E-Paper
Advertisement

Genelia: అర్ధరాత్రి విడాకులు.. నా జీవితంలో ఊహించని పరిణామం..!

Genelia: అర్ధరాత్రి విడాకులు.. నా జీవితంలో ఊహించని పరిణామం..!
Advertisement

Genelia.. జెనీలియా (Genelia).. బొమ్మరిల్లు సినిమాలో హ..హ.. హాసిని అంటూ భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది ఈ పాలబుగ్గలు సుందరి. తన అందంతో , అమాయకత్వంతో తెలుగు ఆడియన్స్ ను తన వశం చేసుకుంది. తెలుగులో చేసింది కొన్ని చిత్రాలే అయినా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె ఆ తర్వాత బాలీవుడ్ నటుడు రితీష్ దేశ్ ముఖ్ ను వివాహం చేసుకొని, అక్కడే సెటిల్ అయిపోయింది. ప్రస్తుతం హిందీ పరిశ్రమలో ఆదర్శ జంటలలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2002 లో మొదటిసారి కలుసుకున్నారు. చాలా కాలం పాటు ప్రేమించుకున్నారు కూడా.. అలా పదేళ్ల ప్రేమ తర్వాత 2012లో వీరిద్దరూ ఒక్కటయ్యారు.

అర్ధరాత్రి బ్రేకప్ చెప్పాడు..

Advertisement

ఇకపోతే రితీష్ దేశ్ ముఖ్ – జెనీలియా తరచుగా అభిమానులకు మంచి వినోదాన్ని పంచుతూనే ఉంటారు. తమ ఫ్యామిలీ లైఫ్ లో జరిగే విషయాలను అభిమానులతో షేర్ చేసుకోవడం ఈ జంటకు అలవాటు. అయితే ఒక అర్ధరాత్రి రితీష్ పెట్టిన ఒక మెసేజ్ చూసి తాను కంగారుపడి, చాలా కృంగిపోయానని జెనీలియా వ్యాఖ్యానించడంతో ఈ విషయం కాస్త హాట్ టాపిక్ గా మారింది. జెనీలియా మాట్లాడుతూ.. అర్ధరాత్రి దాటాక తెలతెల్లవారుతుండగా 2:30 గంటల సమయంలో ఆ టెక్స్ట్ మెసేజ్ చదివి ఏం జరిగిందో అర్థం కాక ఒక్క క్షణం నా మైండ్ బ్లాక్ అయింది. ఆవేదనతో గుండె బరువెక్కింది అంటూ జెనీలియా తెలిపింది.

అసలేం జరిగిందంటే..?

Advertisement

అసలు విషయంలోకి వెళితే.. ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ తో ముచ్చటించిన జెనీలియా ఈ విషయాలను వెల్లడించింది. జెనీలియా మాట్లాడుతూ.. మేము డేటింగ్ చేసుకునే సమయంలో రితీష్ చాలా ఆలస్యంగా నిద్రపోయేవాడు. అయితే ఒకరోజు రాత్రి విడిపోదాం అంటూ రితీష్ నాకు మెసేజ్ పంపాడు. మేము ఒకరితో ఒకరు డేటింగ్ చేస్తున్నప్పుడు అది ఏప్రిల్ ఫూల్స్ డే.. ఆ సమయంలో నాకు.. ఇక బ్రేకప్ అని మెసేజ్ పంపాడు. ఆ తర్వాత అతడు నిద్రపోయాడు. అయితే ఆ మెసేజ్ ను నేను చాలా ఆలస్యంగా చూశాను. అతడు రాత్రి 1:00 గంటకు పంపితే, నేను దానిని 2:30 గంటలకి చదివాను. అది చదవగానే నిరాశకు గురయ్యాను. ఉదయం 9 గంటల వరకు అంటే రితీష్ మేలుకొనే వరకు నేను ఏడుస్తూనే ఉన్నాను. మరుసటి రోజు ఉదయం రితీష్ నాకు ఫోన్ హాయ్ ఏం చేస్తున్నావ్ అని అన్నాడు. అయితే నేను నీతో మాట్లాడను అని చెప్పాను. ఆ తర్వాత రోజు రాత్రి వరకు రితీష్ పంపిన టెక్స్ట్ మెసేజ్ లు కూడా నేను చదవలేదు. కానీ రితీష్ అసలు విషయాన్ని మర్చిపోయాడు. ఆ తర్వాత నేనే గుర్తు చేయడంతో ఏప్రిల్ ఫూల్ సందర్భంగా ఇలా చెప్పాను అని చెప్పి ఆ తర్వాత కూల్ చేశారు అంటూ తెలిపారు జెనీలియా.

పెళ్లయిన తర్వాత ఆ బాధ వర్ణనాతీతం.

అంతేకాదు రితీష్ తో వివాహం జరిగిన ఒక నెల తర్వాత కూడా తాను కన్నీళ్లు పెట్టుకున్నానని చెప్పుకొచ్చింది. జెనీలియా మాట్లాడుతూ.. రితీష్ సాంప్రదాయక మరాఠీ కుటుంబానికి చెందినవారు.. ప్రతిరోజు సాంప్రదాయ దుస్తులు, భారీ ఆభరణాలతో అలంకరించుకోవాలి . ఈ విషయాలను నాతో చెప్పాడు. కొన్ని రోజులు ఇలా చేశాను కానీ ఆ తర్వాత నాతో కాలేదు. దానితో నేను ఒక రోజు ఉదయం ఇకపై ఇలా నేను చేయలేను అని కన్నీళ్ళతో నా బాధను చెప్పుకున్నాను. ఇక రితీష్ అర్థం చేసుకొని ఓదార్చాడు అంటూ జెనీలియా చెప్పుకొచ్చింది మొత్తానికైతే తమ జీవితంలో జరిగే కష్టాలను , సుఖాలను ఒకరికొకరు పంచుకుంటూ ఆదర్శ జంటగా నిలిచింది ఈ జంట.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×