trinayani serial today Episode: గార్డెన్ లో కూర్చున్న విశాల్ దగ్గరకు వెళ్లిన నయని ఎప్పుడు తెల్లారుతుందా..? మన పెద్ద కూతురుని ఎప్పుడు చూడాలా అని ఎదురుచూస్తున్నారు కదా? అంటుంది. అవునని విశాల్ చెప్తాడు. రేపు నిజంగా అమ్మ పసిపాపలా కనిపిస్తుంది అంటావా? అని విశాల్ అడుగుతాడు. అలాగే రేపు కనక పాప కనిపించకపోతే చాలా కంగారుగా ఉంటుంది అంటాడు విశాల్. దీంతో మీరింకా.. కంగారులో ఉన్నారు. మీరు పైకి ప్రశాంతంగా కనిపిస్తున్నారు కానీ లోపల చాలా బాధపడుతున్నారు బాబుగారు అంటుంది నయని. చాలా సార్లు నిరుత్సాహానికి గురయ్యాము కదా నయని అందుకే అలా అన్నాను అంటాడు విశాల్. ఎవరో చెప్తే అలా అనుకోవాలి కానీ చెప్పింది అమ్మగారు కదా అని నయని అనగానే అయితే అమ్మ ఇచ్చిన ఈ బొమ్మను అమ్మకే ఇవ్వడానికి తీసుకెళ్లాలి అన్నమాట.
విక్రాంత్ బయటకు వెళ్తుంటే సుమన వెనకాలే వచ్చి బుల్లిబావ గారు ఒక మాటుంది అంటూ వస్తుంది. నీ భయానికే ఇక్కడే ఉండలేక బయటకు వెళ్తున్నాను అంటాడు విక్రాంత్. నా మనసులో ఏదైనా డౌటు ఉంటే అడిగేయకపోతే సరిగ్గా అడుగులు కూడా వేయలేను అని సుమన అనగానే తప్పు దారిలో నడిచే అలవాటు ఉంది కాబట్టే నీకు అలా అనిపిస్తుందే..? అంటూ విక్రాంత్ తిట్టగానే ఈ రెండు రోజులు నేను చెప్పినట్టే జరిగిందా? లేదా..? అని సుమన చెప్పగానే ఇప్పుడేమంటావు. నయని వదిన లాగా నీకు అమ్మవారి వరం ఉందని పబ్లిషిటీ చేయమంటావా? అని విక్రాంత్ అడగ్గానే వద్దు లేండి.. నాకు కావాల్సింది పూజలు కాదు డబ్బులు అని సుమన చెప్తుంది. దీంతో విక్రాంత తిట్టి వెళ్లిపోతుంటే.. ఈ ఒక్క దానికి నాకు చెప్పి వెళ్లండి. ఇంతకీ గాయత్రి అత్తయ్య గారు ఆ బొమ్మను ఎందుకు ఇచ్చారు. ఆ బొమ్మ ఎక్కడిది అని అడుగుతుంది. దీంతో నీకు బుర్రనే లేదు. బుద్ది అసలు కూడా లేదని తిడతాడు విక్రాంత్.
వల్లభ కంగారుగా వచ్చి వెళ్లిపోతుంటే.. తిలొత్తమ్మ ఆపి ఎందుకు వచ్చావు. ఎందుకు వెళ్తున్నావు అని అడుగుతుంది. ఈ రోజు రాత్రికి అయినా ప్రశాంతంగా పడుకోమని చెప్పడానికి వచ్చాను. కానీ నువ్వే ఏదో ఆలోచిస్తున్నావు అని వెళ్లిపోతున్నాను అని చెప్పగానే తిలొత్తమ్మ కోపంగా వల్లభను తిట్టి అసలు ఇప్పుడు ఏం చేయాలో అది చూడు అనగానే బెడ్ షీట్ చేంజ్ చేసి వచ్చాను వెళ్లి పడుకోవడమే అంటాడు వల్లభ. మరింత ఇరిటేటింగ్ గా తిలొత్తమ్మ.. వల్లభను తిడుతుంది.
గాయత్రి అక్క పసిపాప రూపంలో గుడి దగ్గరకు వస్తుంది అని తిలొత్తమ్మ చెబుతూ అలాగే తను మన అంతు చూడాలని చెప్పగానే వల్లభ భయంతో నిన్ను చంపేయాలనుకుంటే ఎప్పుడో చంపేసేది కదా కానీ నిన్ను కొడుతూనే ఉంది కదా మమ్మీ అంటాడు వల్లభ. అరేయ్ అంటూ తిడుతూ గండం కన్నా ముందే ఆ పిల్లను నయనిని రేపు మనమే చంపేయాలి అని చెప్తుంది. ఎలా చంపేయాలి అని వల్లభ అడగ్గానే గాయత్రి అక్క ఇచ్చిన బొమ్మలో బాంబు పెట్టిస్తానని చెప్పడంతో వల్లభ భయంతో వణికిపోతాడు. ముందు నేను చెప్పేది విను రేపు గుడి దగ్గర నేను చెప్పగానే నీ జేబులో పెట్టుకున్న రిమోట్ ను నొక్కేయ్ అంతే తల్లీ కూతుళ్లు చనిపోతారు అని చెప్తుంది తిలొత్తమ్మ.
అందరి కన్నా ముందే గుడి దగ్గరకు వెళ్లిన అహల్య నయని వాళ్ల కోసం ఎదురుచూస్తుంది. ఇంతలో హాసిని, నయని వస్తారు. మీరేంటి నయనిని తీసుకు రాకుండా వచ్చారని అడుగుతుంది అహల్య. వాళ్లంతా వెనక వస్తున్నారని విశాల్ చెప్తాడు. మా అమ్మ పునర్జన్మ ఎత్తి పసిపాపలా ఉన్నది ఇక్కడికి వస్తే చూపిస్తానని చెప్పావట కదా? అని విశాల్ అడుగుతాడు. అవునని అహల్య చెప్తుంది. మరోవైపు నయని, సుమన, విక్రాంత్, తిలొత్తమ్మ , వల్లభ కారులో వస్తుంటారు. విశాల్ బావ, హాసిని అక్క ముందే ఎందుకు వెళ్లారని సుమన అడుగుతుంది.
వాళ్లు ముందే వెళ్లి పూజ చేయాలని వెళ్లారని నయని చెప్తుంది. మరోవైపు గాయత్రి అక్క పునర్జన్మ రహస్యాలు అన్ని ఇవాళ పటాపంచలు అవుతాయని అహల్య చెప్తుంది. అందుకు అమ్మవారే సాక్ష్యం అని చెప్తుంది. ఇంతలో విశాల్ అమ్మ ఇక్కడికి వస్తుందా? అని అడుగుతాడు. రాదని అహల్య చెప్పడంతో ఈవిడకు కూడా గాయత్రి పాపే గాయత్రి అత్తయ్య అన్న విషయం తెలియదన్న మాట అని హాసిని మనసులో అనుకుంటుంది. వదిన పిన్నికి కూడా మనలాగే తెలియదంట అంటాడు. హాసిని నవ్వుతుంది.
ఇంతలో నయని వాళ్లు అక్కడకు వస్తారు. ఏర్పాట్లు చేస్తామని ముందే వచ్చి ఇక్కడ నిలబడ్డారేంటక్కా అని నయని అడుగుతుంది. ఏర్పాట్లన్నీ అత్తయ్యా చేశారు చెల్లి అని హాసిని చెప్తుంది. అందరూ అమ్మవారి దగ్గరకు వెళ్తారు. అందరూ నయని తొలి బిడ్డను చూడాలని ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. పిన్ని పాప గురించి ఇంట్లో వాళ్లు చెప్తారా? బయటి వాళ్లు చెప్తారా? అని విశాల్ అడగ్గానే గాయత్రి అక్క పునర్జన్మ గురించి ఇంట్లో వాళ్లకు తెలుసుని ఓ పుణ్యాత్ముడు చెప్పాడు అని అహల్య చెప్పడంతో విశాల్, హాసిని షాక్ అవుతారు. ఇంతటితో ఇవాళ్టీ త్రినయని సీరియల్ ఏపిసోడ్ అయిపోతుంది.