E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode May 21st ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అంజును రణవీర్ కు అప్పగిస్తానన్న మనోహరి    

Nindu Noorella Saavasam Serial Today Episode May 21st ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అంజును రణవీర్ కు అప్పగిస్తానన్న మనోహరి    
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: పిల్లలందరూ కలిసి మనోహరితో గుర్రం ఆట ఆడుతుంటారు. మనోహరి నడుం విరిగిపోతుంది అంటూ బాధపడుతుంది. అమర్‌ కూడా పిల్లలు మీ ఆట చాలా బాగుంది అంటాడు. దూరం నుంచి రాథోడ్‌, మిస్సమ్మ చూసి నవ్వుతుంటారు. వాళ్లను చూసిన మనోహరి కోపంగా నన్ను చూసి నవ్వుకుంటున్నారా..? మీ సంగతి చెప్తాను.. అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

రణవీర్‌ను జైలు నుంచి విడుదల చేస్తారు. బయటకు వచ్చిన రణవీర్‌ లాయరు దగ్గరకు వెళ్లి ఏంటి లాయరు నన్ను విడిపించడానికి ఇన్ని రోజులు పట్టిందా..? అని అడగ్గానే.. మీ మీద కేసు పెట్టింది మామూలు వ్యక్తి కాదు కదా..? ది గ్రేట్‌ ఆర్మీ ఆఫీసర్‌ అమరేంద్ర. అని చెప్పగానే.. రణవీర్ నవ్వుతూ వాడికి మతి పోయిందని విన్నాను అని అడగ్గానే.. లాయరు అవును రణవీర్‌ గతం మర్చిపోయాడు. అందుకే మీ మీద ఆయన పెట్టిన కేసు వీగిపోయి మీకు ఈజీగా బెయిల్‌ వచ్చింది అని చెప్పగానే.. రణవీర్‌ థాంక్స్‌ లాయరు అని చెప్పగానే లాయరు థాంక్స్‌ నాకు కాదు మనోహరి గారికి చెప్పండి. ఆవిడే మిమ్మల్ని బయటకు తీసుకొచ్చారు అని చెప్పగానే.. రణవీర్‌ ఆశ్చర్యంగా మనోహరా..? అని అడగ్గానే.. అవును రణవీర్‌ అదిగో మేడం గారు అక్కడ ఉన్నారు అని చెప్పగానే.. రణవీర్‌ మనోహరి దగ్గరకు వెళ్లి నువ్వు నాకు బెయిల్ ఇప్పించావా..? ఇది నమ్మేలా లేదే..? అనగానే..

Advertisement

మనోహరి ఏం నేను నీకు హెల్ప్‌ చేయనని అనుకున్నావా..? అంటుంది. దీంతో రణవీర్‌ నా చావు నన్ను చావమన్నావు కదా..? అనగానే.. మనోహరి కోపంగా  అందుకేనా అమర్‌కు నా గురించి ఇన్‌డైరెక్టుగా చెప్పావు అనగానే.. రణవీర్‌ కానీ నువ్వు దొరికిపోలేదు కదా.. బోనస్‌గా అమరేంద్ర తన గతం కూడా మర్చిపోయాడు కదా..?  అనగానే.. మనోహరి అదృష్టవంతులకు అలాగే కలిపి వస్తుంది రణవీర్‌ అని చెప్పగానే.. నీది అదృష్టం కాదు.. స్వార్థం లేనిదే ఏ పని చేయవు.. ఇప్పడు కూడ ఏదో ఆశించి నన్ను విడిపించి ఉంటావు.. అనగానే.. మనోహరి ఇప్పుడు మన టాపిక్‌ స్వార్థం కాదు.. నువ్వు ఆస్థి కోసమే కదా ఇక్కడికి వచ్చావు. నీ బిడ్డను నీకు అప్పగిస్తాను.. కోల్‌కతా వెళ్లి నీ ఆస్థిని హండోవర్‌ చేసుకో.. అనగానే.. రణవీర్‌ నా కూతురు ఎక్కడ ఉందో తెలియదు అన్నావు.. తెలిసి అమరేంద్ర గతం మర్చిపోయాడు. ఇంకెలా నా కూతురును అప్పగిస్తావు అని అడగ్గానే.. మనోహరి అంజును అప్పగిస్తాను అని చెప్పగానే.. అంజు మన కూతురని కన్ఫం కాలేదు కదా.. అని రణవీర్‌ అడగ్గానే.. కాకపోతే ఏంటి నీకు ఆస్థి రావాలంటే కూతురు ఉండాలి. అంజును తీసుకెళ్లు తనే నీ కూతురు అని చెప్పు.. అని మనోహరి చెప్పాగానే..

రణవీర్‌ అనుమానంగా అందుకు అమరేంద్ర ఒప్పుకోవాలి కదా..? అని అడగ్గానే.. మనోహరి ఇప్పుడు అమరేంద్రకు తను ఎవరో కూడా తనకు గుర్తు లేదు. నువ్వు వచ్చి అంజు నీ కూతురు అని చెబితే అమర్‌ నీతో ఆంజును పంపిస్తాడు అని చెప్పగానే.. రణవీర్‌ మళ్లీ గతం మర్చిపోయింది అమరేంద్ర మాత్రమే ఆ భాగీ కాదు తను అడ్డు పడుతుంది కదా.. అనగానే.. మనోహరి అడ్డు పడదు. ఆ హక్కు అవకాశం నేను భాగీకి లేకుండా చేశాను అని చెప్పగానే.. రణవీర్‌ ఏం చేశావు అని అడుగుతాడు. దీంతో మనోహరి గతం మర్చిపోయిన అమరేంద్రతో నేను తన లవర్‌ అని మేము త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామని.. భాగీ కేర్ టేకర్‌ అని ఆ పిల్లలు అనాథాశ్రమం నుంచి తెచ్చుకున్నామని చెప్పాను. ఇప్పుడు నేను ఏం చెబితే అమర్‌కు అదే వేదవాక్కు అని చెప్పగానే..

Advertisement

లాయరు చాలా బాగా మేనేజ్‌ చేశారు మేడం. మీరు లాయరు కాకపోవడం నా అదృష్టం అంటాడు. రణవీర్‌ కూడా నాకు బెయిల్‌ ఇప్పించావు. అంజును నాతో పంపిస్తాను అంటున్నావు. ఇందులో నీకు వచ్చే బెనిఫిట్‌ ఏంటి..? నాకొచ్చే ఆస్తిలో సింగిల్‌ రూపాయి కూడా నీకు ఇవ్వను అని చెప్పగానే.. నేను ఇదంతా నీ ఆస్తి కోసం చేయడం లేదు.. అమర్‌ కోసం చేశాను. అమర్‌ ఎంత గతం మర్చిపోయినా నాకు అమర్‌కు మధ్య నువ్వు పిల్లలు, భాగీ ఉన్నారు. అందుకే ఇదంతా చేస్తున్నాను అంటూ మనోహరి చెప్తుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Illu Illalu Pillalu Today Episodes: వల్లికి విశ్వం వార్నింగ్.. వేధవతికి సీరియస్.. భాగ్యం ప్లాన్ సక్సెస్..

Podarillu Today Episode : జమున దొరుకుతుందా..? శైలు మాటతో షాక్.. నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్..

Karthika Deepam 2 Serial Today Episode October 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఎదురుగానే జ్యోత్స్న చేయి పట్టుకున్న సూరజ్            

Gundeninda GudiGantalu Today episode: బాలును ఇరికించే ప్లాన్.. దొంగగా రోహిణి.. ఇది కదా అసలు ట్విస్ట్..

Brahmamudi Serial Today Episode October 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  అపర్ణ రాసిన లెటర్ శేషు జీవితాన్ని మలుపు తిప్పుతుందా..? 

Saturday TV Movies : శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..

Nindu Noorella Saavasam Serial Today Episode October 17th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థు హత్య కేసు నుంచి మనోహరి ఎస్కేప్ అవుతుందా..? 

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నల్గొండ గద్దర్ నరసన్న.. రమణిలో బతుకమ్మ పాటతో రచ్చ!

Big Stories

Advertisement
×