BigTV English

Nindu Noorella Saavasam October 30th Episode: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: నిర్మలను కాపాడిన మిస్సమ్మ   

Nindu Noorella Saavasam October 30th Episode: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: నిర్మలను కాపాడిన మిస్సమ్మ   

Nindu Noorella Saavasam Serial Today Episode :   పూజ పూర్తి చేసిన తర్వాత అందరికీ కంకణాలు కడుతూ బిక్ష తీసుకున్న తర్వాత దీక్ష విరమిద్దామని చెప్తుంది మిస్సమ్మ. సరేనని అందరూ కంకణాలు కట్టుకుంటారు. ఇక భోజనాలు చేస్తుంటే.. రామ్మూర్తి మెహమాట పడుతూ రేపు తాను మిస్సమ్మ కావడి కడతామని.. మీరంతా గుడికి వచ్చేయమని చెప్తాడు. అమర్‌ కూడా తామంతా కావడి మోస్తామని అడగుతాడు. అది చాలా కష్టమని మీరు ఇప్పటి వరకు చాలా కష్టపడ్డారని రామ్మూర్తి అనగానే అదేం లేదని తాము కూడా కావడి మోస్తామని పిల్లలు అంటారు. దీంతో మిస్సమ్మ సరే అందరం కలిసి కావడి మోస్తూ గుడికి వెళ్దామని చెప్తుంది.


ఘోర దగ్గరకు వచ్చిన మనోహరి.. అందరూ రేపు కావడి మోస్తూ గుడికి వెళ్తారట అని చెప్తుంది. అయితే అదే  జరిగింది అంటే ఆ ఆత్మ  బంధన చేయలేం మనోహరి. కావడి కట్టి గుడికి వెళ్లారో దీక్ష పూర్తి అవుతుంది. అప్పుడు ఇక ఏం చేసినా ఆత్మను బంధించలేం అంటాడు ఘోర. దీంతో మనోహరి ఇరిటేటింగ్‌ ఇదంతా ఆ తండ్రీ కూతుళ్ల వల్ల జరిగింది. వాళ్లే దీక్ష అనకుండా ఉండి ఉంటే ఈ పాటికి అది ఇంట్లోంచి అమర లైఫ్‌ లోంచి వెళ్లిపోయి ఉండేది. వాళ్లు అనుకున్నది జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి ఘోర అని అడుగుతుంది.

దీంతో ఘోర  కావడి ఎత్తకుండా ఆపాలి. వాళ్ల దీక్షకు భంగం కలిగించాలి అని చెప్తాడు. కానీ ఎలా ఏదో శక్తి వాళ్లను కాపాడుతుందే.. అని మనోహరి బాధపడుతుంది. దీంతో ఘోర ఆ ఇంట్లో ఎవరైనా చనిపోతే దీక్ష భంగం కలుగుతుంది. అని ఘోర చెప్పగానే సీసాలో ఉన్న ఆరు కోపంగా ఘోరాను తిడుతుంది. దీంతో ఆత్మ నువ్వేం చేయలేవు.. నేను చెప్పింది మాత్రమే నువ్వు చేయాలి అంటూ ఆ ఇంట్లో ముసలావిడను చంపేయాలి. అది ఈ ఆత్మను ప్రయోగించే చేస్తాను అని ఘోర చెప్పగానే మనోహరి హ్యాపీగా ఫీలవుతుంది. ఆ ముసల్దాన్ని చంపేస్తే ఆ ముసలోడు చనిపోతాడు. ఇక నాకు తిరుగుండదు అనుకుంటుంది. ఘోర వెంటనే కింద కూర్చోని సీసాను ఎదురుగా పెట్టుకుని మంత్రాలు చదువుతుంటాడు.


ఆరు మాత్రం బాధగా.. నీకు దండం పెడతా ఘోర ప్లీజ్‌.. అతయ్య నన్ను అమ్మలా చూసుకుంది. ఆవిడను ఏం చేయవద్దు. మామయ్య.. అత్తయ్య లేకుండా  ఒక్క క్షణం కూడా ఉండలేడు అంటూ బాధపడుతుంది.  ఏయ్‌… ఈ ఘోర ఏం చేయగలడో ఏం చేస్తాడో అందరికీ చూపించాల్సిన సమయం వచ్చింది. ఈ ఘోర వచ్చాడన్న సంకేతం ఇవ్వాల్సిన సమయం వచ్చేసింది అంటూ.. సీసా మూత తెరవగానే ఆరు బయటకు వచ్చి  ఇంట్లోకి వెళ్లి నిర్మల శరీరాన్ని ఆవహిస్తుంది. బయట ఉన్న ఘోర ఏం చెప్పినా లోపల నిర్మలతో ఆరు అది చేయిస్తుంది. ఘోర.. నిర్మలను మేడ మీదకు వెళ్లు అని చెప్పగానే నిర్మల మేడ మీదకు వెళ్తుంది. మధ్యలో నిర్మలను చూసిన మనోహరి.. ఘోర మంత్రం పని చేస్తుంది అనుకుంటూ హ్యాపీగా ఫీలవుతుంది.  పాపం తెల్లారేసరికి ఈ ముసల్దాని బతుకు తెల్లారిపోతుంది అనుకుంటూ వెళ్లిపోతుంది.

గార్డెన్‌ లో  ఉన్న గుప్త ఉలిక్కిపడి లేచి నాకెందుకో బాలిక ఆచూకి తెలుస్తుంది అనుకుంటూ దూరదృష్టితో చూస్తాడు. వెంటనే ఆ ఘోర దుష్ట ఆలోచనలతో బాలిక ఆత్మను వశపరుచుకుని ఈ శరీరాన్ని ఆవహించేలా చేశాడు. ఇప్పుడు ఈ శరీరానికి ఏ హాని తలపెట్టదలిచాడో.. అనుకుంటాడు. మేడ మీదకు వెళ్లిన నిర్మలను అక్కడి నుంచి దూకేయ్‌ అని ఘోర చెప్తాడు. గుప్త ఏదో మంత్రించి ఆపడానికి ప్రయత్నం చేసినా ఫలితం ఉండదు. దీంతో గుప్త  జగన్నాథ ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో నన్ను నిస్సహాయుడిగా ఈ భూలోకమున ఎందుకు ఉంచినావు. ఈ పరిస్థితిని నువ్వే చక్కదిద్ద వలెను.. అని ప్రార్థిస్తాడు. ఘోరాను కూడా నువ్వు చేసేది ధర్మ విరుద్దం అందుకు శిక్ష అనుభవించి తీరుతావు అంటూ హెచ్చరిస్తాడు.

అయినా ఘోర వినకుండా నవ్వుతూ నిర్మలను దూకేయ్‌ అని గట్టిగా అరవగానే నిర్మల దూకబోతుంటే.. వెనక నుంచి మిస్సమ్మ వచ్చి చేయి పట్టుకుని ఆపుతుంది. ఇంతలో ఆరు ఆత్మ వెనక్కి వెళ్లి సీసాలో పడుతుంది. దీంతో ఘోర షాక్‌ అవుతాడు. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతాడు. నిర్మలను మిస్సమ్మ గట్టిగా పిలవగానే ఉలిక్కిపడి స్పృహలోకి వస్తుంది నిర్మల. నేను ఇక్కడ ఉన్నానేంటి అని భయంతో ఏడుస్తుంది. నిర్మలను ఓదార్చి కిందకు తీసుకెళ్తుంది మిస్సమ్మ. తర్వాత రోజు ఇంట్లో అందరూ కావడి ఎత్తుకుని గుడికి వెళ్తుంటారు. గార్డెన్‌ లో ఉన్న గుప్త చూసి సంతోషపడతాడు.  ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Related News

Illu Illalu Pillalu Today Episode: రామరాజు, వేదవతిని కలిపిన నర్మద.. రచ్చ చేసిన భద్ర.. పోలీసుల ఎంట్రీ.. శ్రీవల్లికి షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. భరత్ కోసం అవని కన్నీళ్లు.. పార్వతికి దిమ్మతిరిగే షాక్..

Nindu Noorella Saavasam Serial Today August 9th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్రను తిట్టిన యాడ్‌ ఫిల్మ్‌ డైరెక్టర్‌

Gundeninda GudiGantalu Today episode: నిజం ఒప్పుకున్న కల్పన..రోహిణి సేఫ్.. 40 లక్షలను కల్పన ఇస్తుందా..?

Brahmamudi Serial Today August 9th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  యామినికి కావ్య వార్నింగ్ – రాజ్ కు నిజం చెప్తానన్న కావ్య

Dhee Raju : ఢీ రాజుకు ఇంత మందితో బ్రేకప్ అయ్యిందా..? మంచి రసికుడే..

Big Stories

×