BigTV English

Whats app Videocall update : వాట్సాప్ లో ఇకపై మరింత గోప్యత.. ఆ అప్డేట్ తెచ్చేసిన మెటా

Whats app Videocall update : వాట్సాప్ లో ఇకపై మరింత గోప్యత.. ఆ అప్డేట్ తెచ్చేసిన మెటా

Whats app Videocall update : ప్రముఖ సోషల్ మెసేజింగ్ ఆప్ వాట్సాప్ తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫీచర్స్ తీసుకొస్తుంది. అప్డేటెడ్ వెర్షన్లో వాట్సాప్ నుంచే ప్రయత్నంతో పాటు యూజర్ల భద్రత కోసం తగిన చర్యలు తీసుకుంటుంది వాట్సప్ మాతృ సంస్థ మెటా. ఈ నేపథ్యంలో తాజాగా అదిరిపోయే అప్డేట్ను వినియోగదారులకు అందిస్తుంది. వాట్సాప్ వీడియో కాల్ అనుభూతిని మరింత మెరుగుపరిచేందుకు ఫిల్టర్స్ బ్యాక్ గ్రౌండ్ లో మార్పులు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. దీంతో ఫోన్ మాట్లాడే సమయంలో వారు ఎక్కర ఉన్నారో తెలియకోవటం సాధ్యపడకుండా సెక్యూరిటీ ఆప్షన్ను తీసుకువచ్చింది.


వాట్సాప్ లో అప్డేట్స్ కు కొదవేలేదు. ఎప్పటికప్పుడు తన యాప్ ను మెరుగుపరుస్తూ మరింత మంది కస్టమర్స్ కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది మెటా. లేటెస్ట్ అప్డేట్స్ తో మెస్మరైజ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా వీడియో కాల్స్ ను మరింత మెరుగు పరిస్తూ బ్యాక్ గ్రౌండ్ చేంజ్ ఆప్షన్ తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ను ఎప్పటినుంచో టెస్టింగ్ చేస్తున్న వాట్సాప్ తాజాగా విడుదల చేసింది.

ఇక ఈ ఫిల్టర్ తో వీడియో కాల్ మాట్లాడే సమయంలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇక ఇప్పటికే వాట్సాప్ లో వార్, కోల్డ్, బ్లాక్, వైట్, ప్రిజం లైట్, వింటేజ్ టీవీ లాంటి అదిరిపో విధంగా ఫిల్టర్స్ మార్చుకునే అవకాశం ఉంది. దీంతో పాటు బ్యాగ్రౌండ్ ను సైతం మార్చుకొని వ్యక్తిగత భద్రతను మెరుగుపరుచుకునే అవకాశాన్ని కల్పించింది.


ALSO READ : అదిరిపోయే డిస్కౌంట్స్, క్యాష్ బ్యాక్స్ తో ఆపిల్ సేల్ ప్రారంభం.. ఆఫర్స్ ఎలా ఉన్నాయంటే!

నిజానికి ఈ ఆప్షన్తో వీడియో కాల్లో ఉన్న యూజర్ ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారో తెలుసుకునే అవకాశం ఉండదు. బ్యాక్ గ్రౌండ్ లివింగ్ రూమ్, ఆఫీస్, బీచ్, కేఫ్ లాంటి 10 బ్యాగ్రౌండ్ ఆప్షన్ లో మార్చుకునే అవకాశం ఉంది. ఇక వాట్సాప్‌లో ప్రస్తుతం ఫిల్టర్‌, బ్యాగ్రౌండ్‌ ఫీచర్లు  వినియోగించుకొనేందుకు అందుబాటులో ఉన్నాయి. వీడియో కాల్‌ మాట్లాడే సమయంలో స్క్రీన్‌లో టాప్ లో రైట్ సైడ్ ఈ ఆప్షన్‌ ఉంటుంది. ఇందులో నుంచి కావాల్సిన ఫీచర్స్ ను ఎంచుకోవచ్చు. అయితే ఈ ఫీచర్స్  ప్రస్తుతం కొద్దిమందికి మాత్రమే అందుబాటులో ఉన్నాయి. త్వరలో వాట్సాప్ వినియోగించే ప్రతీ ఒక్క వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి.

మెటా వాట్సాప్ లో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇన్స్టాగ్రామ్ తరహాలో యూజర్లు తమ స్టేటస్ లో ఎదుటి వారిని ట్యాగ్ చేసే అవకాశాన్ని తెచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ ఫీచర్‌  తో యూజర్లు తమ స్టేటస్‌లో ఇతరులను ట్యాగ్‌ చేసే అవకాశం ఉంటుంది. దీంతో అవతలి వ్యక్తులకు కూడా నోటిఫికేషన్‌ వెళ్తుంది. ట్యాగ్‌ చేసిన వ్యక్తులకు నేరుగా సమాచారం అందుతుంది.

ఈ ఫీచర్‌ బీటా టెస్టర్‌ కోసమే ఇటీవల విడుదలైంది. ఇక వాట్సాప్‌ స్టేటస్‌ అప్‌డేట్‌లో ఫోటోలు, వీడియోలు అప్‌డేట్‌ చేస్తున్న సమయంలో క్యాప్చర్ బార్‌లో ఈ బటన్‌ కనిపిస్తుంది. ఇక స్టేటస్‌ను పోస్ట్‌ చేసే ముందు ఇతరులకు ట్యాగ్‌ చేయవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటికే ఈ ఫీచర్‌ అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే.

Related News

Tesla Model Z: ఎలక్ట్రిక్ కార్లలో సంచలనం.. టెస్లా మోడల్ జెడ్ పూర్తి వివరాలు..

Amazon vs Flipkart Laptops: అమెజాన్ vs ఫ్లిప్‌కార్ట్.. ల్యాప్‌టాప్స్‌పై డిస్కౌంట్లలో ఏది బెటర్?

Aprilia Tuono 457: గుండె ధైర్యం ఉన్నవాళ్లకే ఈ బైక్!.. అబ్బాయిలు రెడీనా?

iPhone 17 Connectivity issues: ఐఫోన్ 17, ఆపిల్ వాచ్‌లో వైఫై, బ్లూటూత్ సమస్యలు.. అసలు కారణం ఇదే..

Best Waterproof Phones: అమెజాన్ ఫెస్టివల్ సేల్ 2025.. వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపు

Wi-Fi at Night: రాత్రిపూట వైఫై ఆన్ చేసి ఉంచితే ఇంత డేంజరా? ఊహిస్తేనే భయంగా ఉంది!

Amazon OnePlus: అమెజాన్ హాట్ డీల్.. 7100mAh బ్యాటరీ, 50MP కెమెరా గల వన్‌ప్లస్ ఫోన్‌పై భారీ తగ్గింపు..

Flipkart Scam: ఫ్లిప్‌కార్ట్‌ సేల్ అంతా స్కామ్.. సోషల్ మీడియాలో నెటిజెన్ల ఆగ్రహం

Big Stories

×