Satyabhama krish : తెలుగు బుల్లితెర పైన ఈమధ్య వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరో హీరోయిన్లు మాత్రమే ఎక్కువగా కనిపిస్తున్నారు. ప్రతి సీరియల్ లో కూడా కన్నడ హీరోయిన్ లేదా తమిళ హీరో కనిపిస్తుంటారు. ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమవుతుందా సీరియల్స్ ఎంతో మంది వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన నటినటులే ఉన్నారు.. మొన్నటివరకు హీరో హీరోయిన్లు మాత్రమే కనిపించే వాళ్ళు కానీ ఇప్పుడు సైడ్ యాక్టర్లు కూడా వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్లే దర్శనమిస్తున్నారు. ఇప్పటికే దీనిపై అనేక చర్చలు మొదలైన విషయం తెలిసిందే. అలా తెలుగు ఇండస్ట్రీపై బుల్లితెర హీరోగా పరిచయమైన వాళ్లలో స్టార్ మా లో సక్సెస్ఫుల్గా ప్రసారమైన సత్యభామ సీరియల్ హీరో క్రిష్ అలియాస్ నిరంజన్ ఒకరు.. ఈయన గతంలో ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ లో కూడా నటించి ప్రేక్షకులను తన నటనతో మెప్పించాడు.. పేరుకే వేరే ఇండస్ట్రీ అయినా కూడా అచ్చం తెలుగు వాడిలాగే నటించి జనాలను ఆకట్టుకున్నాడు.. ఇకపోతే ఈ సీరియల్ హీరో ఈమధ్య ఇటువంటి సీరియల్ లోనూ కనిపించలేదు. సీరియల్స్ కి గుడ్ బై చెప్పేసి సినిమాలు చేస్తున్నాడు అంటూ ఓ వార్త వినిపిస్తుంది. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఇదైతే హార్ట్ టాపిక్ గా మారింది.. మరి నిజంగానే సీరియల్స్ కి గుడ్ బాయ్ చెప్పాడా లేదా అన్నది ఇప్పుడు కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..
ఒక్క సీరియల్ హిట్ అయితే ఆ హీరో లేదా హీరోయిన్ కు అతిపెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుంది. వేరే ఇండస్ట్రీ కి చెందిన హీరో హీరోయిన్లకు తెలుగులో ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల కాలంలో వచ్చే ప్రతి సీరియల్ లో హీరోయిన్ లేదా హీరోలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నారు. అలా కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చి తెలుగు ప్రేక్షకులను మెప్పించిన హీరో నిరంజన్. ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. మొదటి సీరియల్ తోనే ప్రేక్షకులను ఆకట్టుకొని మంచి సక్సెస్ను సొంతం చేసుకున్నాడు.. ఆ తర్వాత సత్యభామ సీరియల్ లో కూడా అదే జోడి రిపీట్ అయిన విషయం తెలిసిందే. ఈ సీరియల్ వచ్చి కూడా దాదాపు రెండేళ్లు పూర్తయిపోయింది. కానీ ఇప్పటికే అయినా కొత్త సీరియల్ లో కనిపించకపోవడంతో తెలుగు సీరియల్స్ కి గుడ్ బై చెప్పేసాడు అన్న వార్తలు ప్రచారంలో ఉన్నాయి.. నిజానికి ఈ హీరో ఇటీవల ఎక్కడ కనిపించకపోవడంతో ఇదే నిజమని జనాలు అభిప్రాయపడుతున్నారు..
సీరియల్ హీరో నిరంజన్, గుండె నిండా గుడిగంటలు సీరియల్ హీరోయిన్ మీనా అలియాస్ అమూల్య గౌడతో ప్రేమలో ఉన్నాడన్న విషయం అందరికీ తెలిసిందే. ఇటీవల కాలంలో వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తున్నారు. రీసెంట్ గా స్టార్ మా లో ప్రసారమైన ఒక ప్రోగ్రాం లో వీళ్ళిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు అని మరో వార్త ప్రచారంలో ఉంది. అంతేకాదు ఇద్దరూ కలిసి చేసిన డాన్స్ పెర్ఫార్మెన్స్ కూడా హైలెట్ గా నిలిచింది. మొత్తానికి ఇద్దరు ఎన్నో ఏళ్లుగా ప్రేమలో ఉండి ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.. మరి నిజంగానే ఈ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారా లేదా అన్నది త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక మీనా తెలుగులో సీరియల్స్ చేస్తూ బిజీ ఉంది.. మరోవైపు కన్నడలో కూడా పలు సీరియల్స్ లో నటిస్తూ వస్తుంది… నిరంజన్ కూడా కన్నడలో సీరియల్స్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు..