Nindu Noorella Saavasam Serial Today Episode :యముడు పాము రూపంలో ఆరును పట్టుకోవడానికి ఇంట్లోకి వెళ్తాడు. పాము నుంచి తప్పించుకోవడానికి ఆరు పిల్లల రూంలోకి వెళ్లి డోర్ వేస్తుంది. అది చూసిన అంజు షాకింగ్ గా అలాగే చూస్తుండి పోతుంది. ఆరు అంజును పిలుస్తుంది. అంజు పలకదు. దీంతో ఆరు నేను అంజుకు కనిపిస్తున్నానా ఏంటి అనుకుంటుంది. ఆరు భయపడుతుంది. ఇంతలో మిగతా పిల్లలు వచ్చి డోర్ ఎందుకు వేశావని అడుగుతారు. నేను వేయలేదని దానంతట అదే క్లోజ్ అయిపోయిందని అంజు చెప్పగానే పిల్లలందరూ అంజును తిడతారు. నువ్వు డోర్ దగ్గరకు రాగానే దానంతట అదే లాక్ అయిపోయిందా? అని అడుగుతారు. అక్క మళ్లీ ఏదో ఫ్రాంక్ ప్లాన్ చేసినట్టు ఉందని అకాష్ చెప్తాడు.
అంజు ఫ్రాంక్ కాదని నిజం చెప్తున్నానని నేను డోర్ దగ్గరకు వచ్చే సరికి డోర్ క్లోజ్ అయిందని చెప్తుంది. కోపంగా అమ్ము మర్యాదగా డోర్ తీయమని చెప్తుంది. నేను వేస్తేనే కదా అమ్ము తీయడానికి అంటుంది అంజు. దీంతో కామెడీ చేస్తున్నావా..? రూంలో ఉన్నది నలుగురం మేము ముగ్గురం అక్కడి చదువుకుంటున్నాం అని అమ్ము చెప్పగానే దేవుడు బుర్ర ఇచ్చింది వాడటానికి ఇంత చిన్నగా నేను అంత పైన ఉన్న లాక్ ను ఎలా వేస్తాను అంటూ అంజు చెప్పగానే అందరూ ఆలోచనలో పడిపోతారు. అక్కడే ఉండి చూస్తున్న ఆరు.. అంజు భలే పాయింట్ పట్టుకుందే అనుకుంటుంది. ఇంతలో అమ్ము నీ పక్కన ఉన్న చైర్ చూడు అంటుంది. దీంతో నేను ఆ చైర్ ఎక్కి లాక్ వేశాను అంటారా..? అని అడుగుతంది. ఈ కోడి బుర్రలు వేసుకుని ఎలా బతికార్రా అని అడుగుతుంది.
మరోవైపు గుప్త ప్రభూ అంటూ పాము రూపంలో ఉన్న యముడిని వెతుకుతుంటాడు. రాథోడ్ వచ్చి నీ పాము పేరు ప్రభా.. అని అడుగుతాడు. అవునని గుప్త చెప్పగానే రాథోడ్ ప్రభూ అంటూ వెతుకుతాడు. లోపల అంజు అందరినీ తిడుతుంటే ఇంతలో కిటికీ ఓపెన్ ఉందని ఆరు వెళ్లి కిటికీ వేస్తుంది. మళ్లీ చూసిన అంజు షాకింగ్ గా ఉండిపోతుంది. పామును వెతుక్కుంటూ మిస్సమ్మ మనోహరి రూంలోకి వెళ్తుంది. మనోహరి కర్రను చూస్తుంటే ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. పామును కొట్టడానికి ఈ కర్ర గట్టిగా ఉంటుందో లేదోనని చూస్తున్నాను అంటుంది మనోహరి.
మిస్సమ్మ పాము దేవుడితో సమానం అలాంటి పామును పూజ చేయాలి కానీ కొట్టాలని చూడకూడదు అని మిస్సమ్మ చెప్పగానే ఏయ్ తింగరి ముఖం నువ్వు ఎంత ప్రేమగా పెంచినా పాము గుణం కాటేయడమే.. దానికి నువ్వు నేను అనే వ్యత్యాసం ఉండదు. అది బతకడానికి ఎంత మందినైనా కాటేస్తుంది అని మనోహరి చెప్పగానే.. అబ్బబ్బా నువ్వు చెప్తుంటే నీ గురించి చెప్తున్నావో.. పాము గురించి చెప్తున్నావో అర్తం కావడం లేదు. అయినా చేసినా పాపాలు చాలు. ఇంకా తప్పు మీద తప్పు చేయకు అని చెప్పి పిల్లలు సేఫ్‌గా ఉన్నారో లేరో అని పైకి వెళ్తుంది మిస్సమ్మ.
పిల్లల రూం దగ్గరకు వెళ్లి డోర్ కొడుతుంది మిస్సమ్మ. ఆమ్ము వెళ్లి డోర్ తీస్తుంటే.. మిస్సమ్మ డోర్ ఓపెన్ చేయోద్దని క్లోజ్ చేసుకోమనే చెప్పడానికి వచ్చానని అంటుంది మిస్సమ్మ. దీంతో అంజు నేను డోర్ క్లోజ్ చేయలేదని ఎన్ని సార్లు చెప్పాలి అంటూ అమ్మును తిడుతుంది. ఇంతలో బయటి నుంచి మిస్సమ్మ ఎవరొచ్చి చెప్పినా డోర్ తీయకండి అని జాగ్రత్తలు చెప్పి అమర్ కు విషయం చెప్పాలని వెళ్తుంది. రూంలో ఆఫీసుకు వెళ్లడానికి అమర్ రెడీ అవుతుంటే మిస్సమ్మ కంగారుగా పరుగెత్తుకెళ్లి రూమ్ అంతా వెతుకుతుంది. అమర్ ఏమైందని ఎందుకు అంత కంగారుగా ఉన్నావని అడుగుతాడు. మిస్సమ్మ భయతో పాము అండి అని చెప్తుంది. అమర్ కంగారుగా ఎక్కడుంది. పిల్లలు అందరూ సేఫ్‌గా ఉన్నారా..? అని అడుగుతాడు. ఎవరికీ ఏమీ కాలేదని ఎవరి రూముల్లో వాళ్లు ఉన్నారని నేను ఉండగా ఎవరికీ ఏమీ కానివ్వనని మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మిస్సమ్మ వెళ్లిపోతుంది.
మనోహరి కర్ర తీసుకుని రూంలోంచి పామును వెతుక్కుంటూ బయటకు వస్తుంది. గుప్త వచ్చి ఏం చేస్తున్నారమ్మా అని అడుగ్గానే పామును కొట్టడానికి అని మనోహరి చెప్పగానే పామును వెతకడానికి నేను ఉన్నాను కదా..? నువ్వెందుకు ఇబ్బంది పడతావు అంటాడు. పక్కకు జరుగు అని వెళ్లి హాల్లో పాము కనిపించగానే కర్రతో కొడుతుంది మనోహరి. మధ్యలో అడ్డు వచ్చిన గుప్తను కొడుతుంది.
మనోహరి దెబ్బలకు తాళలేక పాము రూపంలో ఉన్న యముడు గార్డెన్ లోకి పారిపోతాడు. ఆరును పైకి ఎలా తీసుకెళ్లాలా అని ఆలోచిస్తూ చివరికి ఆ బాలికను తీసుకుని రావాల్సిన బాధ్యత నీది ప్రస్తుతం నేను యమపురికి వెళ్లి సేద తీరెదను అని వెళ్లిపోతాడు. తర్వాత పిల్లల రూం దగ్గరకు వచ్చి మిస్సమ్మ డోర్ తీయమని చెప్తుంది. అమ్ము వెళ్లి డోర్ తీయడానికి వెళ్తుంటే ఆరు కంగారు పడుతుంది. అమావాస్య గడియలు అయిపోయి ఉంటాయి. మిస్సమ్మ నన్ను ఇక్కడ చూస్తే నా పరిస్థితి ఏంటని భయంతో వెళ్లి సోపాల వెనక దాక్కుంటుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.