరి మీతో చూపించి తిట్టేస్తుంది మహాలక్ష్మి.. మాధవ్ కి ఎలాగైనా సరే పెళ్లి సంబంధం చూడాలి అని తేల్చి చెప్పేస్తుంది..

మాధవ్ ను చూసి షాక్..

బయట మార్కెట్ వెళ్లి కూరగాయలు తీసుకొని వస్తానన్న మాధవ్ అక్కడ ఒక కూరగాయలు బండి దగ్గర అందరితో మాట్లాడుతూ సరదాగా ఉంటారు.. కూరగాయలు కుంటూ వంటల గురించి మాట్లాడటం చూసిన కేశవ చక్రి ఇద్దరు కూడా ఈయన ఏంటి ఈయన పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తారు.. ఇక వీళ్లిద్దరు బలవంతంగా మాధవ్ ని బయటకు తీసుకొని వస్తారు.. ములక్కాడల గురించి పెద్ద క్లాసే పీకుతారు. నీ పెళ్లి గురించి ఆలోచించకుండా ఇప్పుడు కూరగాయల గురించి ఆలోచిస్తున్నావా అని చక్రి అంటాడు.. అంతేకాదు ఇకమీదట ఇచ్చిన కూరగాయలు బండి దగ్గర కాదు సూపర్ మార్కెట్లోనే కొనాలి అని చెప్పగానే మాధవ్ చెప్పిన సమాధాన విని చక్రీ సీరియస్ అవుతాడు.. నేను మార్కెట్ కి వెళ్లి ముగ్గు పిండి అలాగే చాక్లెట్లు కొనాలి రా అని చెప్పగానే కేశవ చక్రి ఇద్దరు కూడా బలవంతంగా తనని తీసుకొని వెళ్ళిపోతారు.. ఇక పెళ్లిళ్ల పేరయ్యతో ఎలాగైనా మాట్లాడి సంబంధం కుదరచాలి అని వాళ్ళిద్దరు అనుకుంటారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Illu Illalu Pillalu Today Episodes: కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి.. వల్లి రివేంజ్ స్టార్ట్.. కన్నీళ్లు తెప్పించే సీన్..

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Brahmamudi Serial Today Episode August 3rd ‘బ్రహ్మముడి’ సీరియల్‌: పెళ్లి గురించి నిజం చెప్పమన్న అపర్ణ   

Illu Illalu Pillalu Today Episodes: కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి.. వల్లి రివేంజ్ స్టార్ట్.. కన్నీళ్లు తెప్పించే సీన్..

Intinti Ramayanam Today Episode: చుడిదార్ కాన్సెప్ట్ అదిరిపోయింది.. పార్వతి ఎమోషనల్… బాబు కిడ్నాప్..?

Satyabhama krish : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్..క్రిష్ గుడ్ బై..!

Big Stories

Advertisement
×