Nindu Noorella Saavasam Serial Today Episode : అమర్, మిస్సమ్మ చేస్తున్న దీక్షను చెడగొట్టేందుకు అమర్ ఇంటికి వచ్చిన ఘెర ముత్తైదువులు ఎవ్వరూ కూడా గేటు దాటి లోపలికి వెళ్లి భోజనం చేయకుండా ఆ ఆత్మనే కాపలా పెడతానంటాడు. దీంతో మనోహరి హ్యాపీగా ఫీలవుతుంది.
ఓ ఆత్మ ఇన్ని రోజు ఎన్నో పూజలు చేసి.. పుణ్యం మూట కట్టుకున్నావు. ఇవాళ నీకోసం చేస్తున్న అమ్మవారి దీక్షకు అడ్డుపడి కొంచెం పాపం మూటకట్టుకో.. అంటూ గట్టిగా నవ్వుతుంటాడు. దీంతో సీసాలో ఉన్న ఆరు ఏడుస్తూ దీక్షకు బంగం కలిగించి నువ్వేం సాధించలేవు. అమ్మవారు చూస్తూ ఊరుకోరు అంటూ ఘోరాను తిడుతుంది. ఘోర మాత్రం అవేవీ పట్టించుకోకుండా మంత్రం వేసి ఆత్మను బయటకు తీసి గేటు దగ్గర కాపలా ఉంచుతాడు. తన శక్తులను కొన్నింటిని గేటు చుట్టు రక్షణ కవచంలా పెడతాడు. మనోహరిని లోపలికి వెళ్లమని చెప్తాడు ఘోర ఓకే అంటూ మనోహరి లోపలికి వెళ్లిపోతుంది.
ఇంట్లో అతిథుల కోసం భోజనాలు రెడీ చేస్తుంటారు. మనోహరి వెళ్లి చూసి భోజనానికి ఎవ్వరూ రారని మనసులో అనుకుంటుంది. గేటు దగ్గర ఘోర వేసిన బంధనాన్ని చూసిన గుప్త షాక్ అవుతాడు. ఇంతలో భోజనానికి వచ్చిన ముత్తైదువులు వచ్చిన వారు వచ్చినట్టే గేటు దగ్గర నుంచి వెళ్లిపోతుంటారు. అతిథుల కోసం ఎదురు చూస్తున్న మిస్సమ్మ ఇంటికి వెళ్లి మరీ భోజనానికి రమ్మని పిలిస్తే ఒక్కరూ కూడా రావడం లేదేంటి అని బాధపడుతుంది. ఇంతలో మనోహరి రావడం ఇష్టం లేదేమో.. రారేమో.. అంటుంది.
నిర్మల కోపంగా శుభమాని పూజ చేస్తుంటే ఏంటమ్మా ఆ మాటలు.. అంటూ తిడుతుంది. దీంతో మనోహరి ఆంటీ నేనేం తప్పుగా అనడం లేదు. పూజను లాస్ట్ మినిట్ లో అనుకున్నారు అందరికీ లాస్ట్ మినిట్ లో చెప్పారు. అందుకే రారేమో అన్నాను. అయినా మనసు బాగాలేదని దీక్షలు చేస్తే ఇలాగే ఉంటుంది. నాకు తెలిసి ఈ దీక్ష ఇంతటితో ఆపేస్తే మంచిది. ఏంటి మిస్సమ్మ అలా చూస్తున్నావు. నేను నీ మంచి కోసమే.. అదే ఈ ఇంటి మంచి కోసమే చెప్తున్నాను అంటుంది మనోహరి. దీంతో నిర్మల కూడా మనోహరి చెప్తున్నది కూడా నిజమే కదమ్మా.. భోజనానికి ఎవ్వరూ రాకపోతే ఇంటికి అరిష్టమేమో.. అంటుంది.
ఇంతలో రాథోడ్ ఓదార్పుగా.. మిస్సమ్మ నువ్వేం బాధపడకు. నువ్వు ఎవరెవరిని పిలిచావో వాళ్లను నేను వెళ్లి జాగ్రత్తగా తీసుకొస్తాను అంటూ వెళ్లిపోతాడు. మిస్సమ్మ ధీనంగా అమ్మవారి ముందు కూర్చుని ప్రార్థిస్తుంది. మిస్సమ్మ మనసులో గట్టిగా సంకల్పించుకుంటే ఈ దీక్ష పూర్తి అవ్వడానికి ఆ అమ్మవారి ఆశీస్సులు సంపూర్ణంగా ఉంటాయి అని శివరాం చెప్తాడు.
బయట గేటు దగ్గర ఉన్న గుప్త కోపంగా ఘోరాను తిట్టుకుంటూ.. జగన్నాథ కళ్ల ముందే ఇంత ఘోరమూ ఇంత అన్యాయమూ జరగుతుంటే నేను చూడలేకపోతున్నాను. దయచేసి ఈ ఒక్కసారి ఈ ఘోరాన్ని ఆపే శక్తిని ఇవ్వు జగన్నాథ అని ప్రార్థించగానే.. దేవుడు గుప్తకు శక్తులు ఇస్తాడు. లోపల అందరూ అమ్మవారిని ప్రార్థిస్తుంటారు. తనకు వచ్చిన శక్తులతో ఘోర వేసిన బంధనాన్ని పటాపంచలు చేసి గుప్త లోపలికి వెళ్తాడు. అమ్మవారి ముందు కూర్చుని దీనంగా ప్రార్థిస్తున్న మిస్సమ్మను మనోహరి వెటకారంగా తిడుతుంది.
దండం పెట్టుకున్నా.. దయ చూపించమని అడిగినా ఫలితం లేకుండా పోయింది. ఆంటీ ఇంకా ఎంత సేపని ఇలా ఉంటాము అని మనోహరి అనగానే అందరూ బాధగా బయటకు చూస్తేనే ఉంటారు. అక్కడ గుప్త ఆరుగురు మత్తైదువులను వెంటబెట్టుకుని లోపలికి వస్తాడు. మత్తైదువులను చూసిన మిస్సమ్మ ఎదురెళ్లి వాళ్ల కాళ్లు కడిగి పసుపు పూస్తుంది. ముత్తైదువులు రావడం చూసిన మనోహరి షాక్ అవుతుంది. ఇంతలో ఏదో ఒకటి చేయాని వాళ్లు మాత్రం ఇక్కడ భోజనం చేయకూడదు అనుకుంటూ వెళ్లి కూరల్లో ఉప్పు ను కలుపుతుంది.
అతిథులు లోపలికి రావడంతో అందరూ వారికి వడ్డిస్తుంటారు. మొదటగా తిన్న బామ్మ వెంటనే ఏదో రకంగా మిస్సమ్మను చూస్తుంటే.. ఏంటి బామ్మగారు ముద్ద నోట్లో పెట్టగానే ముఖం అలా పెట్టారు. ఏం బాలేవా..? అని అడుగుతంది మనోహరి. దీంతో ఆ బామ్మ.. అన్ని చక్కగా సరిపోయాయి అమ్మా.. ఇంత చక్కగా కుదిరిన వంటను ఈ మధ్య కాలంలో నేను ఎప్పుడూ తినలేదు. నువ్వు ఏ కోరికతో దీక్ష చేపట్టావే తెలియదు కానీ అది జరగాలని మనఃస్పూర్తిగా కోరుకుంటున్నాను అంటుంది. ఆ బామ్మ మాటలకు మనోహరి కంగుతింటుంది. షాక్ లో అలాగే చూస్తుండిపోతుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.