BigTV English

Nindu Noorella Saavasam Serial Today October 4th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరికి నిజం చెప్పిన ఘోర – రణవీర్‌ ను కన్పీజ్‌ చేసిన మనోహరి

Nindu Noorella Saavasam Serial Today October 4th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరికి నిజం చెప్పిన ఘోర – రణవీర్‌ ను కన్పీజ్‌ చేసిన మనోహరి

Nindu Noorella Saavasam Serial Today Episode: గుప్త రాగానే అంజలి గురించి నిజం తెలిసిందని.. అంజు మనోహరి, రణవీర్‌ల కూతురు అంటే అస్సలు నమ్మలేకపోతున్నాను గుప్త గారు అంటుంది ఆరు. ఆ దుర్మార్గుల కూతురు అన్న విషయం ఇక ఎప్పటికీ ఎవ్వరికీ తెలియకూడదు. తన గతం గురించి తెలుసుకోవాలనుకున్న మా ఆయన ప్రయత్నం ఇక ఆపాలి. దాని కోసం నేను ఏదైనా చేయాలి గుప్త గారు అంటూ ఆరు వెళ్లిపోతుంది. గుప్త మాత్రం ఆగు  బాలిక  అంటూ నువ్వు మరోసారి విధికి ఎదరువెళ్తున్నావు అది మంచిది కాదు అని హెచ్చిరిస్తాడు. అయినా వినకుండా ఆరు వెళ్లిపోతుంది.


రూంలోచి బయటకు  వచ్చి చూస్తుంది మనోహరి. ఎవ్వరూ కనిపించకపోవడంతో ఘోరకు ఫోన్‌ చేయాలనుకుని డోర్‌ మూస్తుంటే.. అంజలి వస్తుంది. ఆంటీ మీ వల్లే నేను ఇవాళ స్కూల్ కు వెళ్లలేదు తెలుసా? అంటుంది. నేను ఎంతో ధైర్యంగా అందరూ వద్దంటున్నా మీరు వచ్చి  నాకు ముద్దు పెట్టగానే మీ చేతికి నేను తాయోత్తు  కట్టాను ఆంటీ అంటుంది. అసలు ఈ ఇంట్లో నా అంత టాలెంట్‌ ఎవ్వరికీ లేదు మీకు తెలుసా అంటూ అంజు మాట్లాడుతుంటే మనోహరి ఇరిటేటింగ్ గా ఫీలవుంతుంది. అంజుకు ఏదో ఒకటి పంపంచాలనుకుంటుంది. ఏం చెప్పినా అంజు  వినదు. దీంతో మనోహరి అంజు నాకు తల తిరిగినట్లు  అవుతుంది. నేను కాసేపు పడుకుంటాను మనం తర్వాత మాట్లాడుకుందాం అంటుంది. దీంతో అంజు సరే ఆంటీ అంటూ వెళ్లిపోతుంది.

అంజు వెళ్లిపోయాక మనోహరి డోర్‌ వేసుకుని ఉత్సాహంగా ఘోరకు ఫోన్‌ చేస్తుంది. ఘోర డల్లుగా మాట్లాడతాడు. దీంతో ఏంటి ఘోర  నీ జీవితాశయం నెరవేరాక కూడా ఇంకా నీరసంగా మాట్లాడుతున్నావేంటి…? గట్టిగా మాట్లాడు. నీ మాటల్లో మన గెలుపు వినాలని ఉంది.  నేను కలలు కన్న జీవితం నాకు రాబోతుందని చెప్పు. హలో ఘోర ఏమైంది. ఏమీ మాట్లాడటం లేదు అని అడుగుతుంది మనోహరి.


ఘోర మాట్లాడకపోయే సరికి అనుమానం వచ్చిన మనోహరి ఘోర నువ్వు ఆరును బంధించలేదని మాత్రం చెప్పకు.. దాన్ని బంధించడానికి నన్ను నేను ఎరగా వేసుకున్నాను అంటుంది. దీంతో ఘోర  ఆ ఆత్మను బంధించే లోపు ఆ అమరేద్ర వచ్చాడు మనోహరి. నన్ను  కూడా పట్టుకోవాలని చూశాడు. కానీ నేను ఎలాగోలా తప్పించుకుని వచ్చాను అని చెప్పడంతో మనోహరికి పిచ్చి కోపం వస్తుంది. ఒక్క పని కూడా నువ్వు సరిగ్గా చేయలేకపోయావా? మంత్రాలు తంత్రాలు క్షుద్రపూజలు వచ్చని చెప్తావు కదా..? శక్తి వంతుడివి అని చెప్తుంటావు కదా? ఆప్రాల్‌ ఒక ఆత్మని గాలిని బంధించలేకపోయావా..? నిన్ను నమ్ముకున్నాను చూడు నాకు బుద్ది లేదు. అంటూ కోపంగా ఫోన్‌ కట్‌ చేస్తుంది.

ఇంతలో రణవీర్‌ ఫోన్‌ చేస్తాడు మనోహరికి కోపంగా మాట్లాడుతుంది మనోహరి. ఇందాకా  నా ఇంటికి వచ్చావు కదా ఎందుకు వచ్చావో కనుక్కుందామని పోన్‌ చేశాను అంటాడు రణవీర్‌. రణవీర్ మాటలకు మనోహరి షాక్‌ అవుతుంది.  సరే మళ్లీ వస్తున్నాను ఇప్పుడు ఎక్కడున్నావు నీవు  అని అడుగుతుంది మనోహరి. ఇప్పుడైనా.. ఎప్పుడైనా నేను  ఎక్కడ ఉంటానో నీకు తెలియదా? మనోహరి అంటాడు రణవీర్‌.

పిల్లల రూంలోకి వెళ్లిన ఆరుకు  అంజు కనిపించడం లేదేంటి అనుకుంటుంది. అందరూ చదువుకుంటుంటే అంజు ఎక్కడికి వెళ్లింది అనుకుంటుండగానే అంజు పాట పాడుతూ హుషారుగా లోపలికి  వస్తుంది. చదువుకుంటుంన్న మిగతా పిల్లలలను డస్టర్బ్‌ చేస్తుంది. ఎవ్వరూ అంజును పట్టించుకోకుండా చదువుకుంటుంటారు. ఇంతలో అంజు  మూలకు వెళ్లి కూర్చుంటుంది.

మనోహరి, రణవీర్‌ ఇంటికి  వెళ్తుంది. మనోహరిని చూసిన రణవీర్‌  నీకోసమే ఎదురుచూస్తున్నాను మనోహరి అంటాడు. మనోహరి మాత్రం డైరెక్టుగా  నిన్న అది వచ్చి ఏం మాట్లాడింది అని అడుగుతుంది. దీంతో రణవీర్‌ అర్థం కాక ఎవరొచ్చారు..? అని అడుగుతాడు. ఆదే ఆ ఆ.. నేనే.. నేను వచ్చి ఏం మాట్లాడాను. అని అడుగుతుంది. నీకు గుర్తు లేదా? లేక మెమెరీ లాస్‌ ఏమైనా అయిందా?  అంటూ రణవీర్‌ కోప్పడతాడు.

అది కాదు రణవీర్‌ అది వచ్చి నీతో ఏం మాట్లాడిందో చెప్పు రణవీర్‌ అంటుంది మళ్లీ. దీంతో కోపం నషాళానికి ఎక్కిన రణవీర్‌  నీకేమైనా పిచ్చి పట్టిందా? మనోహరి. నిన్న వచ్చి ఇలాగే ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడి వెళ్లిపోయావు. ఇప్పుడొచ్చి ఎవరో వచ్చారంటున్నావు. నువ్వేం మాట్లాడావని అడుగుతున్నావు. అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా? అంటూ గట్టిగా అరవగానే అంతకన్నా గట్టిగా మనోహరి కూడా అర్థం అవుతుంది. చెప్పు నిన్న నేను వచ్చినప్పటి నుంచి ఏం జరిగింది. అని మనోహరి కోపంగా అడుగుతుంది. దీంతో జరిగింది అంతా చెప్తాడు రణవీర్‌. రణవీర్‌ చెప్పగానే మనోహరి భయంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

పిలల రూంలో ఉన్న ఆరు రూంలోకి మిస్సమ్మ  రావడం చూసి తలుపు చాటున దాక్కుంటుంది. మిస్సమ్మ చూడకుండా వెళ్లిపోతుంది. అయితే మిస్సమ్మ చూస్తుంది. అక్క ఇప్పుడు  ఇక్కడకు ఎందుకు వచ్చింది. అసలు అక్కేనా అంటూ వెనకాలే వెళ్తుంది. గార్డెన్‌ లోకి పరుగెత్తుకెళ్లిన ఆరు కంగారుగా గుప్తను ఏదైనా మార్గం చెప్పమని అడుగుతుంది. మిస్సమ్మ పరుగెత్తుకుని గార్డెన్‌ లోకి వచ్చి ఆరును గుర్రుగా చూస్తుంటుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Related News

Anasuya: రాఖీ స్పెషల్.. అనసూయలో ఎంత మార్పు… ఇలానే ఉండొచ్చు కదా

Illu Illalu Pillalu Today Episode: రామరాజు, వేదవతిని కలిపిన నర్మద.. రచ్చ చేసిన భద్ర.. పోలీసుల ఎంట్రీ.. శ్రీవల్లికి షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. భరత్ కోసం అవని కన్నీళ్లు.. పార్వతికి దిమ్మతిరిగే షాక్..

Nindu Noorella Saavasam Serial Today August 9th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్రను తిట్టిన యాడ్‌ ఫిల్మ్‌ డైరెక్టర్‌

Gundeninda GudiGantalu Today episode: నిజం ఒప్పుకున్న కల్పన..రోహిణి సేఫ్.. 40 లక్షలను కల్పన ఇస్తుందా..?

Brahmamudi Serial Today August 9th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  యామినికి కావ్య వార్నింగ్ – రాజ్ కు నిజం చెప్తానన్న కావ్య

Big Stories

×